Homemade face pack for pimples and fairness

100 సంవత్సరాల క్రితమే ఈ కాయలతో ఫేషియల్ చేసుకునేవారు, ఈ కాయలు ఎక్కడ దొరికినా తీసుకోండి మీ ముఖం చందమామ మెరిసిపోతుంది

ప్రస్తుతం అందరికీ ముఖం పై నల్లని మచ్చలు, పిగ్మెంటేషన్, బొంగు మచ్చలు వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యలు  ఉండటం వల్ల నలుగురిలో తిరగాలంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. ఈ సమస్యలను తగ్గించుకోవడం కోసం మార్కెట్లో దొరికే రకరకాల క్రీములను ఉపయోగిస్తూ ఉంటారు. కానీ వాటి వలన అనేక సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. మనం నాచురల్ పద్ధతిలో కొన్ని చిట్కాలు ట్రై చేసినట్లయితే ఈ సమస్యలన్నింటినీ తగ్గించుకోవచ్చు. 

      నేచురల్ పద్ధతి ఉపయోగించడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మనం ఈ సమస్యలను తగ్గించుకోవడానికి ఈ ఫేషియల్  తయారు చేసుకోవాలి. దీనికోసం ముందుగా మనం  ఒక జాజికాయ తీసుకోవాలి. జాజికాయను గ్రేటర్ సహాయంతో  మెత్తగా పౌడర్లా చేసుకోవాలి.  ఈ పొడి ఒక బౌల్ లో  వేసుకుని కొంచెం పాలు వేసుకొని కలుపుకోవాలి.  ఆవుపాలు లేకపోతే  గేదెపాలు లేదా ప్యాకెట్ పాలను కూడా ఉపయోగించుకోవచ్చు. ఆవుపాలను ఉపయోగించడం వలన రిజల్ట్ బాగుంటుంది. 

       రెండింటిని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. స్నానానికి వెళ్ళడానికి ఒక గంట ముందు దాన్ని ముఖానికి అప్లై చేసి ఐదు నుంచి పది నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి. ఇంకా మిగిలిన మిశ్రమాన్ని రెండవసారి కూడా అప్లై చేసుకొని ఒక పదిహేను నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత మిగిలిన మిశ్రమంతో ఇంకొకసారి అప్లై చేసుకొని మళ్లీ ఐదు నుంచి పది నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి ముఖం అందంగా, కాంతివంతంగా తయారవుతుంది. 

           మసాజ్ ఎప్పుడు సర్కులర్ మోషన్ లో కింద నుండి పైకి చేసుకోవాలి. పై నుండి కిందకు చేయడం వల్ల ముఖం పై ఉండే ముడతలు పోవు. కింద నుండి పైకి చేయడం వలన ముఖంపై ఉండే ముడతలు తగ్గుతాయి. మసాజ్ పైనుండి కిందికి చేసేవారికి 60 ఏళ్లకు రావలసిన ముడతలు 40 ఏళ్లకే వచ్చేస్తాయి. ఈ ప్యాక్ ను అప్లై చేయడం వలన ముఖంపై ఉండే నల్లని మచ్చలు, పిగ్మెంటేషన్, బొంగు మచ్చలు తగ్గుతాయి. ఈ ప్యాక్ అప్లై చేసిన వెంటనే సబ్బు యూస్ చేయకూడదు.  ఈ ప్యాక్ ను ప్రతి రోజూ ఉపయోగించడం వలన ముఖంపై ఎటువంటి మచ్చలు లేకుండా చాలా క్లియర్ గా ఉంటుంది. ఈ చిట్కా చాలా ఏళ్ళ క్రితం నుండి ఉపయోగిస్తున్నారు. ఇది చాలా మంచి ఫలితం ఇస్తుంది.

Leave a Comment

error: Content is protected !!