how many dry fruits to eat in a day

వాల్ నట్స్ తినే విషయంలో 99%మంది చేసే ఈ పొరపాటును మీరు మాత్రం చెయ్యకండి !

ప్రియమైన పాఠకులారా… ఆరోగ్యానికి మంచిదని డ్రై ఫ్రూట్స్ ను ప్రతి ఒక్కరూ తెచ్చుకుని తింటారు. కానీ ఈ డ్రైఫ్రూట్స్ను ఎన్ని తినాలి అనే విషయం తెలియక చాలా మంది మితిమీరి తింటారు. దానికి కారణం రుచిగా ఉన్నాయని అధిక మొత్తంలో తింటారు. మనకు ఎంతో ఆరోగ్యానికి మేలు చేసే డ్రై ఫ్రూట్స్ ను అధికంగా తింటే మన ఆరోగ్యానికి చేటు చేస్తుంది ఇది నిపుణులు చెబుతున్న మాట. ఈరోజు మనం అసలు డ్రైఫ్రూట్స్ ఎంత మోతాదులో తినాలి ఎలా తింటే అవి మన ఆరోగ్యానికి మేలు చేస్తానని విషయాన్ని గురించి తెలుసుకుందాం.


అధికంగా తింటే అమృతమైన విషం గా మారుతుందని మన పెద్దలు అంటారు. డ్రై ఫ్రూట్స్ అంటే బాదం గింజలు, వాల్నట్స్, ఖర్జూరం, పిస్తా పప్పు, జీడిపప్పు, కిస్మిస్ లాంటివి మనము తరచూ తెచ్చుకొని తింటూ ఉంటాం. వీటిని ప్రతి రోజూ మన ఆహారంలో భాగంగా కూడా వినియోగిస్తాము. ఈ డ్రై ఫ్రూట్స్ లో అనేక పోషకాలు ఉంటాయి. ప్రొటీన్లు విటమిన్లు మినరల్స్ డైటరీ ఫైబర్ ఉండటం వలన ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

బాదం గింజల లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. జీరో కొలెస్ట్రాల్ ఉంటుంది వీటిని తినటం వలన మలబద్దక సమస్య పోతుంది రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ పోతాయి. గుండెకు చాలా మంచిది బాదం గింజలు తింటే జుట్టు ఆరోగ్యంగా ఒత్తుగా పెరుగుతుంది చర్మం అందంగా మారుతుంది. దంతాలు గట్టిగా మారతాయి

జీడిపప్పులో విటమిన్ ఇ మరియు విటమిన్ బి 6 దండిగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. కిస్మిస్లను తినడం వలన మన అరుగుదల శక్తి అమాంతం పెరుగుతుంది. అలాగే వాల్ నట్స్ తినడం వలన ఇందులో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఆమ్లాలు డైటరీ ఫైబర్ ప్రోటీన్లు యాంటీఆక్సిడెంట్స్ విటమిన్స్ మినరల్స్ ఎంతో సహాయం చేస్తాయి. పిస్తా పప్పు తినడం వలన మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను బయటకు పంపుతుంది గుండెకు చాలా మేలు చేస్తుంది. భవిష్యత్తులో షుగర్ వ్యాధి రాకుండా కాపాడుతుంది. మన వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది.

ఖర్జూరం తినడం వలన ఇందులోని విటమిన్లు ప్రొటీన్లు మినరల్స్ ఎంతో సహాయం చేస్తాయి. వీటిని తింటే మలబద్దకం సమస్యను తగ్గిస్తాయి. అంతేకాకుండా మన రక్త స్థాయిలను పెంచుతాయి. రక్తలేమి సమస్య ఉన్నవారు ఖర్జూరాలను తింటే రక్తం పెరుగుతుంది. ఇన్ని ఉపయోగాలున్న డ్రైఫ్రూట్స్ ఎలా పడితే అలా తినకూడదు. ప్రతి రోజు ఒక మోతాదులో మాత్రమే తినాలి అధికంగా తింటే మన శరీరం లో కొవ్వు నిల్వలు పేరుకుపోయి ఆరోగ్యానికి చేటు చేస్తాయి.

డ్రైఫ్రూట్స్తో రోజుకు ఎన్ని తినాలి లో తెలుసుకుందాం

  • బాదం గింజలను రోజుకు 4 నుండి 7 వరకు తినవచ్చు. వీటిని నానబెట్టి పొట్టు తొలగించి తినాలి.
  • వాల్ నట్స్ ను రోజుకు 3 నుండి 4 వరకు తినవచ్చు
  • ఖర్జూరాలను రోజుకు 2 లేదా 3 తినవచ్చు.
  • పిస్తాపప్పు రోజుకు 20 గ్రాములు మాత్రమే తినాలి.
  • జీడిపప్పు రోజుకు నాలుగు మించి తినకూడదు.
  • కిస్మిస్లను రోజుకో గుప్పెడు మోతాదులో తినవచ్చు.

పైన తెలిపిన మోతాదులో  డ్రైఫ్రూట్స్ను తింటే మన శరీరంలో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. గాల్బ్లాడర్లో రాళ్లు ఏర్పడవు జీర్ణక్రియ చురుగ్గా ఉంటుంది. గుండె మెదడు ఆరోగ్యంగా ఉంటాయి. చర్మ సౌందర్యానికి ఎంతో సహాయం చేసి అందంగా తయారవుతారు. ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ డ్రైఫ్రూట్స్ను ఇలా మోతాదుగా తినడం చాలా మంచిది. అధిక మొత్తంలో తినకూడదు ఇలాంటి మరిన్ని ఆరోగ్య విషయాలను తెలుసుకోవడానికి మా పేజీని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి

Leave a Comment

error: Content is protected !!