టీనేజ్ పిల్లల నుంచి మహిళల వరకు ప్రతి ఒక్కరూ ఎదుర్కొని సమస్య ఇర్రెగ్యులర్ పీరియడ్స్. ఇది పిల్లలు కావాలనుకునే స్త్రీ లకు ప్రధాన సమస్యగా మారుతుంది. దీనికి కొన్ని సహజ చిట్కాలు ద్వారా పరిష్కారం లభిస్తుంది. దాని కోసం మనం ఇప్పుడు మూడు చిట్కాలను తెలుసుకుందాం. ఇవి మనకు సమయానికి రాకుండా ఆగిపోయిన నెలసరి రెండు, మూడు రోజుల్లో వచ్చేలా చేస్తాయి.
దీని కోసం మనం మొదట నువ్వులను తీసుకోవాలి. నువ్వులు శరీరంలో వేడిని కలిగించి పీరియడ్స్ రావడానికి సహకరిస్తాయి. దీనితోపాటు బెల్లం శరీరంలో రక్త హీనత సమస్యను తగ్గించి, ఐరన్ లోపాన్ని అధిగమించడానికి సహకరిస్తుంది. తర్వాత పదార్థం ఇంచు అల్లం ముక్క కూడా తీసుకోవాలి. శరీరంలో వేడిని పెంచేందుకు సహకరిస్తుంది. జీర్ణ సంబంధ సమస్యలు తొలగించి గర్భాశయ సమస్యలు పోగొడుతుంది.
దీని ద్వారా సమయానికి పీరియడ్ వచ్చేలా చేస్తుంది. ఇప్పుడు దీనిని ఒక గ్లాస్ నీటిలో రెండు చెంచాలు నువ్వులు, ఒక చిన్న బెల్లం ముక్క, అల్లం తురుము వేసుకోవాలి. ఈ నీటిని బాగా మరిగించి తర్వాత వడకట్టి రెండు పూటలా తీసుకోవాలి. ఇలా కనీసం 15 రోజులపాటు చేస్తే శరీరంలో గర్భ సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. అధిక రక్తస్రావం సమస్య కూడా తగ్గుతుంది.
రెండవ చిట్కా కోసం వాము తీసుకోవాలి. దీనిని వేయించి పొడి చేసి పెట్టుకోవాలి. ఈ పొడిని గోరువెచ్చని పాలలో వేసి ఉదయం, సాయంత్రం తీసుకోవాలి. ఇలా రోజూ చేయడం వలన గర్భాశయ సమస్య తగ్గి నెలసరి క్రమం తప్పకుండా వస్తుంది. వాము శరీరంలో అధిక ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తుంది. నెలసరి రావడానికి, రక్తస్రావంలో సమస్యలు తొలగిస్తుంది.
ఇక మూడవ చిట్కా కోసం మిరియాలు తీసుకోవాలి. మిరియాలు అర స్పూన్ తీసుకొని మెత్తని పొడిలా చేసుకోవాలి. దీనిలో ఒక స్పూన్ తేనె కలిపి ఉదయం, సాయంత్రం తీసుకోవాలి. ఇలా 15 రోజులపాటు చేస్తే నెలసరి క్రమంతప్పకుండా వస్తుంది. అయితే మిరియాలను ఎక్కువ రోజులు, అధిక మోతాదులో ఉపయోగించకూడదు. పెళ్లి అయిన వారు డాక్టర్ సలహా లేనిదే ఎటువంటి చిట్కాలు ఉపయోగించకూడదు.