how does oxygen get to the body cells

ఒకటి చేస్తే ఎనిమిది గొప్ప లాభాలు………

ప్రతినిత్యం ప్రాణాయామం మానకుండా చేయడం వల్ల మన శరీరానికి వచ్చే అష్ట లాభాలు . ఏనాడో ఋషులు మన ఆచారాల్లో ప్రాణయమాన్ని ఏర్పాటు చేశారు. ఈ అష్ట లాభాల్లో మొట్టమొదటిది ఒత్తిడి ని తగ్గిస్తుంది. పనితనాన్ని పెంచుతుంది. ఎందుకని ఋషులు రోజు ఒక అరగంట గంట ప్రాణయం చేసి మిగిలిన పనులు చేసేవారు. రెండవది నిద్ర ప్రణయం దీనికి బాగా ఉపయోగపడుతుంది. ఇంక మూడవది శ్వాసను కంట్రోల్లో ఉంచుకోవడం వల్ల మనసు ప్రశాంతంగా ఉండటానికి కూడా ఉపయోగాపడుతుంది. ఇంక నాలుగవది అతి ముఖ్యమైన కొన్ని సెకన్లు మనం గాలి పీల్చుకోకపోతే ఉండలేము కొన్ని రోజులు ఆహారం తీసుకోకపోయినా ఉండగలం.

అందుకనే మన జీవితమంతా ప్రాణవాయువు మీద ఆధారపడి ఉంది. దానిని సవ్యంగా తీసుకోవడానికి ప్రాణాయామం. అందుకని ఆక్సిజన్ శరీరంలోకి చేరవలసిన అంత చేరుతుంది. అవయవాలు బాగా పనిచేస్తాయి అందువల్ల ఆయుర్దాయం పెరుగుతుంది. అందుకనే ఋషులు ప్రాణాయామం చేయడం వల్ల ఎక్కువ కాలం జీవించేవారు. ఇక ఐదవ లాభం తీసుకుంటే బ్లడ్ ప్రెజర్ ఎప్పుడు కంట్రోల్ లో ఉంటుంది. ఎందుకంటే శ్వాస అనేది మనసుకు, రక్తానికి సంబంధం కాబట్టి బ్లడ్ ప్రెజర్ కంట్రోల్లో ఉంటుంది. ఇలా ప్రాణాయామం చేస్తే బ్లడ్ లో ఆక్సిజన్ లెవెల్ ఎక్కువగా ఉండి కార్బన్ డయాక్సైడ్ తక్కువగా ఉంటుంది.

ఇక ఆరవ లాభం తీసుకుంటే మెదడుని ఏక్టివేట్ చేయటానికి, ఆలోచన చేయడానికి, తర్కం చేయడానికి, నిర్ణయం తీసుకోవడానికి బాగా ఇంప్రూవ్ చేస్తుంది. ఏడో లాభం తీసుకుంటే మనసును కంట్రోల్ చేయడానికి ప్రాణాయామం చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. చెడు ఆలోచనలు, చెడు అలవాట్ల పైన కంట్రోల్ చేసుకుని బుద్ధి మంచిగా ఉండేలాగా ప్రాణాయామం బాగా సహాయపడుతుంది. ప్రాణాయామం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఆ రోజుల్లో ఋషులు మనకు గ్రంథాల ద్వారా తెలియజేశారు. ఇప్పుడు సైంటిఫిక్ గా కూడా నిర్ణయిస్తున్నారు. ఇక ప్రాణాయామం చేయడం ద్వారా డిప్రెషన్, ఆక్సైటీ, రాకుండా ఉంటాయి.

మెదడు చురుగ్గా ఉండడం, మతిమరపు రాకపోవడం, ఇలాంటివి రాకుండా ప్రాణాయామం సహాయపడుతుంది. అందుకనే ఋషులు 130, 150 సంవత్సరాలు బతికిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆ వయసులో కూడా మెదడు చురుగ్గా ఉండడం మతిమరుపు లేకుండా జీవించేవారు. చిన్న పెద్ద అనే భావం లేకుండా అందరూ ఈ ప్రాణాయామం చేస్తే చాలా ఎక్కువగా లాభాలు ఉన్నాయి. ఇప్పుడు స్కూల్స్ లో రెండు పూటలా దీనిని చేపిస్తున్నారు. ఇలా కనక మనం చేసినట్లయితే మన జీవితంలో గొప్ప మార్పు వస్తుంది. ఆరోగ్యంగా ఉంటాం.

Leave a Comment

error: Content is protected !!