how to clean our stomach overnight

ఉదయానికల్లా మీ పొట్ట పూర్తిగా శుభ్రం మరియు మలబద్దకం గ్యాస్ శాశ్వతంగా మాయం

హలో ఫ్రెండ్స్ ఈ రోజుల్లో ఉండే బిజీ లైఫ్ స్టైల్ తప్పుడు ఆహారపు అలవాట్లు వల్ల కడుపు పాడవడం మరియు పూర్తి శాతం కడుపు సరిగ్గా శుభ్రం అవ్వకపోవడం మలబద్ధకం లాంటి సమస్యలు రావడం సర్వసాధారణం అయిపోయింది. మన శరీరంలో ఉండే జీర్ణాశయం అంటే మన డైజెస్ట్ సిస్టం వల్ల మన శరీరంలో ఉండే మిగతా అవయవాలకు ఎనర్జీ అందుతుంది. అందుకే ఎప్పుడైనా మన కడుపులో ఉండే జీర్ణాశయానికి సమస్య ఏర్పడితే దాని ప్రభావం శరీరంలో ఉండే మిగతా అవయవాలు కిడ్నీ లివర్ గుండె ప్యాంక్రియాస్ ఊపిరితిత్తులు ఎముకలు మరియు మన చర్మం పై పడుతుంది. అందుకే మనం మంచి భోజనమే తినడమే కాకుండా మన కడుపు సక్రమంగా శుభ్రం చేసుకోవడం చాలా అవసరం. ఎవరికైతే ఉదయాన్నే పూర్తి శాతం కడుపు శుభ్రం అవ్వదో  అలాంటివారికి మలబద్ధక సమస్య రోజురోజుకి పెరిగిపోతుంది. దీనివల్ల మనం తిన్న ఆహారంలో ఉండే అవశేషాలు మన పేగులు ఉండిపోతాయి. దీనివలన కొద్దికొద్దిగా మన కడుపులో గ్యాస్ సమస్య పెరిగిపోతుంది.

కడుపు పూర్తి శాతం శుభ్రం అవ్వకపోవడం వలన రోజు మొత్తం మన శరీరంలో అలసట మరియు కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది. దీనివలన మనం ఏం పని చేసినా దాని మీద పూర్తి శ్రద్ధ వహించలేము. ఇదే కాకుండా కడుపు సరిగా శుభ్రం కాకపోవడం వలన సరిగ్గా ఆకలి వేయదు మరియు రాత్రి పూట మంచి గా నిద్ర పట్టదు. తద్వారా కొద్దికొద్దిగా దీని ప్రభావం మన వెంట్రుకల పై చర్మం పైన కూడా కనిపిస్తుంది. అలాగే ఎవరికైతే ఈ సమస్య ఎక్కువ కాలం నుండి ఉంటుందో అలాంటి వారికి పుట్ట పెరిగిపోవడం కడుపులో గ్యాస్ సమస్య రావడం చర్మంపైన దద్దుర్లు పులిపిర్లు రావడం, పైల్స్ సమస్య కడుపులో అల్సర్ కొద్దికొద్దిగా లివర్ చెడిపోయి భయంకరమైన లివర్ రోగం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.


మహిళలలో కడుపు పాడవడం వలన దీని ప్రభావం వారి గర్భాశయం పై రిప్రొడక్టివ్ సిస్టం పై మరియు మిగతా అవయవాల పైన కూడా పడుతుంది. ఈరోజు మనం కడుపు శుభ్రం చేసుకోవడం మరియు మలబద్దక సమస్య తగ్గించుకోవడానికి మూడు అద్భుతమైన ఆయుర్వేద చిట్కాలు గురించి తెలుసుకుందాం . వీటిని వాడిన మొదటిసారి లోని వీటి రిజల్ట్ మీకు కనిపిస్తుంది. మరియు ఉదయాన్నే లేవగానే కడుపు పూర్తి శాతం శుభ్రం అవుతుంది. పూర్తి వివరాలకు ఈ వీడియో చూడండి.

రాత్రి నిద్రపోయేముందు తీసుకోవాల్సిన చిట్కా

ఈ రెమిడీ కి కావాల్సిన పదార్థాలు

  • జీలకర్ర
  • వాము
  • ధనియాలు
  • నల్ల ఉప్పు బ్లాక్ సాల్ట్
  • పసుపు
  • సొంటి పొడి
  • పుదీనా ఆకులు

తయారీ విధానం 

స్టవ్ మీద కడాయి పెట్టి అందులో రెండు స్పూన్ల జీలకర్ర మరియు 2 స్కూల్లో వాము వేసి ఒకరితో కలుపుకుంటూ మీద ఒకటి లేదా రెండు నిముషాలు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్లు ధనియాలు వేసి మరియు రెండు నుంచి మూడు నిమిషాలు ట్రై చేయండి. ఆతర్వాత వీటన్నింటిని మిక్సీ జార్ లో వేసి మెత్తగా పౌడర్ చేసుకొని ఒక కప్పు లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పావు టేబుల్ స్పూన్ బ్లాక్ సాల్ట్ పావు టేబుల్ స్పూన్ పసుపు అర టేబుల్ స్పూన్ సొంఠి పొడి మరియు ఆఫ్ టేబుల్ స్పూన్ ఇంట్లోనే పోటీ చేసి పెట్టుకున్న పుదీనా ఆకుల పౌడర్ వేసి వీటన్నింటినీ ఒక సారి బాగా కలుపుకోవాలి.

రెమిడి ఎలా వాడాలి

ఒక గ్లాసు వేడి నీళ్ళలో ఒక చెంచా తయారుచేసుకున్న చూర్ణం వేసి ఒకసారి బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు వదిలేయాలి. పది నిమిషాల తర్వాత నీరు కొద్దిగా గోరువెచ్చగా అవుతాయి అప్పుడు దీన్ని తాగేయండి. ప్రతిరోజు రాత్రి భోజనం చేసిన 30 నిమిషాల తర్వాత తాగితే నిద్రపోయేటప్పుడు మన బాడీ డిటాక్స్ అవుతుంది మరియు భోజనం పూర్తి శాతం అరిగిపోతుంది. దీనితోపాటు కడుపులో ఉండే చెడు మలినాలు కడుపులో నుంచి బయటకు వెళ్లిపోతాయి. తద్వారా మీ కడుపు పూర్తిగా శుభ్రం అవుతుంది.

1 thought on “ఉదయానికల్లా మీ పొట్ట పూర్తిగా శుభ్రం మరియు మలబద్దకం గ్యాస్ శాశ్వతంగా మాయం”

Leave a Comment

error: Content is protected !!