కరోనా చేతిలో విలవిల్లాడున్న తరుణంలో సరైన మందులు కూడా అందుబాటులో లేవు. ఇమ్యునిటీని పెంచుకోవడమే దీనికి సరైన మార్గం. వచ్చిన తర్వాత బాధపడేకంటే ముందు జాగ్రత్తలు తీసుకుంటూ మంచి ఆహారం, వ్యాయామం చేయడం మనల్ని బలంగా చేస్తాయి. అలాగే రోగనిరోధక శక్తిని పెంచే చిట్కాలు కూడా ఉపయోగపడతాయి. ఆయుర్వేదంలో అనేక రకాల ఇమ్యునిటిని పెంచే మూలికలు ఉన్నాయి. ఇవన్నీ మన వంటింట్లోనే ఉంటాయి. వీటిని వాడుతూ కరోనా వలన వచ్చే సైడ్ఎఫెక్ట్స్ దూరం చేసుకోవచ్చు.
అవేంటో వాటిని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.
ముఖ్యంగా వైరస్ వలన వచ్చే దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతున్నారు.
ముందుగా వేడినీటిని తాగడం అలవాటు చేసుకోవాలి. వేడినీటి వలన గొంతునొప్పి తో బాధపడుతున్నారు. వీటినుండి ఉపశమనం కోసం పెప్పర్ మింట్ (పుదీనా)ఆకులు, లేదా అల్లం, లవంగం ఏదైనా వేసి రెండు నిమిషాలు మరిగించి గోరువెచ్చని నీటిని ఉదయాన్నే టీలా తాగాలి.
ఈ టీని రోజంతా తాగుతూనే ఉండొచ్చు. ఇలా తాగడంవలన జలుబు, దగ్గు వంటి సమస్యలు దరిచేరవు.
ఈ నీటిని చిన్నపిల్లలు కూడా తాగవచ్చు. ఎందుకంటే ఈసారి కరోనా తీవ్రత పిల్లల్లో కూడా ఎక్కువగా ఉంది.
కరోనా వలన వచ్చే మరో సమస్య శ్వాస కోశ సంబంధ సమస్యలు. దీనికి పిప్పర్ మెంట్ చాలా బాగా పనిచేస్తుంది. దీనినే వాము పువ్వు అంటారు. ఆయుర్వేద షాపుల్లో అందుబాటులో ఉంటుంది. దీనిని పిల్లల నోట్లో కూడా వేయండి. దీనివలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇది శ్వాస కోశ సంబంధ సమస్యలు ఎదుర్కొనే శక్తిని శరీరానికి ఇస్తుంది. అలాగే మన శరీరంలో రోగనిరోధక శక్తి పెరగడానికి ఎర్ర ఉసిరిక కూడా ఉపయోగపడుతుంది. ఇదికూడా ఆయుర్వేదం షాపుల్లో సులభంగా దొరుకుతుంది.
ఎర్ర ఉసిరికలు శుభ్రంగా కడిగి నీటిలో వేసి మరిగించాలి. పావుగంట వరకూ మరిగించి మిరియాలు, బెల్లం, అరచెక్క నిమ్మరసం వేయాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగితే ఇది గొంతులో శుభ్రపరిచి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వైరస్ వలన వచ్చే జలుబు, దగ్గు జ్వరం త్వరగా నయమవుతాయి. కఫం కూడా తగ్గి ఛాతినొప్పి కూడా రాదు. వారంలో రెండు రోజుల పాటు ఈ టీని తాగడంవలన మంచి ఫలితం ఉంటుంది. రెగ్యులర్ గా తాగకూడదు. అప్పుడప్పుడు తాగినా మంచిగానే ఉంటుంది.
ఇక చిన్న అల్లంముక్క, మిరియాలు, పసుపు, ఒక టీస్పూన్ జీలకర్ర , కొద్దిగా నిమ్మరసం తీసుకుని ఒక టీటర్ నీటిలో వేసి మరిగించాలి. పావువంతు నీళ్ళు మిగిలే వరకూ మరిగించి తర్వాత ఈ టీని మీరు వడకట్టుకుని వేడివేడిగా తాగాలి. ఈ కషాయం మన శరీరంలో రోగనిరోధక వ్యవస్థ ను బలంగా మారుస్తుంది. కఫం, జలుబు ఉన్నప్పుడు మధ్యాహ్నం సమయంలో పడుకోకూడదు. దీనివలన గుండెల్లో మంట పెరుగుతుంది. మధ్యాహ్నం నిద్ర లేనిపోని సస్యలకు దారితీస్తుంది అని నిపుణులు సైతం చెబుతున్నారు. భయానికి దూరంగా సరైన జాగ్రత్తలు పాటిస్తూ ఈ చిట్కాలు పాటిస్తే కరోనా వచ్చే అవకాశాలు చాలా తగ్గుతాయి.