How To Bleach Face At Home Naturally in Telugu

పొటాటోలో ఇవి రెండు కలిపి రాస్తే చాలు.చర్మం తెల్లగా మెరిసిపోతుంది..

బయట ఎండ, పొల్యూషన్ వల్ల ముఖంపై చేరిన మురికి మృత కణాలు తొలగిపోయి ముఖం మెరవాలంటే మనం పార్లర్లో బ్లీచింగ్ చేయిస్తూ ఉంటాం. ఇది ఖర్చుతో కూడుకున్నదే కాక, దీని వలన ఎక్కువ రోజులు ఉపయోగించడం వలన చర్మ క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. మరి ముఖంపై ఉండే చర్మంలోని మురికి, మృత కణాలు తొలగి పోవాలంటే ఏం చేయాలి? మనకు అందుబాటులో ఉండే కొన్ని పదార్థాలతో హోమ్ మేడ్ బ్లీచ్ మనమే తయారు చేసుకోవచ్చు.

 దానికోసం మనకు కావలసిన పదార్థాలు ఫస్ట్ ముఖాన్ని శుభ్రంగా నీటితో కడుక్కోవాలి. తర్వాత ఒక గిన్నెలో కొంచెం బియ్యం పిండి,  ఒక స్పూన్ తేనె కలుపుకోవాలి. తేనె శరీరానికి పడనివారు కొబ్బరి నూనె కలుపుకోవచ్చు. ఈ మిశ్రమంతో ముఖానికి స్క్రబ్ చేయాలి. కనీసం వారానికి ఒకసారైనా  ముఖాన్ని స్ర్కబ్ చేయడం వలన ముఖం పై ఉండే మురికి తొలగిపోతుంది. బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ పోతాయి.

 ఈ పేస్ట్ని ముఖంపై నెమ్మదిగా స్క్రబ్ చేయాలి. తరువాత దీనిని కడిగేసి ఒక బంగాళదుంపని మెత్తగా తురుముకోవాలి. దానిలో ఒక స్పూన్ తేనె, ఒక స్పూన్ నిమ్మరసం కలుపుకోవాలి. ఈ జ్యూస్ని ముఖానికి అప్లై చేయాలి. ఇంకా మిగిలిన గుజ్జును ముఖంపై వేసి ఒక గంట ఉంచుకోవాలి. గిన్నెలో ఉన్న జ్యూస్ ని మళ్లీ ముఖంపై అప్లై చేస్తూ ఉండాలి. ఎవరిదైనా సహాయం తీసుకోవడం మంచిది. ఈ రసంలో దూది ముంచి కళ్ళకు పెట్టడం వలన కళ్ళచుట్టూ ఉన్న నల్లదనం కూడా పోతుంది. ఇలా వేసుకోవడం కుదరని పక్షంలో  ఫేస్ మాస్క్లు అందుబాటులో ఉంటాయి.

 వాటిని ఈ రసంలో ముంచి ముఖంపై అప్లై చేయాలి దానిపై మిగిలిన గుజ్జుని  అప్లై చేస్తూ ఉండాలి.ఇలా గంట గడిచాక చల్లని నీటితో కడిగేసుకోవచ్చు.  దీనివలన ఇన్స్టెంట్ బ్రైట్నింగ్ అనేది వస్తుంది. దీనివలన ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. అంతేకాకుండా అన్నీ సహజ పదార్థాలు కనుక ఇంట్లోనే ఉంటాయి. అతి తక్కువ ఖర్చుతో మీకు మీరే బ్లీచ్ చేసుకున్న  అనుభూతిని పొందుతారు. 

Leave a Comment

error: Content is protected !!