Homoeopathic Medicine for hair fall treatment

ఇది రాస్తే ఒక వెంట్రుక కూడా రాలదు, విపరీతంగా పెరుగుతుంది

ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరికి జుట్టు రాలడం సమస్య చాలా ఎక్కువగా ఉంది. దానికి కారణాలు అనేకం వాతావరణ కాలుష్యం, మానసిక ఆందోళన,  జుట్టు కావలసిన పోషకాలు అందకపోవడం, థైరాయిడ్, హార్మోన్ ఇన్ బాలన్స్ వంటివి.  మనం జుట్టు పెరగడానికి పై పైన ఏమి పూసిన ప్రయోజనం ఉండదు. జుట్టుకి  కావలసిన పోషకాలు అందించాలి, శరీరంలో విటమిన్ డెఫిసియన్సీ,హార్మోన్ ఇన్ బాలన్స్, మానసిక ఆందోళన  వంటి సమస్యలు తగ్గడానికి జాగ్రత్తలు తీసుకుని అప్పుడు హెయిర్ ప్యాక్స్, ఆయిల్స్ ఉపయోగించినట్లయితే ప్రయోజనం ఉంటుంది.  

     ఈ ప్యాక్ ఉపయోగించినట్లయితే జుట్టు రాలడం తగ్గి జుట్టు విపరీతంగా పెరుగుతుంది. దీనికోసం ముందుగా కలబంద మట్ట తీసుకుని శుభ్రంగా కడిగి పై పీల్ మొత్తం తీసేసి జెల్ మాత్రమే ఒక కప్ తీసుకోవాలి.  అలోవెరా జుట్టు స్మూత్గా చేసి జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.  ఒక కప్పు మునగాకును తీసుకోవాలి మునగాకు అన్ని విటమిన్ సి పుష్కలంగా కలిగి ఉంటుంది.  మునగాకు  జుట్టు రాలడాన్ని తగ్గించి జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగడానికి సహాయపడుతుంది. చుండ్రు, ఇన్ఫెక్షన్, దురద వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. 

     ఒక కప్ పుల్లటి పెరుగు తీసుకోవాలి. పెరుగు జుట్టును మోయిశ్చరైజ్ చేసి చుండ్రు, ఇన్ఫెక్షన్, దురద వంటి సమస్యలను తగ్గిస్తుంది. దీనిలో ఒక గుడ్డు వేసుకోవాలి. గుడ్డు జుట్టుకి కావాల్సిన ప్రోటీన్స్ అందించి జుట్టు ఆరోగ్యంగా పెరగడంలో సహాయపడుతుంది.  మాకు గుడ్డు వాసన పడదు అనుకున్నవారు గుడ్డు బదులుగా మందార పొడి వేసుకోవచ్చు. వీటన్నిటిని కలిపి మెత్తగా మిక్సీ పట్టుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ పేస్ట్ మిక్సీ పట్టిన వెంటనే  నురగలాగా ఉంటుంది. 

       ఒక పది నిముషాలు పక్కన పెట్టుకోవాలి.  ఈ మిశ్రమం పలుచగా ఉంది అనిపిస్తే కొంచెం  మెంతి పొడి లేదా మందార పొడి వేసి కలుపుకోవాలి. ఈ ప్యాక్ అప్లై చేసుకున్నప్పుడు ఆయిల్ హెయిర్ మీద అప్లై చేసుకుంటే బాగా పని చేస్తుంది. ఈ ప్యాక్ ను జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్లై చేసుకోవాలి. అప్లై చేసిన తర్వాత అరగంట పాటు అలాగే ఉండనివ్వాలి. తర్వాత ఏదైనా మంచి షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒక సారి చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. అంతేకాకుండా జుట్టు చివర్లు చిట్లడం, డ్యామేజ్ హెయిర్, చుండ్రు, దురద, ఇన్ఫెక్షన్ వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. ఈ ప్యాక్ ఉపయోగించినట్లయితే జుట్టు ఆగకుండా పెరుగుతూనే ఉంటుంది.

Leave a Comment

error: Content is protected !!