జుట్టు ఊడిపోవడం, జుట్టు చిట్లడం, చుండ్రు సమస్యలు చిన్నతనంలోనే తెల్ల వెంట్రుకలు రావడం ఇలాంటి అనేక జుట్టుకు సంబంధించిన సమస్యలతో చాలా మంది బాధపడుతున్నారు. వీటికి నివారణ కోసం అనేక రకాల ప్రోడక్ట్ మార్కెట్లో అందుబాటులో ఉన్న వాటిని వాడడం వల్ల వచ్చే దుష్ప్రభావాలు, వాటికి అయ్యే ఖర్చు భరించడం కష్టం అవుతుంది. మన ఆయుర్వేదంలో వీటికి అనేకరకాలైన ఇంటి చిట్కాలు అందుబాటులో ఉన్నాయి. ఇంట్లో ఉండే పదార్థాలను ఉపయోగించి చేసే చిట్కాలు నెమ్మదిగా జుట్టు సమస్యలను తగ్గించి అందమైన దృఢమైన జుట్టు అందించడంలో సహాయపడతాయి.
దాని కోసం మనం తీసుకోవలసినవి మెంతులు, కలోంజి, లవంగాలు, ఉసిరి ముక్కలు, ఎండబెట్టిన కరివేపాకు , తులసి ఆకులు ఎండబెట్టినవి. వీటిని ఉపయోగించి తయారు చేయడానికి మనం ఒక బాటిల్ తీసుకోవాలి. అందులో రెండు స్పూన్ల మెంతులు, రెండు స్పూన్ల కలోంజి విత్తనాలు, రెండు స్పూన్ల ఉసిరి ముక్కలు, ఎండబెట్టిన కరివేపాకు రెండు రెమ్మలు, ఎండబెట్టిన తులసి ఆకులు కొన్ని వేసుకోవాలి. అందులో లవంగాలు అయిదారు వేసుకోవాలి. వీటిలో ఇంట్లో ఆడించిన కొబ్బరి నూనె వేసుకోవాలి.
హోమ్ మేడ్ కొబ్బరి నూనె అందుబాటులో లేకపోతే బయట కొన్న కంపెనీ బాటిల్స్ కూడా ఉపయోగించవచ్చు. ఈ నూనెను ఐదారు రోజులు అలాగే ఉంచి మధ్యమధ్యలో స్పూన్‌తో కలుపుతూ ఉండాలి. ఐదు రోజుల తర్వాత ఈ పదార్థాల ఔషధ లక్షణాలు నెమ్మదిగా నూనెలో విడుదలవడం మొదలవుతుంది. అప్పుడు ఈ నూనెను తలకు ఉపయోగించడం వలన మన జుట్టు లో ఉన్న సమస్యలు తొలగిపోయి అందమైన జుట్టు మన సొంతమవుతుంది.
ఇందులో ఉపయోగించిన పదార్థాలన్నీ ఇంట్లోనే ఉంటాయి కనుక ఎటువంటి ఖర్చు ఉండదు. మెంతులు, కలోంజీ సీడ్స్, ఉసిరి, జుట్టులోని బ్యాక్టీరియల్, ఫంగల్ ఇన్ఫెక్షన్ తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతాయి. లవంగాలు జుట్టు కుదుళ్లను బలపరచడం లో సహాయపడుతుంది ఇందులో ఉపయోగించిన తులసి కరివేపాకు యాంటీ ఫంగల్ యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కలిగినవి. అంతేకాకుండా ఇందులో ఉపయోగించిన ఈ పదార్థాలన్నీ తెల్ల జుట్టుని నల్లగా మార్చడంలో కూడా సహాయపడతాయి.