how to cleanse face at home naturally

షాంపూలో ఇది కలిపి రాస్తే సంవత్సరాలుగా పేరుకుపోయిన మురికి కూడా పోయి చర్మం నిమిషాల్లో తెల్లగా మారిపోతుంది

మన చర్మ అందంగా ఉండాలని బ్యూటీ పార్లర్ అని  క్రీములను వాడుతూ ఉంటాము. కానీ కెమికల్స్ ఉన్న క్రీములు వాడటం వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అంతేకాకుండా క్రీములు వాడటం వల్ల ఎటువంటి ప్రయోజనం కూడా ఉండదు. ఇంట్లో ఉండే పదార్థాలతో ఈ ప్యాక్ తయారు చేసుకొని వాడటం వల్ల సంవత్సరాల నుండి పేరుకుపోయిన మురికి, టాన్ , నల్లటి మచ్చలు కూడా పోయి చర్మం అందంగా, తెల్లగా , కాంతివంతంగా తయారవుతుంది. ఈ ప్యాక్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు బేకింగ్ సోడా, కాఫీ పొడి, నిమ్మకాయ, షాంపూ. 

తయారు చేసుకోవడం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక బౌల్ తీసుకొని రెండు స్పూన్ల బేకింగ్ సోడా వేసుకోవాలి.  దానిలో ఒక చిన్న ప్యాకెట్ కాఫీ పొడి  వేసుకోవాలి.  రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇందులో ఒక టేబుల్ స్పూన్ షాంపు( మీరు రెగ్యులర్గా వాడే షాంపూ  అయినా వాడుకోవచ్చు) వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మెడ ,కాళ్లు, చేతులు నల్లగా ఉన్న భాగంలో నిమ్మచెక్కతో స్క్రబ్ చేస్తూ అప్లై చేసుకోవాలి. 5 నిమిషాలపాటు మసాజ్ చేసి బాగా ఆరనివ్వాలి. 

బాగా ఆరిన తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. ఇలా చేయడం వలన నల్ల మచ్చలు ,టాన్  పోయి చర్మం తెల్లగా అవుతుంది. టాన్ రిమోవ్ చేసుకోవడం కోసం పార్లర్ చుట్టూ తిరిగి  వేలకు వేలు ఖర్చు పెడతాము. కానీ ఈజీగా ఇంట్లోనే ఈ చిన్న ప్యాక్ తో చర్మం తెల్లగా తయారవుతుంది.  ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. తక్కువ ఖర్చులో ఇంట్లో ఉండే పదార్థాలతోనే చర్మాన్ని అందంగా, కాంతివంతంగా తయారు చేసుకోవచ్చు. ఈ ప్యాక్ ని ఈజీగా ఇంట్లోనే తయారుచేసుకుని టాన్, నల్లటి మచ్చలను పోగొట్టుకోవచ్చు.

ఈ ప్యాక్ ని ఫేస్ మీద అసలు ఉపయోగించకూడదు. ఎందుకంటే దీంట్లో బేకింగ్ సోడా ఉపయోగిస్తున్నాం కాబట్టి ఫేస్ మీద వేసుకోవడం మంచిది కాదు. బేకింగ్ సోడా పడని వాళ్ళు ఈనో ప్యాకెట్ యూస్ చేయొచ్చు. అలాగే నిమ్మకాయ పడని వాళ్ళు టమాటా లేక బీట్ రూట్ జ్యూస్ ఉపయోగించుకోవచ్చు. ఈ ప్యాక్ వేసుకోవడం వలన చర్మం తెల్లగా అవ్వడమే కాకుండా చర్మం ఫ్రెష్గా, యంగ్ గా కనిపిస్తుంది. ఈ ఈజీ చిట్కా మీరు కూడా ట్రై చేసి మీ చర్మాన్ని అందంగా ,కాంతివంతంగా తయారుచేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!