జుట్టు ఎంత పొడవుగా ఉన్నా ఆరోగ్యంగా, చుండ్రు సమస్యలు లేకుండా ఉండడం చాలా ముఖ్యం. అలాంటి ఆరోగ్యకరమైన జుట్టు కోసం మనం కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. బయటకు వెళ్ళినప్పుడు తలస్నానం చేసిన జుట్టుతో మాత్రమే వెళ్ళాలి.
నూనె రాసిన జుట్టు దుమ్ము, పొల్యూషన్ ఆకర్షిస్తుంది.దానివలన జుట్టు సమస్యలు వస్తాయి. మంచి ఆహారం కూడా జుట్టు ఆరోగ్యం గా ఉండేలా చేస్తుంది. వీటితో పాటు మంచి హెల్తీ హెయిర్ కోసం ఈ చిట్కా పాటిస్తే మంచి ఫలితాలు ఉంటాయి.
దాని కోసం మనం తీసుకోవాల్సిన పదార్థాలు అన్నీ సహజమైనవి, పురాతన కాలం నుండి జుట్టు సంరక్షణ కోసం ఉపయోగిస్తున్నవి. ఆయుర్వేద గుణాలు కల ఆ ప్రొడక్ట్స్ ఏంటో ఎలా వాడుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక పెద్ద అ అలోవేరా కొమ్మ తీసుకోండి.
దానిని కోసిన తర్వాత వచ్చే పసుపు రంగు ద్రవం పోయిన తర్వాత శుభ్రంగా కడిగి పైన భాగం కట్ చేసి లోపలి జెల్ తీసుకోండి. ఇది ఒక అర కప్పు ఉండేలా తీసుకొని మెత్తగా మిక్సీలో పేస్ట్ గా చేసుకోండి. దీనిలో గిలకొట్టిన పెరుగు రెండు స్పూన్లు వేసుకోండి. ఈ మిశ్రమంలో రెండు స్పూన్ల శీకాకాయ పొడి కూడా వేసుకోవాలి.
అలోవెరా జెల్ దెబ్బతిన్న కుదుళ్లులోని చర్మకణాలను కాపాడి తిరిగి పునర్నిర్మించి హెల్త్ స్కాల్ఫ్ అందిస్తాయి. అలాగే జుట్టును మృదువుగా తయారు చేయడంలో సహాయపడతాయి. పెరుగులో ఉండే మంచి బాక్టీరియా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా అడ్డుకుంటుంది. జుట్టుకు కావలసిన పోషణను అందించి జుట్టును మృదువుగా చేయడంలో తోడ్పడుతుంది.
శీకాకాయ పొడి జుట్టు మందంగా పెరగడంలో సహజంగా జుట్టు నల్లగా ఉండేందుకు, చర్మం ఆరోగ్యంగా జుట్టు దృఢంగా ఉండేందుకు సహాయపడుతుంది. ఈ మిశ్రమాన్ని తలస్నానం చేసిన జుట్టుకు కుదుళ్ళ నుండి అప్లై చేసి ఆరిన తర్వాత తల స్నానం చేయాలి.
అలాగే శీకాకాయ హెయిర్ ప్యాక్ ఎలా వాడాలి అనుకునేవారు రెండు స్పూన్ల శీకాయ పొడి తీసుకొని అందులో రెండు గుడ్లు పసుపు భాగం తీసేసి ఎగ్ వైట్ తో మాత్రమే కలపాలి. శీకాకాయ పొడి, గుడ్డులోని తెల్ల భాగాన్ని కలిపిన మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేసి ఆరిన తర్వాత కడిగేస్తే జుట్టుకు కావలసిన ప్రొటీన్లు పుష్కలంగా అంది జుట్టు రాలే సమస్య తగ్గుతుంది.