how to control heavy bleeding in women home remedies

అధిక బ్లీడింగ్ తో బాధపడేవారికి, షుగర్ వున్న వారికి, యాంగ్జైటీ ఉన్నవారికి అద్భుతమైన మందు ఈ కూర

అరటి పువ్వు కూర గురించి వింటూ ఉంటాం. ఎక్కువగా బ్రాహ్మణుల వంటల్లో వినే ఈ కూర చేయడానికి కొంచెం కష్టంగా ఉన్నా రుచిలో అమోఘంగా ఉంటుంది. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. షుగర్, యాంగ్జైటీ సమస్యలు ఉన్నవారు ఈ అరటి కూర తీసుకోవడం వలన ఆరోగ్యానికి చాలా మంచిది. అరటి పువ్వు సహజ మార్గాలలో అంటువ్యాధుల చికిత్సలో చాలా ప్రభావవంతంగా ఉంటుంది. 

బహిష్టు సమయంలో అధిక రక్తస్రావం అరికడుతుంది. మధుమేహాన్ని నియంత్రిస్తుంది. మానసిక స్థితిని పెంచుతుంది మరియు ఆందోళనను తగ్గిస్తుంది.  క్యాన్సర్ మరియు గుండె జబ్బులను నివారిస్తుంది.  చనుబాలిచ్చే తల్లుల్లో పాలను  మెరుగుపరుస్తుంది.  వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదిస్తుంది.  కిడ్నీ పనితీరును ప్రోత్సహిస్తుంది. 

ఈ అరటి పువ్వుతో కూర తయారు చేసుకోవడం ఎలాగో తెలుసుకుందాం.

అరటి పువ్వుపైన ఉండే పొరలను ఒక్కొక్కటిగా తీస్తుంటే లోపల హస్తాలు రూపంలో చిన్న చిన్న పువ్వులు ఉంటాయి. దాని లోపల ఉండే పుప్పొడి కాడలు చిన్న కర్రలా ఉంటాయి. వాటిని అలాగే దాని చుట్టూ ఉండే తెల్లటి పొరని సేకరించి  తీసి పక్కన పెట్టుకోవాలి.

తరువాత  పుప్పొడి కాడలు తీసుకున్న  పువ్వులను చిన్న ముక్కలుగా తరిగి ఒక గిన్నెలో ఒక గ్లాసు నీటిని స్టౌపై పెట్టి దానిలో ఒక స్పూన్ ఉప్పు, కొంచెం పసుపు వేసి మరగనివ్వాలి. నీళ్లు మరిగిన తరువాత ఈ పువ్వు ముక్కలను అందులో వేసి కనీసం 15 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. అరటిపువ్వు కొంచెం పెలుసుగా ఉంటుంది. కనీసం  పది పదిహేను నిమిషాల పాటు ఉడికించాలి. తర్వాత మెత్తగా అవుతుంది. ఉడికిన తరువాత వెంటనే ఈ పువ్వులను వడకట్టి పక్కన పెట్టుకోవాలి.

 ఒక గిన్నెలో ఒకటిన్నర స్పూన్ నూనె వేసి అందులో తాలింపు దినుసులు వేసుకోవాలి. అవి వేగిన తరువాత 3 మీడియం సైజు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కోసి వేసుకోవాలి. దీనిలోకి మసాలా కోసం 6 పచ్చిమిర్చి, ఇంచు అల్లం ముక్క, ఎండుకొబ్బరి ముక్కలను మెత్తని పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ఉల్లిపాయల్లో వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకోవాలి. ఈ మిశ్రమం పచ్చివాసన పోయేంత వరకూ వేయించి, ఉడికించి పక్కన పెట్టుకున్న అరటిపువ్వును నీళ్లు పోయేలా గట్టిగా పిండి వేసుకోవాలి.

వీటిని బాగా కలిపి కావలసినంత ఉప్పు, కారం వేసుకుని కొంతసేపు ఉడికించాలి. పొడి కూర చేసుకున్నాం కనుక ఏదైనా కూరకు సైడ్డిష్గా చాలా బాగుంటుంది. పువ్వు నుండి తీసుకున్న పుప్పొడి కాడలు పనికిరావు. వాటిని పారేసి తెల్లటి పొర తీసుకున్నాం కదా దానిని కొద్దిగా తాలింపులు, ఉప్పు, కారంతో వేయిస్తే క్రిస్పీగా చాలా బాగుంటాయి. రసం, పప్పుచారు వంటి వాటికి పక్కన నంచుకోవడానికి రుచి చాలా బాగుంటుంది.

Leave a Comment

error: Content is protected !!