వాము జీర్ణసమస్యలు తగ్గించడానికి ఎక్కువగా ఉపయోగించే విత్తనాలు, ఇవి సాధారణంగా అన్ని భారతీయ గృహాలలో వంటలలో ఉపయోగిస్తుంటారు. శాస్త్రీయం నామం ట్రాకిస్పెర్మ్ అమ్మీ అని పిలుస్తారు, ఈ హెర్బ్ భారతదేశం మరియు మధ్యప్రాచ్యానికి చెందినది. దాని చేదు మరియు ఘాటుగా తీవ్రమైన రుచి ఉన్నప్పటికీ, ఇది వివిధ వంటకాలకు ప్రత్యేకమైన రుచిని మరియు సుగంధాన్ని జోడిస్తుంది.
కానీ మీరు వాము ఆకుల గురించి ఎప్పుడైనా విన్నారా? ఎక్కువగా ఇళ్ళలో పెంచుకునే ఈ మొక్కల ఆకులను నమిలితే వాము వాసన వస్తుంది. దీనిని బిషప్ కలుపు మొక్క అని కూడా పిలుస్తారు. ఇది మందపాటి ఆకుపచ్చ ఆకులు మరియు మంచి సువాసన కలిగిన అలంకార మొక్క. వాము ఆకులు దాని విత్తనాల మాదిరిగా వంట మరియు ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉంటాయి.
కడుపు నొప్పిని నయం చేస్తుంది
కడుపు నొప్పులు మరియు ఇతర కడుపు, జీర్ణ సమస్యలను నయం చేయడంలో వాము ఆకులు ఉపయోగపడతాయని నిరూపించబడింది. ఈ ఆకులను నమలడం వల్ల శరీరంలోని అసౌకర్యం కడుపుబ్బరం వంటి సమస్యలు నుండి ఉపశమనం పొందవచ్చు.
సాధారణ జలుబును నయం చేస్తుంది
తేనెతో కలిపి తీసుకున్నప్పుడు వాము ఆకుల రసం ఎక్కువగా శిశువులలో సాధారణ జలుబు మరియు దగ్గును నయం చేయడంలో సహాయపడుతుంది. ఎటువంటి అంటువ్యాధులకు అయినా వ్యతిరేకంగా వారి నిరోధక శక్తిని పెంచడానికి కూడా ఇవి సహాయపడతాయి.
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
వాము ఆకులు శరీరంలో జీర్ణక్రియను ప్రోత్సహించడంలో సహాయపడతాయి. జీర్ణక్రియను మెరుగుపరచడానికి రోజూ భోజనం చేసిన తర్వాత వీటిని తీసుకోవచ్చు. పిల్లలలో కఫం తగ్గించి ఆకలి పెంచడానికి కూడా వాము ఆకుల రసాన్ని తేనెతో కలిపి ఉపయోగిస్తారు.
సహజ నోరు ఫ్రెషనర్
దుర్గంధం వచ్చే శ్వాసను తొలగించడానికి అవి నోరు ఫ్రెషనర్‌గా కూడా పనిచేస్తాయి.
ఆహారం సిద్ధం చేయడానికి
వాముతో పోల్చితే వాము ఆకులను తక్కువగా వంటలలో ఉపయోగిస్తారు. కానీ వాటిని బజ్జీలు, పకోడీలు వంటి వంటలను తయారు చేయడానికి ఉపయోగించవచ్చు, వాటిని శనగపిండిలో ముంచి, డీప్ ఫ్రైడ్ చేస్తారు. కూరలకు రుచిని కూడా ఇస్తాయి.
రైతా మరియు సలాడ్లు సిద్ధం చేయడానిక
ఈ సుగంధ ఆకులు పెరగుతో చేసే రైతాకు ఒక ప్రత్యేకమైన రుచిని ఇస్తాయి మరియు దానికి పోషణను కూడా జోడిస్తాయి. సలాడ్లు తయారు చేయడానికి వీటిని ఉపయోగిస్తారు. మీరు చేయాల్సిందల్లా ఆకులను ముక్కలుగా కోసి సలాడ్‌లో చేర్చండి.
మూలికా రసాలను తయారు చేయడానికి
వాము ఆకులు మరియు తులసి ఆకులను కలపి దంచడం ద్వారా మూలికా రసాలను తయారు చేయవచ్చు. ఈ రసానికి రుచిని జోడించడానికి మరియు రుచికరమైనదిగా చేయడానికి ఆమ్‌చూర్ పౌడర్‌ను లేదా తేనెను ఉపయోగిస్తారు. శరీరంలో నిర్జలీకరణాన్ని నివారించడానికి వేసవికాలంలో దీనిని తింటుంటారు.