అధికబరువును తగ్గించడానికి అనేక ప్రయత్నాలు చేసేక్రమంలో నడక, వ్యాయామం, యోగా చేస్తుంటాం. వీటితో పాటు ఈ విత్తనాలు కలిపిన నీరు గ్లాసు తీసుకుంటే చాలు. అద్బుతమైన ఫలితాలు చూడొచ్చు. అవేంటంటే చియా విత్తనాలు మరియు సబ్జా విత్తనాలు. చూడడానికి రెండు ఒకేలా ఉన్న ఇవి రెండు వేరువేరు రకాలు. ఒక గ్లాసు నీటిలో ఒక స్పూన్ చియాసీడ్స్ కానీ సబ్జా సీడ్స్ గానీ వేసి నానబెట్టాలి. గంటసేపటికి ఇవి చక్కగా నాని పెద్దగా తయారవుతాయి. ముట్టుకుంటే జారిపోయేలా ఉండే ఈ విత్తనాలను నేరుగా తినేయచ్చు లేదా పండ్లరసాలు లేదా సలాడ్స్తో తినొచ్చు. మరింత సమాచారం కోసం ఈ వీడియో చూడండి..
వీటిని రాత్రి నానబెట్టి ఉదయాన్నే అరచెక్క నిమ్మకాయ పిండి పరగడుపున తినడంవలన మీ శరీరం డీటాక్స్ చేయబడి ఒంట్లోని టాక్సిన్లు, విషపదార్థాలు బయటకు వెళ్ళిపోతాయి. అధికబరువుతో బాధపడేవారు పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయి ఉన్నవారు ఈ విత్తనాలు నానబెట్టి తినడంవలన కొవ్వు కరిగి మంచి ఫలితాలు ఉంటాయి. మధుమేహం సమస్య లేనివారు ఈ నీటిలో తేనె వేసుకుని తీసుకోవచ్చు. అలాగే జీర్ణాశయ సమస్యలు కూడా తొలగిపోతాయి. ఇవి తీసుకోవడం వలన ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. ఇందులో ఉండే ఫైబర్ ఆహారాన్ని బాగా జీర్ణంచేసి శక్తిగా మారుస్తుంది.
దీనివలన గ్యాస్, ఎసిడిటీ, మలబద్దకం సమస్యలు తొలగిపోతాయి. తలనొప్పి ఉన్నప్పుడు ఈ డ్రింక్ తీసుకోవడంవలన కూడా ఉపశమనం లభిస్తుంది. మెగ్రేన్ ఉన్నవారికి చాలా బాగా పనిచేస్తుంది. రక్తాన్ని శుద్ధి చేసి రక్తసరఫరాను మెరుగుపరుస్తుంది. బీ.పీని తగ్గిస్తుంది. చలికాలంలో ఇబ్బంది పెట్టే జలుబు, దగ్గుకి కూడా ఈ విత్తనాలు తగ్గిస్తాయి. ఈ విత్తనాలు నానబెట్టి తీసుకోవడం వలన రోజంతా ఉత్సాహంగా ఉండొచ్చు. అలాగే ఈ నీటిలో అల్లంరసం కలిపి తాగితే జలుబు, దగ్గు తగ్గిపోతాయి. పిల్లలకు ఇవ్వడం వలన ఇందులో ఉండే యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పిల్లల్లో నీరసాన్ని తగ్గించి ఉత్సాహంగా తయారుచేస్తాయి. క్రీడాకారులు, అధిక శ్రమ చేసేవారికి ఈ విత్తనాలు తక్షణ శక్తిని అందిస్తాయి.