బీపీ అనేది తీసుకుంటే 100 మందిలో 30 నుంచి 40 మందికి కనబడుతుంది. దీనికోసం మందులు వాడుతున్నారు. అనేక కారణాల వల్ల మనకి బీపీ పెరగడం అనేది జరుగుతుంది. ఏదో కొన్ని నియమాలు పాటించినంత మాత్రాన బీపీ కంట్రోల్ లోకి రాదు. డాక్టర్స్ చెప్పిన విధంగానే పెరుగన్నం లో ఉప్పు వేసుకోవడం మానేయడం, కూరల్లో బాగా తగ్గించడం లేదా పూర్తిగా మానేయడం వీటితోపాటు కాస్త మానసిక ఒత్తిడి తగ్గించుకోవడం, వ్యాయామాలు చేయడం ఇలాంటి నియమాలు కొంత ఆచరిస్తున్నప్పటికీ కొంతమందికి బీపీ అనేది కంట్రోల్లో ఉండదు.
ఎక్కువగా ప్రమాదాలు జరిగేది బీపీ వల్లనే. అందుకనే బీపీని సైలెంట్ కిల్లర్ అంటారు. బీపీ ఈ విధంగా ఎందుకు ఉంటుంది అంటే రక్తనాళాలు ముడుచుకునే గుణం ఎక్కువై సాగే గుణం తక్కువ అవడం వలన ఇలాంటి సమస్యలు ఎక్కువ వస్తాయి. రక్తనాళాలు ఎంత బాగా సాగితే రక్తనాళాలు అంత వెడల్పు అయ్యి రక్తం సులువుగా ప్రవహిస్తుంది. రక్తనాళాల గోడలలో స్మూత్ కండరాలు ఉంటాయి. ఇవి గట్టిపడటం వలన రక్తనాళాలు ముడుచుకు పోతాయి. అందువలన మీరు ఆచరించే కొన్ని ఆహార నియమాలతో పాటు మిరియాలు వాడగలిగితే మంచిది.
స్మూత్ కండరాలను మిరియాలు రిలాక్స్ చేస్తాయని సైంటిఫిక్ గా నిరూపించబడింది. 2010 సంవత్సరంలో సువేకియ దేశం వారు మిరియాలు స్మూత్ మజిల్స్ ను రిలాక్స్ చేస్తున్నాయని నిరూపించారు. మిరియాలు వాడుకోవడం వలన నష్టం ఏమీ ఉండదు. రోజుకు రెండు మూడు గ్రాముల మిరియాలు వాడుకుంటే మంచిది. ఇందులో ఉండే పేప్పరిన్ అనే కెమికల్ స్మూత్ మజిల్స్ ను రిలాక్స్ చేసి, రక్తనాళాలలో పుఢికలు వంటివి రాకుండా చేయడానికి, రక్త ప్రయాణానికి ఆటంకాలు రాకుండా తొలగించడానికి ఇవి సహాయపడతాయి.
అలాంటి మిరియాలను బీపీ తో బాధపడేవారు ఇతర నియమాలతో పాటు దీనిని కూడా ఉపయోగించగలిగితే చక్కటి ఫలితాన్ని పొందవచ్చు. ఈ మిరియాలను దోరగా వేడి చేసుకుని మెత్తని పొడి లాగా చేసుకుని రోజుకి రెండు మూడు గ్రాములు పొడిని సలాడ్స్ పైన, మొలకల పైన చల్లుకొని తినవచ్చు. కూరల పైన కూడా కాస్త మిరియాల పొడి చల్లుకుంటే బాగుంటుంది. లేదా రెండు మూడు గ్రాముల మిర్యాల పొడిని చిన్న అన్నం ముద్దలో నెయ్యి వేసుకొని కలుపుకొని తినవచ్చు. కనుక దీనివల్ల కూడా బీపీని కొంత మేరకు కంట్రోల్ లో ఉంచుకోవచ్చు…