How to Boost Immunity Naturally

ఇది ఒక గ్లాస్ తాగితే చాలు పటిష్టమైన ఆరోగ్యం మీ సొంతం….. టాబ్లెట్ అవసరం లైఫ్ లో రాదు….

సుగంధ అనే పేరు చాలామంది వినే ఉంటారు అంతేకాకుండా చాలామంది ఉపయోగించి ఉంటారు. ఇది ఆయుర్వేదంలో చాలా ప్రాధాన్యత కలిగి ఉంటుంది. ఇది  రక్షణ వ్యవస్థకు ఏ విధంగా సహాయపడుతుందో తెలుసుకుందాము. ప్రకృతి ప్రసాదించిన అనేక  ఔషధాలు మన ఆరోగ్యాన్ని మరియు రక్షణ వ్యవస్థను కాపాడుతూ ఉంటాయి. వీటి గురించి సైంటిఫిక్ గా నిరూపించబడినప్పుడు మన ఋషులు అయిన వారు సమాజంలో మనం హాయిగా జీవించడానికి అందించారు అని తెలుస్తుంది.

ఈ సుగంధ మీద సైంటిస్టులు 2012లో రోలాండ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ ఒరిస్సా వారు పరిశోధనలు చేసి ఇది రక్షణ వ్యవస్థ ను డైరెక్ట్ గా యాక్టివేట్ చేయడానికి ఉపయోగపడుతుందని నిరూపించారు. మన రక్షణ వ్యవస్థలో తెల్ల రక్త కణాలు ఉంటాయి. అవి ఐదు రకాలుగా ఉంటాయి. అవి మోనోసైట్లు, ఐసీనోఫిల్స్, భాసోఫీల్స్, లింఫోసైట్స్, న్యూట్రోఫిల్స్, ఈ ఐదు రకాలు ఉంటాయి. ఈ లింపోసైట్స్ ముఖ్యంగా రెండు రకాలుగా ఉంటాయి అవి టి లింఫోసైట్స్, బి లింపోసైట్స్. 

ఇందులో బి లింఫోసైట్స్ యాంటీబాడీస్ను ఉత్పత్తి చేస్తాయి. ఇవి ముఖ్యంగా సెల్ వాల్ ను సంరక్షిస్తాయి. అంటే కణం యొక్క కవచాన్ని బట్టే కణం ఆధారపడి ఉంటుంది. అలాగే టి లింఫోసైట్స్ రెండు రకాలుగా ఉంటాయి అవి టి హెల్పర్ సెల్స్, టి. కిల్లర్ సేల్స్. టి హెల్పర్ సెల్స్ మన బాడీకి వైరస్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. వీటి యొక్క సెల్ వాల్ డామేజ్ అవకుండా సుగంధ బాగా ఉపయోగపడుతుంది. అలాగే టీ మెమరీ సెల్స్ ఉంటాయి. ఇది వైరస్ బ్యాక్టీరియా ల యొక్క సమాచారాన్ని దాచుకుంటాయి. మరల అవి లోపలికి ఎటాక్ చేసినప్పుడు అవి హాని చేయకముందే వాటికి వ్యతిరేకంగా యాంటీబాడీస్ను తయారు చేస్తాయి.

వీటి యొక్క సెల్ వాల్ కూడా సంరక్షించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఈ సుగంధిలో ముఖ్యంగా బీటా ఏమిరిన్, సైటుస్టీరాన్స్, సిస్టీన్ డి హైడ్రాక్సీ పెక్టీలీనోన్. ఈ మూడు రసాయనాలు రక్షణ వ్యవస్థను సంరక్షించడానికి సహాయపడతాయి. ఈ సుగంధి ని వేడి నీటిలో కలిపి తీసుకోవచ్చు. లేదా సుగంధను తేనెతో కలిపి తీసుకోవచ్చు. మరియు కషాయంలా తయారుచేసుకుని తీసుకోవచ్చు. ఇలాంటి ఆరోగ్యకరమైన ప్రకృతి సిద్ధమైన ఆహారంను తీసుకోవడం ద్వారా మనలను ఆరోగ్యంగా కాపాడుకోవచ్చు…

Leave a Comment

error: Content is protected !!