బయట కెమికల్స్తో దొరికే షాంపూలతో అనేక దుష్ప్రభావాలకు గురై జుట్టు రాలిపోవడం వంటి సమస్యలతో బాధపడేవారు ఇంట్లోనే హెర్బల్ షాంపూ తయారు చేసుకోవచ్చు. దాని కోసం మనం తీసుకునే పదార్థాలు జుట్టు పెరుగుదలను పెంచడంతో పాటు జుట్టు సమస్యలను తగ్గించి జుట్టును శుభ్రం చేయడానికి కూడా సహాయపడతాయి. ఆ పదార్థాలు ఏంటో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
ఒక కప్పు కుంకుడుకాయ గింజలను తొలగించి తీసుకోవాలి. ఒక కప్పు శీకాకాయ, రెండు స్పూన్ల మెంతులు తీసుకొని వేడి నీటిలో రాత్రంతా నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న వీటిని బాగా పిసికి రసం బయటకు వచ్చేలా చేయాలి. తరువాత దీనిని ఒక ఇనుప పాత్రలో వేసుకోవాలి. స్టౌ పై పెట్టుకొని బాగా నురుగు వచ్చేలా మరిగించాలి. ఇలా మరిగిన తరువాత ఈ ద్రవాన్ని ఒక గుడ్డలో లేదా వడకట్టు లో వేసి వడకట్టుకోవాలి. ఈ ద్రవాన్ని పది రోజుల వరకు ఫ్రిజ్ లో స్టోర్ చేసుకోవచ్చు. అంతకు మించి నిల్వ ఉండదు.
ఇందులో వాడిన పదార్థాలు అన్నీ జుట్టు పెరుగుదలకు సహాయపడతాయని మనకి తెలుసు. కెమికల్స్ ఉండే షాంపూ బదులు దీన్ని వాడడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలకు రావాల్సిన అవసరం ఉండదు. చిన్న వయస్సులోనే తెల్లజుట్టు సమస్య కూడా దూరం పెట్టవచ్చు. తర్వాత చిట్కా కోసం మనం తీసుకోవాల్సిన పదార్థాలు కుంకుడుకాయ పొడి, శీకాయ పొడి, ఆమ్ల పొడి, దంచిన బియ్యము ఇవన్నీ సమాన భాగాలుగా తీసుకొని కలిపి ఒక గాజు కంటైనర్ లో పెట్టి ఫ్రిజ్లో స్టోర్ చేసుకోవచ్చు.
ఇలా స్టోర్ చేసుకున్న ఈ పొడి సంవత్సరం వరకు నిలువ ఉంటుంది. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక పాత్రలో దీనిని రెండు స్పూన్ల పౌడర్ వేసుకొని ఒక గ్లాస్ నీటిలో మరిగించాలి. ఇది బాగా మరిగి ద్రవం చిక్కబడి మంట ఆపేసి క్లాత్ తో వడకట్టుకోవాలి. ఇలా ఎప్పుడు కావాలంటే అప్పుడు తయారు చేసుకుని వాడుకోవచ్చు. కలిపి పెట్టుకున్న ఈ పొడిని ఫ్రిజ్ లో స్టోర్ చేసుకుంటే ఒక సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది. బయట పెట్టుకుంటే ఒకటి లేదా రెండు నెలల వరకు ఉండవచ్చు. ఇందులో వాడిన పదార్థాలు అన్ని జుట్టు పెరుగుదలను పెంచేవే.