How to Cleanse Your Blood Naturally

రక్తాన్ని సులువుగా శుద్ధిచేసే చిట్కాలు!!

మన శరీరంలో ఆక్సిజన్, పోషకాలు మరియు హార్మోన్లను కణజాలాలకు రవాణా చేయడంలో రక్తానిది చాలా ప్రముఖ పాత్ర. దీనివల్ల మన శరీరంలో రక్తం స్వచ్ఛంగా మరియు మలినాలు లేకుండా ఉండటం అత్యవసరం. రక్తంలో మలినాలు ఉన్నట్టైతే పైన చెప్పుకున్నా రవాణా వ్యవస్థ సమర్థవంతంగా సాగదు. అయితే మలినమైన దకథాన్ని శుద్దిచేయడానికి మన శరీరంలో మూత్రపిండాలు మరియు కాలేయం ప్రధానంగా పనిచేస్తాయి. కానీ మనం కూడా ఎప్పటికప్పుడు రక్తాన్ని స్వచ్చంగా ఉంచుకోడానికి గృహాచిట్కాలు పాటించడం వల్ల గొప్ప ప్రయోజనం ఉంటుంది.  రక్తంలో ఉన్న వ్యర్థ పదార్థాలను తొలగించడానికి దోహాధం చేసే కొన్ని సులువైన మరియు ప్రభావవంతమైన చిట్కాలు చూద్దాం మరి.

నిమ్మరసం

 నిమ్మరసం  రక్తంలో మలినాలను మరియు జీర్ణవ్యవస్థను శుద్దిచేయడానికి  సహాయపడుతుంది.  నిమ్మరసంలో ప్రకృతిసిద్ధమైన సిట్రిక్ ఆమ్లంఉంటుంది. ఇది శరీరంలో  పిహెచ్ స్థాయిని సమతాస్థితిలో ఉంచగలదు మరియు రక్తంలో విషాలను తొలగించడంలో ఉపయోగపడుతుంది.  అనేక వైరస్లు మరియు ఇతర వ్యాధికారకాలు ఆల్కలీన్ వాతావరణంలో జీవించలేవు. రక్తంలో మలినాలను తొలగించుకోవడానికి ప్రతిరోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో  నిమ్మరసం నీటిని త్రాగాలి.  1/2 నిమ్మకాయ రసాన్ని ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో పిండి, మీ అల్పాహారం ముందు త్రాగాలి.

యాపిల్ సైడర్ వెనిగర్ మరియు బేకింగ్ సోడా

ఈ రెండిటి కలయిక శరీరం యొక్క pH స్థాయిని సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది.  ఇది రక్తం మరియు శరీర కణజాలాలను క్లియర్ చేస్తుంది. రక్తం నుండి యూరిక్ ఆమ్లాన్ని తీసివేసి శుద్ధి చేస్తుంది.  2 టేబుల్ స్పూన్లు ఆపిల్ సైడర్ వెనిగర్ మరియు 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా ఖాళీ గాజులో వేయాలి. దీన్ని కొద్దిసేపు అలాగే ఉంచాలి. అపుడు బేకింగ్ సోడా మరియు వెనిగర్ మిశ్రమ నుండి బుడగలు రావడం తగ్గిపోతాయి.   తగ్గిన తరువాత ఇందులో నీరు కలిపి వెంటనే త్రాగాలి.  అయితే రక్తపోటు ఉన్నవారు దీన్ని ఉపయోగించకపోవడమే శ్రేయస్కరం. 

తులసి

చాలా ఆహారాలలో ఉపయోగించే పవిత్ర తులసిలో యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి.  మీ రక్తాన్ని శుద్ధి చేయడానికి మరియు రక్తం, కాలేయం మరియు మూత్రపిండాల నుండి విషాన్ని తొలగించడానికి అద్భుతమైన ఔషధం. ఇది మూత్రం ద్వారా శరీరం నుండి విషాన్ని తొలగిస్తుంది.  ఇంకా ఎక్కువ ప్రయోజనం పొందాలంటే ఐదు నుండి ఆరు తులసి ఆకులను చూర్ణం చేసి ఆహారంలో చేర్చుకోవచ్చు.  ఒక కప్పు వేడి నీటిలో ఆరు నుండి ఎనిమిది తులసి ఆకులను వేసి మరిగించి తులసి ఆకుల టీ ని తయారుచేసుకుని తీసుకోవడం కూడా మంచి పలితాన్ని ఇస్తుంది. 

పసుపు

 పసుపు మనందరికీ తెల్సిన గొప్ప ఔషధ మరియు మసాలా దినుసు.   ఇది రక్తాన్ని శుభ్రపరుస్తుంది మరియు అనారోగ్య సమస్యలో ఉంది చికిత్స తీసుకునేవారిలో వైద్య ప్రక్రియను వేగవంతం చేస్తుంది.  కర్కుమిన్ అనే రసాయనం మంట మరియు శరీరంలోని ఇతర సమస్యలతో పోరాడగలదు.  పసుపు ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయడానికి కూడా సహాయపడుతుంది  ఒక కప్పు వెచ్చని పాలలో 1/2 టీస్పూన్ పసుపు పొడి కలపి త్రాగాలి.  ఇది కాలేయాన్ని  సరైన తీరులో పనిచేసేలా సహకరిస్తుంది.

 నీరు

 నీరు సహజంగా శరీరాన్ని శుద్ధిచేసే ఔషధం.  మనం నీటిని ఎంత తీసుకుంటున్నాం అనేదాని మీద మన రక్త స్వచ్ఛత ఆధారపడి ఉంటుంది. నీరు శరీరం నుండి విషాన్ని బయటకు వెళ్లేలా చేస్తుంది మరియు అవయవాలు సరిగా పనిచేయడానికి సహాయపడుతుంది.  ఇది ఖనిజాలు మరియు విటమిన్ల రవాణాకు సహాయపడుతుంది మరియు మూత్రవిసర్జన, చెమట ద్వారా వ్యర్థాలు బయటకు వెళ్లేందుకు నీటిని బాగా తీసుకోవడం అత్యవసరం.

 చివరగా….

మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే రక్తం స్వచ్చంగా ఉండాలి కాబట్టి పైన చెప్పుకున్న పద్ధతులు పాటించి ఆరోగ్యంగా ఉండవచ్చు.

Leave a Comment

error: Content is protected !!