Homemade Medicine Reduces Cold and Cough

అల్లం గురించి మీకు తెలియని కొత్త కోణం….!

ఆల్లం కొన్ని శతాబ్దాల నుంచీ వైద్యంలో ప్రధానంగా  వాడుతున్నారు. పచ్చళ్ళలోనూ, కూరల్లో వేసే మసాలాలోనూ దీన్ని విరివిగా వాడుతారు. అల్లం అనేది నోటి దుర్వాసనను పోగోడుతుంది. ప్రమాదకర బ్యాక్టీరియాలను నాశనం చేసి దంతాలు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. రక్తంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గించే గుణం అల్లానికి ఉంది. కొవ్వు కంట్రోల్ చేయడానికి లివర్ ని ఆక్టివేట్ చేస్తుంది. రక్తప్రసరణ చురుగ్గా అయ్యేలా  చేస్తుంది.  ఆస్తమా  ఉన్న వారికి ఉపశమనం కలిగిస్తుంది.   అల్లం రసం తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అల్లంను ఎండబెట్టి పొడి లాగ చేసుకుని ఆ పొడిని చిటికెడు ఉప్పును కలుపుకోవాలి.

                ఇలా కలిపిన దాన్ని భోజనానికి ముందుగానీ, తర్వాతగానీ తీసుకుంటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అల్లం మలబద్ధకం ఉన్నవారికి తగ్గిస్తుంది. మోషన్ ఫ్రీ అయ్యేలా చేస్తుంది. అల్లం ఒక మంచి యాంటి ఆక్షిడెంట్ గా పనిచేస్తుంది. దీనిని తినడం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఈ అల్లం టీ తాగడము వలన అజీర్తి తగ్గుతుంది. అల్లంలో జింజెరోల్ అనే కెమికల్ ఉంటుంది. ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్లు దగ్గు, జలుబు, గొంతు నొప్పి నుంచి త్వరగా కోలుకోవడానికి ఉపయోగపడుతుంది. అల్లంని తీసుకుని గ్రైండ్ చేసి అల్లం రసం ఒక స్పూన్, తేనె ఒక స్పూన్, నిమ్మరసం ఒక స్పూన్ కలిపి దీనిని 10 రోజుల పాటు తాగాలి.

               ఇలా తాగితే జలుబుని, దగ్గుని తగ్గించడానికి అద్భుతంగా పనికొచ్చే యాంటీ ఆక్సిడెంట్ దీంట్లో ఉంటాయి. అందుకని ఈ భాగాల్లో శ్లేష్మాన్ని తగ్గించి బయటికి వెళ్లేలా చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. తలనొప్పిగా ఉంటే అల్లం టీ తాగితే చాలు అన్నీ క్షణాల్లో మాయమై మంచి ఉపశమనం కలుగుతుంది. అధిక బరువుని తగ్గించే శక్తి కూడా అల్లం టీకి ఉంది. వయసు పైబడిన వారికి నడుము నొప్పి, కీళ్ల నొప్పులు బాధిస్తుంటాయి. అలాంటి వారికి అల్లం టీని రోజూ తీసుకుంటే  చాలా వరకు నొప్పులు తగ్గుతాయి. అధిక బరువుని తగ్గించే శక్తి కూడా అల్లం టీకి ఉంది. చెడు కొలెస్ట్రాల్‌ని దూరం చేసి, గుండె ఆరోగ్యవంతంగా చేస్తుంది.

                 ముఖ్యంగా ఆడవారిలో పీరియడ్స్ సమయంలో వచ్చే సమస్యలకు అల్లం టీ ఒక ఔషధంగా పనిచేస్తుంది. ఇది ఒక న్యాచురల్ పవర్ ఫుల్ మందు అందుకని ఒక పది రోజులు దీనిని వాడితే సరిపోతుంది.

Leave a Comment

error: Content is protected !!