ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితులు, ఆహారపు అలవాట్లు ఉన్న ప్రతి ఒక్కరికి జుట్టు రాలడం సమస్య చాలా ఎక్కువగా ఉంది. ఈ సమస్య తగ్గించుకోవడం కోసం మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ ఉపయోగిస్తారు. కానీ వాటిలో అనేక రకాల కెమికల్స్ ఉండటం వల్ల అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఈ సమస్యను తగ్గించుకోవడం కోసం మన పూర్వీకులు వాడే నూనెతో పాటు ఈ రెండు కూడా కలిపి మీ జుట్టుకు అప్లై చేసినట్లయితే ఒక వారం రోజుల్లో జుట్టు రాలడం తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది.
ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు విటమిన్ ఈ క్యాప్సిల్స్ వేసుకోవాలి. బాగా జుట్టు ఒత్తుగా, పొడవుగా ఉండేవారు అయితే నాలుగు క్యాప్సిల్స్, చిన్న జుట్టు ఉన్న వాళ్ళు ఐతే ఒక క్యాప్సిల్, మీడియంగా ఉన్నవారైతే రెండు ఆపిల్స్ వేసుకోవాలి. విటమిన్ ఈ జుట్టు రాలడం తగ్గించి కొత్త జుట్టు రావడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. తర్వాత దీనిలో ఒక చెంచా ఆముదం వేసుకోవాలి. ఆముదం జుట్టు రాలడం తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది.
జుట్టు నల్లగా నిగనిగలాడుతూ, ఒత్తుగా పెరగడంలో ఆముదం అద్భుతంగా పనిచేస్తుంది. తర్వాత దీనిలో ఒక చెంచా బాదం నూనె కూడా వేసుకోవాలి. బాదం నూనె జుట్టు రాలడం తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగడం లో సహాయపడుతుంది. జుట్టుకు కావల్సిన పోషకాలు అందించడంలో సహాయపడుతుంది. ఈ మూడింటిని బాగా కలిపి టూత్ బ్రష్ సహాయంతో జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్లై చేసుకోవాలి. నూనె అప్లై చేసుకునేటప్పుడు బ్రష్‌తో కుదుళ్ల దగ్గర మృదువుగా స్క్రబ్ చేస్తూ అప్లై చేసుకోవాలి.
ఇలా స్క్రబ్ చేయడం వల్ల జుట్టు కుదుళ్లు బలంగా తయారవుతాయి. చుండ్రు, జుట్టు రాలడం తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. బ్రష్ తో ఇలా చేయడం వలన బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి జుట్టు కుదుళ్లు బలంగా తయారవుతాయి. అప్లై చేసిన తర్వాత రెండు లేదా మూడు గంటల పాటు ఉండనివ్వాలి. తర్వాత ఏదైనా మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒక సారి చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. ఈ నూనె ఒకసారి మీరు కూడా ఉపయోగించినట్లయితే ఒక వారం రోజులలోనే తేడా గమనిస్తారు.