how-fast-we-should-take-our-meal

అన్నం స్పీడ్ గా తినడం మంచిదా, నెమ్మదిగా తినడం మంచిదా..?

మనమంతా బిజీ షెడ్యూల్ తో  రోజంతా పరిగెడుతూనే ఉంటాం బిజీ లేకపోయినా బిజీ ని క్రియేట్ చేసుకొని బిజీ షెడ్యూల్ ను పెట్టుకుంటూ ఉంటాం. అర్థం కావడం లేదా? అదేనండి గేమ్స్, సినిమాలు, ప్రయాణాలు, డ్రాయింగ్, గార్డెనింగ్ ఇలా ఏదో ఒక పనిని క్రియేట్ చేసుకుంటూ బిజీబిజీగా గడిపేస్తూ ఉంటారు. ఎన్ని ఉన్నా వీటన్నింటితో పాటు ఆరోగ్యం కూడా ముఖ్యమే కదా..

మన ఆరోగ్యం… నిజానికి సరైన జీవన శైలితో ముడిపడి ఉంటుంది. మరి సరైన జీవనశైలి ఆహారం, వ్యాయామం మరియు శుభ్రత మీద ఆధారపడి ఉంటుంది. సరిగ్గా నమలకుండా భోజనం చేసేవారు తినే ఆహారాన్ని వేగాన్ని విధానాన్ని కంట్రోల్లో ఉంచలేరు. ఒక్కోసారి తక్కువగా తింటే కొన్నిసార్లు పరిమితికి మించి తినేస్తూ ఉంటారు.  ఒక విధానం లేక జీవ క్రియలు అస్తవ్యస్తం అవ్వడం ఈ ప్రభావం హార్మోన్ల మీద చూపడం జరుగుతుంది. ఈ పరిస్థితులన్నీ మీ బరువు మీద ప్రభావితం చూపుతాయి. అంతేకాకుండా వేగంగా తినే వాళ్లకి ఊబకాయం టైప్ 2 డయాబెటిస్ రోగాల బారిన పడినట్టు అధ్యయనాలు తేల్చాయి.

ఆహారాన్ని సరిగా నమలకుండా తినేవాళ్ళు రెండు రకాలుగా ఉంటారు. కడుపునిండటానికి భోజనం అనుకునేవాళ్ళు కొందరైతే భోజనం కోసమే జీవితమా అనుకునే వారు మరికొందరు. మంచి ఆహారాన్ని కోరుకునేవారు ఆహారాన్ని నెమ్మదిగా నమిలి తినాలి. అంటే భోజనాన్ని మింగటానికి ముందు కనీసం ఒక 15 సెకన్లు అయినా నమలాలి.

వేగంగా తినడం కన్నా రోజు వారి అలవాట్లు ఎలా ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోండి. మీ ఆహారపు అలవాట్లు ఆలోచనా విధానాలు అన్నీ ముఖ్యమైనవే. ఒక భోజనం చేయడానికి కనీసం 20 నిమిషాలు తక్కువ కాకుండా చూసుకోండి.

మీరు వేగంగా తినడానికి ఇష్టపడే వారైతే భోజనం టైం మరియు టైమింగ్ మార్చండి. అంతేకాదు నమలకుండా మింగడం చేయకండి. ఇంకా నెమ్మదిగా తినేటప్పుడు మీకు ఎంత ఆహారం సరిపోతుంది అనే సంకేతాలను మీ కడుపు మెదడుకు అందిస్తుంది. తద్వారా మీకు అవసరమైన ఆహారాన్ని మాత్రమే తినగలుగుతారు. వేగంగా తినడం వల్ల కడుపు నుండి మెదడుకు సరైన సంకేతాలు అందక తీసుకునే ఆహారంలో హెచ్చుతగ్గులు ఏర్పడతాయి. భోజనాన్ని నెమ్మదిగా తినడం బరువును తగ్గించడంలో సహాయపడుతుంది.

నెమ్మదిగా తినడానికి సహాయడే కొన్ని చిట్కాలు

  •  మీరు తినే ఆహారం గురించి పూర్తిగా తెలుసుకోండి కొద్దికొద్దిగా ఎక్కువ సేపు తినడానికి ప్రయత్నించండి ఇది నెమ్మదిగా నమిలి ఏలా చేయడంలో సహాయం చేస్తుంది.
  •  మీరు తినే గదిలో కొన్ని ఆంక్షలను పెట్టుకోండి. భోజనం చేసే సమయంలో ఫోన్లను టీవీలను గాడ్జెట్లను దూరంగా ఉంచండి.  
  • పూర్తిగా ఆహారాన్ని నమిలి మింగిన తర్వాతే మరొక బైట్  తీసుకునేలా టైమింగ్ మెయింటెయిన్ చేయండి.
  •  హైడ్రేటెడ్ గా ఉండడం మంచిదే ముఖ్యమే కానీ చాలామంది భోజనంతో పాటు బాటిల్ లో కొద్దీ నీటిని తాగుతూ ఉంటారు. ఇది మంచి పద్ధతి కాదు నోరు ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే కొద్దిగా నీటిని తీసుకోండి.

కాబట్టి నెమ్మదిగా ఆహారం తినే సమయంలో ఇలాంటి ఆర్భాటాలకు వెళ్లకుండా నెమ్మదిగా తిని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి

Leave a Comment

error: Content is protected !!