ఇంట్లో కొన్ని పనులు చేయకూడదు,కొన్ని తప్పకుండా చేయాలి అని పెద్దలు చెబుతూ ఉంటారు. కానీ ఈ తరం వారిలో అవి మూఢనమ్మకాలు అని అంటారు. కానీ అలా చెప్పే వాటిలో సైన్స్ పరమైన రహస్యం దాగి ఉంటుంది. అలా పెద్దలు చెప్పిన విషయాలు వినడం వలన ఇంట్లో సిరిసంపదలతో ఆరోగ్యంగా ఉంటారని నమ్మకం. అలాంటి కొన్ని విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
తులసి మొక్కను చాలా మంది ఇంట్లో పెట్టుకోరు. కానీ ప్రతి ఇంటిలోను తులసి మొక్క కానీ తులసి కోట కానీ ఉండాలి అనేది పెద్దలమాట ఇంట్లో తులసి మొక్క ఉండడం వలన అనేక అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండడంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని చెబుతారు. అలాగే చీపురు ఎలా పడితే అలా పడేయకూడదు. కొంతమంది కుంచెను కిందకి, పట్టుకునే భాగం పైకి పెడుతుంటారు. ఇలా పెట్టడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం ఉండదని చెబుతుంటారు. చీపురు కట్ట క్రింద ఒక పక్కగా ఏటవాలుగా వేయడం మంచిదని పెద్దల మాట.
అలాగే ఇంట్లో అందంగా పెట్టుకునే నెమలి పించం లక్ష్మీదేవి పూజ చేసేటప్పుడు అక్కడ పెట్టి పూజించడం వలన చాలా మంచి జరుగుతుందని చెబుతారు. ఇక ఇంట్లో వారికి కొబ్బరి నూనె ఇవ్వడం లేదా కొబ్బరి నూనెను తలకు పెట్టడం వలన ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ మన ఇంట్లో వారు కాని వారికి తలకు నూనె పెట్టడం లేదా చేతికి కొబ్బరి నూనె ఇవ్వడం వలన దరిద్రం పడుతుందని చెబుతారు. అందుకే నూనెని ఎవరికీ ఇవ్వకూడదని చెబుతుంటారు.
గుమ్మం దగ్గర పెట్టే గాలికి ఊగే అలంకరణలు (విండ్ చైమ్స్) పెడుతుంటారు. దీనివలన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా పాజిటివ్ ఎనర్జీ వస్తుందని, మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని నమ్మకం అందుకే ఇంటికి పెట్టుకోవడం వల్ల మెడిటేషన్ చేసినంత ఫలం లభిస్తుంది. ఇక ప్రతి ఇంట్లోనూ మనీప్లాంట్ తప్పకుండా ఉండాలి. దీనివలన ఇంట్లో డబ్బుకు కొదవ ఉండదని చెబుతుంటారు. మనీ ప్లాంట్ను ఎక్కడ పడితే అక్కడ కాకుండా ఆగ్నేయ దిశలో పెట్టడం వలన ఇంటికి మంచిది. ఇప్పుడు చెప్పిన విషయాలను పాటించడం వలన ఆరోగ్య సమస్యలు మరియు ఆర్థిక సమస్యలు లేకుండా ఆనందంగా ఉండవచ్చు.