చాలా మందికి ముఖం పై పింపుల్స్, నల్లటి మచ్చలు, టాన్, డార్క్ పాచెస్ వంటి సమస్యలు ఉంటాయి. కొందరికి చర్మం కాంతి హీనంగా, రఫ్ గా అయిపోతుంది. వేలకు వేలు ఖర్చు పెట్టి క్రీములు కొన్నా ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇంట్లోనే తక్కువ ఖర్చుతో చేసుకునే ఈ క్రీముతో చర్మం అందంగా, కాంతివంతంగా తయారవుతుంది. ఎన్ని క్రీములు వాడినా తగ్గని పింపుల్స్, టాన్, డార్క్ పాచెస్ ఈ క్రీముతో ఈజీగా తగ్గిపోతాయి. ఈ చిట్కా వరుసగా ఏడు రోజులు వాడినట్లయితే ఫలితం బాగుంటుంది.
చర్మం సాఫ్టుగా, చాలా క్లియర్ గా ఉంటుంది. ఈ చిట్కా కోసం కావాల్సినవి బాదం, పిస్తా, అలోవెరా జెల్, ఆరంజ్ పీల్, బాదం ఆయిల్,రోజ్ వాటర్, ఫ్రెష్ క్రీమ్ లేదా మీగడ. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని ఆరు బాదం పప్పులు నానబెట్టుకోవాలి. బాదంలో యాంటియోక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇంకొక బౌల్ తీసుకుని ఆరు పిస్తా పప్పులను నానబెట్టుకోవాలి. వీటిని రాత్రంతా లేదా ఆరు గంటల పాటు నానబెట్టుకోవాలి. ఒక ఆరెంజ్ తీసుకుని దాని ఫీల్ మొత్తం తీసుకోవాలి.
ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో నానబెట్టిన బాదం, పిస్తా, కమలా తొక్కలను వేసి కొంచెం రోజ్ వాటర్ లేదా కొంచెం నీటిని వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఈ మిశ్రమాన్ని దానిలో వేసి జ్యూస్ వడకట్టుకోవాలి. ఫిల్టర్ చేయగా మిగిలినవి పిప్పిని స్క్రబ్ లాగా కూడా ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని రెండు చెంచాల ఫ్రెష్ క్రీమ్ లేదా పాలమీగడను తీసుకోవాలి. దీనిలో నాలుగు చెంచాలు ముందుగా తయారు చేసుకున్న జ్యూస్ వేసుకోవాలి.
తర్వాత రెండు చెంచాల అలోవెరా జెల్, రెండు చెంచాల బాదం నూనె వేసి బాగా కలుపుకోవాలి. ఈ క్రీమ్ని ఏదైనా గాజు సీసాలో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు. 7 రోజుల వరకు నిల్వ ఉంటుంది. దీనిని రోజూ రాత్రి పడుకునే ముందు లేదా ఉదయం కూడా అప్లై చేసుకోవచ్చు. దీని మొహం పై చిన్న చిన్న డాట్స్ లా పెట్టి నెమ్మదిగా మసాజ్ చేయాలి. 2 నిమిషాల పాటు మృదువుగా మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ బాగా జరుగుతుంది.
ఇలా వరుసగా ఏడు రోజుల పాటు చేయడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది.ఈ క్రీమ్ అప్లై చేయడం వలన చర్మం మృదువుగా, కాంతివంతంగా తయారవ్వడమే కాకుండా పింపుల్స్, డార్క్ పాచెస్, టాన్ రెమోవాల్గా బాగా సహాయపడుతుంది.