మన శరీరంలో రక్తం ఒక చోట నుండి మరొక చోటకు ప్రవహిస్తుంది. దీనిని రక్త ప్రసరణ అంటారు. ఈ రక్త ప్రసరణ మొత్తం శరీరం అంతటా అన్ని అవయవాలకు రక్తం సరఫరా చేస్తుంది. రక్త ప్రసరణ ఒక్క అవయవానికి గనుక జరగకపోతే ఆ అవయవాం దాని పనితీరును ఆపేస్తుంది. గనుక రక్తప్రసరణ అనేది ప్రతి అవయవానికి చాలా అవసరం. ఇలా రక్త ప్రసరణ జరగకపోవడానికి కారణం రక్తనాళాల్లో పూడికలు లేదా కొలెస్ట్రాల్ పేరుకుపోవడం కూడా ఒక కారణం. బాడ్ కొలెస్ట్రాల్ మరియు కొవ్వు కలిసి పూడికలు ఏర్పడతాయి. దీనివలన రక్తనాళాల్లో బ్లాకేజ్ అవుతుంది.
రక్తనాళాలలో బ్లాకేజ్ వలన దిగువ భాగాల్లో రక్తం సరఫరా ఆగిపోతుంది. ఇలా ఏ అవయవానికి వచ్చినా పర్వాలేదు కానీ గుండెకు మరియు బ్రెయిన్ యొక్క రక్తనాళాల్లో ఈ పూడికలు ఏర్పడితే ప్రాణాన్ని కోల్పోతారు. ఇలా ఏర్పడకుండా ఉండాలంటే ఒమేగా3 ఫ్యాటి యాసిడ్స్ బాగా ఉపయోగపడతాయి. కనుక ఇవి కలిగిన ఆహార పదార్థాలను తీసుకోవడం చాలా మంచిది. ఇవి లభించే ఆహార పదార్థం అవిస గింజలు. సుమారుగా 30 రోజులపాటు 20 నుండి 30గ్రా అవిస గింజలు తీసుకోవడం ద్వారా హార్ట్ స్ట్రోక్ మరియు బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా కాపాడుకోవచ్చు. అని అనేక రీసెర్చ్ ప్రకారం నిరూపించబడింది.
ఇవి బి.పి. కంట్రోల్లో ఉంచడానికి సహాయ పడుతుంది. కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. ఇందులో ఉన్న ఒమేగా త్రీ ఫ్యాటి యాసిడ్స్ రక్తం లో ఉన్న బ్లాకేజ్స్ ను తొలగిస్తాయి. బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్ వచ్చినవారికి తగ్గించడానికి కూడా ఇవి సహాయపడతాయి అని ఈ అవిసె గింజలు మీద చేసిన 26 కు పైగా రీసెర్చ్లు చెప్తున్నాయి. వీటిని నానబెట్టుకొని తినవచ్చు. కానీ కొంతమంది అలా ఇష్టపడరు. అందువలన వీటిని పేస్ట్ కింద చేసుకొని కూరల్లో ఉపయోగించవచ్చు. వీటిని సులభంగా రెండు మార్గాలలో తీసుకోవచ్చు.
అవి 1. అవిసె గింజలను దోరగా వేయించుకొని దానిలో ఖర్జూరం మరియు తేనె ను కలుపుకుని లడ్డూలాగా చేసుకొని రోజుకు ఒకటి చొప్పున తీసుకోవచ్చు. ఇలాగైతే చిన్నపిల్లల కూడా ఇష్టంగా తింటారు. 2. అవిస గింజలు దోరగా వేయించుకొని పొడిగా చేసి కూరల్లో మరియు సలాడ్స్ డ్రెస్సింగ్ గా వేసుకొని ఉపయోగించవచ్చు. ఇలాంటి మంచి ఆహార పదార్థాలు మన దినచర్య లో ఒక భాగంగా ఉంచుకుంటే చాలా మంచిది..