మనిషి ఊపిరితిత్తులు రోజుకి ఇరవై వేలనుండి ముప్ఫై వేలసార్లు ఊపిరి తీసుకుని అందులో ఆక్సిజన్ గ్రహించి కార్బన్ డయాక్సైడ్ వదులుతుంది. ఇవి నిరంతరం పనిచేస్తూనే ఉంటాయి. కానీ పొగతాగితే మన ఊపిరి తిత్తులు మరియు గుండెకు హానికరం. పొగతాగడం వలన మన వెంట్రుకలు, చర్మం, మెదడుపై ప్రభావం చూపుతుంది. ఒక పరిశోధనలో తేలింది ఏమిటంటే పొగతాగుతున్న వారికంటే మానేసిన వారిసంఖ్య ఎక్కువగా ఉందని. పొగతాగడం అలవాటు మానేయడం సాధ్యమే అని ఈ పరిశోధన వలన తేలింది. సిగరెట్, పొగాకులో నికోటిన్ ఉంటుంది. ఇది మన శరీరం మెదడుపై తీవ్రప్రభావం చూపించి అలవాటును కొంచెం కొంచెం పెంచుకుంటూ పోతుంది. మరింత సమాచారం కోసం క్రింద లింక్ చూడండి
ఒకటినుండి రెండు, మూడు, ఐదు అంటూ ఒక్కటి కాల్చినపుడు పొందిన సంతృప్తి బదులు ఎక్కువగా అయినప్పుడు మాత్రమే పొందగలం. అలాగే శరీరంలో నికోటిన్ స్థాయి తగ్గినపుడు మెదడు సిగరెట్ కాల్చమని సూచిస్తుంది. ఒక్క సిగరెట్ కాల్చడం వల్ల 4000 రకాల కెమికల్స్ విడుదలవుతాయి. ఇందులో 400 రకాలు విషపూరితం. అలాగే 43పైగా మరియు కాన్సర్ కారకాలు. ఈ కెమికల్స్ రక్తాన్ని కలుషితం చేస్తాయి. ఈ కలుషిత రక్తం శరీరంలో అవయాలను పాడుచేస్తుంది. ఆప్రభావం చర్మంపై మొదలయి చిరాకు, ఒత్తిడి ఎక్కువయి పురుషులలో శీఘ్ర స్కలనం, స్ర్తీలలో సంతాన సమస్యలు పెరుగుతాయి. నెమ్మదిగా ఆకలి తగ్గిపోయి శరీరం పోషకవిలువలు గ్రహించడం తగ్గిపోతుంది. దీనివలన ఇమ్యూనిటి పూర్తిగా బలహీనపడుతుంది.
ఆరోగ్యంగా ఉన్న ఊపిరితిత్తులు పింక్ కలర్లో ఉంటే కలుషితం అయినవి బ్లాక్ కలర్లోకి మారిపోతాయి. నల్లగామారిపోయిన లంగ్స్ రక్తాన్ని నల్లగా చేస్తాయి.
లంగ్స్ శుభ్రపడాలంటే మనం చేయవలసింది చిన్న చిట్కా. దానికోసం దాల్చిన చెక్క పొడి, అల్లం రసం, తేనె, కాయిన్ కారంపొడి, నిమ్మరసం.. కాయిన పెప్పర్ అనేది లావుగా పొడవుగా ఉండే ఒకరకం మిరపకాయలు పొడి. ఇది ఊపిరి తిత్తులు, గుండె, కాలేయం , కడుపు కిడ్నీలను శుభ్రపరచడంలో సహాయపడుతుంది. ఒక పావులీటర్ నీటిని బాగా మరిగించి అందులో పావు టేబుల్ స్పూన్ కాయిన్ పెప్పర్ పౌడర్, పావుస్పూను దాల్చిన చెక్క పొడి, ఒక టేబుల్ స్పూన్ అల్లంరసం ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం రెండు స్పూన్ల తేనె కలిపి రాత్రిపూట పడుకునే అరగంట ముందు టీలా తీసుకోవాలి.
ఇది ఊపిరితిత్తులలో చేరిన నల్లదనాన్ని తగ్గించి శరీరం మెటబాలిజం పెంచుతుంది. అంతేకాకుండా శరీరంలో పొగతాగడం వలన ఏర్పడే నష్టాన్ని సరిచేస్తుంది. ఈ డ్రింక్ శరీరాన్ని శుభ్రపరచడంతో పాటు రక్తాన్ని కూడా శుద్ధి చేస్తుంది. ఈ మిశ్రమాన్ని తీసుకుంటుంటే ఊపిరితీసుకోవడంలో ఉన్న తేడా గమనిస్తారు. అలాగే గోధుమ గడ్డి రసం కూడా ఊపిరితిత్తులను శుభ్రపరిచి రక్తాన్ని కూడా మెరుగ్గా తయారుచేస్తుంది. చ్యవన్ ప్రాస్ కూడా ఊపిరితిత్తులను శుభ్రంచేయడంలో సహాయపడుతుంది. నీటిని ఎక్కువగా తీసుకుంటూ పొగతాగడాన్ని మొదట సగానికి నెమ్మదిగా పూర్తిగా మానేస్తే శుభ్రపడిన లంగ్స్ ఆరోగ్యవంతంగా మారతాయి.మంచి నడక, వ్యాయామం అలవాటు చేసుకుని పొగాకుకు దూరంగా ఉండాలి. ఈ డ్రింక్ క్రమంతప్పకుండా తీసుకుంటూ ఈ చిట్కాలు పాటిస్తే ఊపిరితిత్తులను కాపాడుకోవచ్చు.
Even one coconut water per week also is said to cleanse lungs.
Thank you