జీర్ణక్రియ ఆరోగ్యం మనిషిని రోజంతా సంతోషంగా, ఆరోగ్యంగా మరియు చక్కగా అనుభూతి చెందడానికి ముఖ్యమైనది. సరైన జీర్ణక్రియ జరగని సమయంలో రోజంతా చికాకుగా, విసుగ్గా ఉంటుంది. అలాగే కడుపునొప్పి రావచ్చు. ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడంవలన కిడ్నీలపై ప్రభావం పడి వాటి పనితీరు కుంటుపడుతుంది. జీర్ణవ్యవస్థలో ఒక ముఖ్యమైన అవయవం పెద్దప్రేగు. జీర్ణ ఆరోగ్యంలో పెద్దప్రేగు ఆరోగ్యం ముఖ్యమైన భాగం. సరైన జీర్ణక్రియ కోసం పెద్దప్రేగును శుభ్రపరచాలని కొందరు డాక్టర్లు పేర్కొన్నారు. అయినప్పటికీ, డీటాక్సిఫికేషన్ యొక్క ప్రభావాన్ని రుజువు చేసే పరిశోధనలు తక్కువగా ఉంటాయి మరియు నాణ్యత తక్కువగా ఉంటాయి. మరింత సమాచారం కోసం క్రింద లింక్ చూడండి.
అయినప్పటికీ పెద్దప్రేగు ప్రక్షాళన యొక్క కొన్ని అంశాలు ప్రయోజనకరంగా ఉండవచ్చు. ఇది మలబద్ధకం లేదా సక్రమంగా ప్రేగు కదలికలు వంటి సమస్యలకు సహాయపడవచ్చు మరియు అవి పెద్దప్రేగు క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గించగలవని కొన్ని ఆధారాలు ఉన్నాయి. టాక్సిన్స్ మరియు పరాన్నజీవుల తొలగింపు వంటి ఇతర పెద్దప్రేగు శుభ్రపరిచే వాదనలు ప్రశ్నార్థకం. గ్యాస్, ఎసిడిటీ వంటి 72 రకాల వ్యాధులకు మలబద్దకం కారణమవుతుంది. అందుకే జీర్ణాశయం సరిగా పనిచేయాలి. దానికోసం మనం ఈ చిట్కాలు పాటించొచ్చు. ఆముదం నూనె సహజంగానే శరీరంలో జీర్ణవ్యవస్థను శుభ్రం చేసి మలబద్దకాన్ని తగ్గిస్తుంది. ప్రేగులలో అంటుకుపోయిన మలాన్ని కదిలించి బయటకు పంపిస్తుంది. ఇది ప్రేగుల కదలికను పెంచడం ద్వారా పెద్ద పేగు శుభ్రపరచడంలో పనిచేస్తుంది
ఒక అరకప్పు వేడినీటిలో అరచెక్క నిమ్మరసం, అరస్పూన్ ఉప్పు, ఒక స్పూన్ ఆముదం కలిపి రోజు ఉదయాన్నే ఈ డ్రింక్ మామూలు నీళ్ళు తాగిన తర్వాత తాగడం వలన కడుపు పూర్తిగా శుభ్రపడుతుంది. పదిహేను నిమిషాలలోనే కడుపు శుభ్రపడడం మొదలై మలవిసర్జన ద్వారా విషవ్యర్థాలను, మలినాలను బయటకు పంపించివేస్తుంది. ఒకసారి తాగిన తర్వాత మళ్ళీరెండు రోజులు విరామం ఇచ్చి తీసుకోవాలి. ఇలా వారానికి ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే తాగాలి. హైబి.పీ ఉన్నవారు, గర్భవతులు, బాలింతలు, పాలిచ్చే తల్లులు ఈ డ్రింక్ తాగకూడదు.