Homemade Face Pack For Instant Glow And Radiance Skin

ఏదైనా ఫంక్షన్ కి వెళ్లే అయిదు నిమిషాల ముందు ఇది రాసుకుని వెళ్ళినట్లయితే మీ ఫేస్ చూసి అందరూ ఆశ్చర్యపోతారు

పండగలకు, ఏవైనా శుభకార్యాలకు స్పెషల్గా కనిపించాలని అందరు ఆశపడతారు. కానీ పార్లర్ కి వెళ్లి వేలకు వేలు ఖర్చుపెట్టి ఫేసియల్స్ కూడా చేయించుకుంటారు. మన డబ్బు మరియు సమయం వృధా చేసినప్పటికీ ఎటువంటి ప్రయోజనం లేకపోగా కొత్త సమస్యలు వస్తాయి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నాచురల్ గా మీ ముఖం నిముషాల్లో అందంగా, కాంతివంతంగా తయారవుతుంది. ఈ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. దీనికోసం ముందుగా ఒక ఫ్రెష్ గా ఉన్న బీట్ రూట్ తీసుకుని తొక్క చెక్కి ముక్కలుగా కట్   చేసుకోవాలి.

       ఈ ముక్కలను మిక్సీ జార్ లో వేసి నీళ్లు వేసుకోకుండా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా  మిక్సీ పట్టుకున్న  పేస్ట్ నుండి ఏదైనా  క్లాత్ సహాయంతో  జ్యూస్ను వడకట్టి ఉంచుకోవాలి. వడకట్టుకున్న జ్యూస్ ను గిన్నెలో వేసి స్టవ్ మీద పెట్టి దగ్గర పడేంతవరకు మరిగించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దానికి బియ్యప్పిండిని కొంచెం కొంచెంగా  కలుపుకోవాలి. ఇది పేస్ట్ లా  కాకుండా డ్రై గా ఉండే అంతవరకు  పిండి వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. తర్వాత ఈ పిండిని 24 గంటల పాటు ఆరనివ్వాలి.

       తర్వాత ఏదైనా గాజు సీసాలో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు. ఈ ప్యాక్ ను ముఖానికి ఎలా అప్లై చేసుకోవాలి అని తెలుసుకుందాం.  ఒక బౌల్ తీసుకొని అందులో సరిపడినంత ఈ పౌడర్  వేసుకోవాలి. దానిలో ఒక చెంచా రోజ్ వాటర్ జెల్ వేసుకోవాలి. రోజ్ వాటర్ జెల్ సూపర్ మార్కెట్లలో దొరుకుతుంది . తర్వాత దీనిలో ఒక చెంచా అలోవెరా జెల్ వేసుకోవాలి. ఈ మూడింటిని బాగా కలుపుకోవాలి. మగవారు ఐతే ఇలా అప్లై చేసుకోవచ్చు. ఆడవాళ్లు ఐతే ఒక చెంచా కస్తూరి పసుపు వేసుకోవాలి.  కస్తూరి పసుపు లేకపోతే కొమ్ములు పట్టించిన పసుపు వేసుకోవాలి.

        ప్యాకెట్ పసుపు మాత్రం  వేసుకోకూడదు. బాగా కలుపుకుని ముఖానికి బాగా అప్లై చేసుకోవాలి. అప్లై చేసిన తర్వాత కొద్దిసేపు ఆరనివ్వాలి. తర్వాత మృదువుగా మసాజ్ చేసుకుంటూ నీటితో కడిగేసుకోవాలి. ఇలా వారానికి ఒక సారి చేయడం వల్ల మీ ముఖం అందంగా, కాంతివంతంగా తయారవుతుంది. ముఖం పై ఉండే  నల్లని మచ్చలు, పింపుల్స్, డార్క్  సర్కిల్స్, మంగు మచ్చలు  వంటి  సమస్యలు తగ్గుతాయి. ఏదైనా ఫంక్షన్ కి వెళ్లే పది నిముషాలు  ముందు ఈ  ప్యాక్ అప్లై చేసుకుంటే సరిపోతుంది. మీ ముఖం అందంగా, కాంతివంతంగా కనిపిస్తుంది. ఈ ప్యాక్ను వారానికి ఒకసారి వేసుకుంటే నీ ముఖం తెల్లగా మెరిసిపోతుంది.

Leave a Comment

error: Content is protected !!