ప్రస్తుత కాలం వస్తున్న మార్పులు బట్టి ఆహారపు అలవాటును బట్టి మన శరీరం బలహీన పడిపోయి చిన్న చిన్న పనులు చేసిన లేదా చిన్న చిన్న దెబ్బలు తగిలిన వాటి వలన వచ్చే నొప్పులు మనం తట్టుకోలేనంతగా ఉంటున్నాయి. వాటికోసం ఎన్ని ఉపయోగించిన తాత్కాలిక ఉపశమనం అందిస్తున్నాయి గాని శాశ్వత పరిష్కారం లభించడం లేదు. అంతేకాకుండా వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు ఒళ్ళు నొప్పులతో మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు. హాస్పిటల్ కి వెళ్ళినా సరే వారిచ్చే కెమికల్ మందులు తాత్కాలిక ఉపశమనం లభిస్తుంది.
కానీ కొన్ని రోజులు ఆ మందులు వాడడం మానేస్తే మరల నొప్పులు తిరగబడతాయి. ఇప్పుడు మనం తయారు చేసుకోబోయే రెమిడి ఆ నొప్పుల నుంచి శాశ్వతంగా ఉపశమనం అందిస్తుంది. ఇది తయారు చేసుకోవడానికి మనకు ఖర్చు కూడా తక్కువ అవుతుంది. ఈ రెమిడి తయారు చేసుకోవడానికి మనకు ముందుగా కావలసింది ఉమ్మెత్త కాయలు. ఉమ్మెత్త కాయలు మనకు రోడ్లు ఇరువైపులా ఎక్కువగా లభిస్తూ ఉంటాయి. వీటిని నాలుగు కాయలు తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
ఉమ్మెత్త కాయలో కెమికల్ కాంపౌండ్స్ మనకు నొప్పి నుంచి విముక్తి అందించడానికి సహాయపడతాయి. తర్వాత మనకు కావలసింది ఆవనూనె. ఈ నూనెను ఉపయోగించడం వలన నొప్పుల నుంచి త్వరిత ఉపశమనం అందిస్తుంది. ఇప్పుడు రెమిడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు గిన్నె తీసుకొని అందులో ఉమ్మెత్త కాయలు వేసుకొని ఆ కాయలు మునిగేంత వరకు ఆవ నూనెను వేసుకొని 20 నిమిషాల పాటు బాగా మరగనివ్వాలి. ఇలా మరిగించిన తర్వాత నూనె రంగు మారుతుంది. ఇలా నూనె రంగు మారిన తర్వాత స్టవ్ ఆపి నూనె చల్లారనివ్వాలి.
ఆ తర్వాత నూనెను ఏదైనా సీసాలోకి వడకట్టుకోవాలి. ఇలా తయారైన నూనెను ఎక్కడ నొప్పులు ఉన్నా సరే అక్కడ గోరు వెచ్చగా చేసుకొని రాసుకొని పదినిమిషాల పాటు మసాజ్ చేయాలి. ఇలా చేసిన రెండు రోజులకే మనకి మంచి ఉపశమనం లభిస్తుంది. కానీ ఈ నూనెను చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి. ఈ నూనెను కంటికి, పంటీకి ముఖ భాగాలకు తగలకుండా చూసుకోవాలి. అంతేకాకుండా ఉమ్మెత్త కాయలను కోసిన వెంటనే చేతులను నీటిగా శుభ్రం చేసుకోవాలి. లేదంటే ఇందులో ఉండే పవర్ఫుల్ కెమికల్స్ వలన హాని జరిగే ప్రమాదం ఉంటుంది