శరీరంలో రోగనిరోధకశక్తి, క్యాల్షియం లోపం ఏర్పడటం వలన శరీరం అనేక రకాల నొప్పులకు గురవుతుంది. మెడనొప్పి, నడుము నొప్పి, వెన్ను, చేతులు, కాళ్లు నొప్పులు వస్తుంటాయి. వీటిని తగ్గించడానికి మనం ఈ లోపాలను అధిగమించవలసి ఉంటుంది. మందుల ద్వారా ఈ సప్లిమెంట్స్ తీసుకోవడం వలన శరీరంలో ఇతర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. సహజంగా ఆహారపదార్థాల ద్వారా క్యాల్షియం లోపాన్ని అధిగమించి శరీరం ఆరోగ్యంగా ఉండడంతోపాటు అధికబరువు సమస్య తగ్గడానికి కూడా ఇప్పుడు చెప్పబోయే పదార్ధాలు చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి.
అధికంగా కొవ్వు చేరడం వలన గుండెకు రక్తాన్ని చేర్చే రక్తనాళాలు మూసుకు పోయి గుండెపోటు, రక్తపోటు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి సమస్యలను తగ్గించుకోవడానికి మనం ప్రతిరోజు ఇప్పుడు చెప్పినట్టు ఒక డ్రింక్ తాగడం వలన ఉపశమనం పొందవచ్చు. ఒక గ్లాసు ఆవు పాలను పెట్టుకొని అందులో ఒక స్పూన్ సోంపు గింజలు వేసుకోవాలి. ఆవు పాలు త్వరగా జీర్ణమవుతుంది మరియు కాల్షియం అందిస్తుంది. శరీరంలో అధికంగా కొవ్వు చేరడానికి ముఖ్య కారణం మనం తినే ఆహారం సరిగ్గా జీర్ణం అవ్వక పోవడం. సోంపు గింజలు మనం తిన్న ఆహారాన్ని బాగా జీర్ణం చేసి శరీరంలో అధిక కొవ్వు చేరకుండా అడ్డుకుంటాయి. అలాగే దీనిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు నొప్పులను తగ్గించడంలో సహాయపడుతుంది.
తర్వాత పదార్ధం దాల్చిన చెక్క. దాల్చిన చెక్కను పొడి చేసి లేదా దాల్చిన చెక్క చిన్న ముక్క వేసుకోవాలి. దాల్చిన చెక్కలో ఉండే కొన్ని రసాయనాలు నొప్పులను తగ్గించి, శరీరం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఈ పాలు బాగా మరిగిన తరువాత వడకట్టి ఒక అర స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపులో ఉండే కర్క్యుమిన్ శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. నొప్పులను తగ్గిస్తుంది. వ్యాధుల నుండి దూరంగా ఉంచుతుంది. ఈ పాలలో ఎటువంటి పటిక లేదా పంచదార కలపకుండా తాగాలి. అలా తాగలేని వారు కొద్దిగా తేనె వేసుకోవచ్చు. వీలైతే ఉదయాన్నే తీసుకోవచ్చు లేదా రాత్రి పడుకునే ముందు తీసుకోవడం వలన మంచి నిద్ర పట్టడంతో పాటు శరీరంలో ఆందోళన, మానసిక సమస్యలు కూడా తగ్గిపోతాయి.