చల్లని సాయంత్రం వేళ వేడి వేడి కాల్చిన మొక్కజొన్న తినడం చాలా ఇష్టం అందరికీ. కానీ దాని సిల్కీగా ఉండే పీచు మొక్కజొన్న కంటే ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉందని మీకు తెలుసా? పోషకాలు మరియు యాంటీఆక్సిడెంట్ల నుండి ప్రయోజనం పొందడానికి మీరు మీ సాయంత్రం టీ బదులుగా ఈ టీని ఉపయోగించవచ్చు. ఇందులో పొటాషియం, కాల్షియం మరియు విటమిన్లు బి 2, సి మరియు కె వంటి ఎన్నో కీలక పోషకాలు ఉన్నాయి.
మూత్రపిండాలను డీటాక్సీఫికేషన్ చేస్తుంది
మూత్రపిండాలు శరీరంలో ఉండే వ్యర్థాలను వడకట్టడంలో ప్రముఖపాత్ర పోషిస్తుంది. అలాంటి మూత్రపిండాలు ఎప్పటికప్పుడు శుభ్రం చేయకపోతే వ్యర్థాలు కిడ్నీలలో పేరుకుపోతాయి. ఈ మొక్కజొన్న పట్టుతో చేసిన టీ మూత్రపిండాలు ప్రక్షాళన చేసి వ్యర్థాలను బయటకు పంపుతుంది. వయసు పెరిగే కొద్దీ ఇలా శుభ్రం చేయకపోతే అనేక అనారోగ్యాలకు కారణమవుతుంది.
మొక్కజొన్న పీచు ఒక మంచి మూత్రవిసర్జన ఏజెంట్
పురాతన కాలంగా, మొక్కజొన్న పట్టు టీని సహజంగా శక్తివంతమైన మూత్రవిసర్జన ఏజెంట్గా ఉపయోగిస్తున్నారు, ఇది శరీరం నుండి అదనపు నీరు మరియు విషవ్యర్థాలను బయటకు తీయడానికి సహాయపడుతుంది, తద్వారా అధికబరువు గణనీయంగా తగ్గుతుంది. ఇది యూరినరీ ఇన్ఫెక్షన్లుకి సంబంధించిన సమస్యలను కూడా తగ్గిస్తుంది. దీర్ఘకాలిక రక్తపోటు మరియు మూత్రపిండాల వ్యాధులతో సహా అనేక ఆరోగ్య ప్రమాదాల నుండి బయటపడటానికి మూత్రవిసర్జన సహాయపడుతుంది.
మూత్రపిండాల్లో రాళ్లను బోర్డర్ వద్ద ఆపుతుంది
మొక్కజొన్న పట్టు మూత్ర ప్రవాహాన్ని పెంచుతుంది మరియు మూత్రపిండాలలో ఏర్పడే విషవ్యర్థాలను, జబ్బులను తగ్గిస్తుంది, లేకపోతే మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడటానికి దారితీస్తుంది.
రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది
మొక్కజొన్న పట్టు టీ తాగడం వల్ల రక్తంలో చక్కెర సమస్యలు ఉన్నవారికి సహాయపడుతుంది. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ బయోలాజికల్ మాక్రోమోలిక్యుల్స్లో 2012 లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం మొక్కజొన్న పట్టు సారం మధుమేహంపై మంచి ప్రభావాన్ని చూపించింది. , మరియు మొక్కజొన్న పట్టు పాలిసాకరైడ్ల వాడకం రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించటానికి సహాయపడిందని శాస్త్రవేత్తలు గుర్తించారు.
రక్తంలో అధిక చక్కెర హార్ట్స్ట్రోక్, కిడ్నీ సమస్యలు మరియు డయాబెటిస్ వంటి అనేక రోగాలకు దారితీస్తుంది. న్యూట్రిషన్ అండ్ మెటబాలిజం జర్నల్లో 2009 లో ప్రచురించబడిన మరో అధ్యయనం ప్రకారం మొక్కజొన్న పట్టు టీ మానవ శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది.
ఈ విధంగా మీరు ఇంట్లో మొక్కజొన్న పట్టు టీని తయారు చేసుకోవచ్చు.
కావలసినవి
పొడి లేదా తాజా మొక్కజొన్న పట్టు
నీళ్ళు
నిమ్మరసం
తేనె
విధానం
* కొంత సమయం నీరు మరగబెట్టండి.
* తర్వాత వేడినీటిలో మొక్కజొన్న పట్టు వేయండి.
* ఇది కొన్ని నిమిషాలు ఉడకనివ్వండి మరియు పదిహేను నిమిషాలు అలాగే ఉంచండి.
* ఇది బ్రౌన్ కలర్ ద్రవంగా మారుతుంది. ఈ టీని వడకట్టండి. దీనిలో అరచెక్క నిమ్మరసం, స్పూన్ తేనె కలిపి దీనిని వెచ్చగా తాగవచ్చు. టీలా గోరువెచ్చగా టీలా సిప్ చేస్తూ తాగడం వలన మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చు.