పసుపును భారతీయ మహిళలు అందానికి వాడుతుంటారు. దీన్ని రాసుకోడం వలన ముఖంలో కాంతితో పాటు,అవాంచిత రోమాలు రావడం, తగ్గుతాయి. అలానే పసుపుని అండర్ ఆర్మ్స్ వద్ద వచ్చే హెయిర్ గ్రోత్ అరికట్టేందుకు కూడా వాడొచ్చు. యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ ఇంఫ్లేమేటరీ లక్షణాలు కలిగి ఉండటంతో ఇది అత్యంత సురక్షితమైనది. హెయిర్ ను శాశ్వతంగా తొలగించేందుకు తోడ్పడుతుంది. కనీసం పది సార్లు క్రమం తప్పకుండా వాడితే తప్పక ఫలితాన్ని చూపిస్తుంది. దీనిని సహజ పదార్థాలతో ఎలా వాడాలో తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు:
- 4 టీస్పూన్ల ఆర్గానిక్ పసుపు
- 2 టీస్పూన్ల పాలు
- దీని ముందు ఖరీదైన ఫేషియల్ కానీ ఫేస్ ప్యాక్ కానీ పనిచేయదు
- రాత్రి పూట ఇలా చేస్తే వద్దన్నా మీ జుట్టు పెరుగుతూనే ఉంటుంది
ఎలా వాడాలి ?
- రెండు టీస్పూన్ల పాలల్లో నాలుగు టీస్పూన్ల ఆర్గానిక్ పసుపుని కలిపి చిక్కటి పేస్ట్ ను చేసుకోవాలి.
- ఈ పేస్ట్ ను హెయిర్ గ్రోత్ ఉన్న అండర్ ఆర్మ్స్ లో సమానంగా రాసుకోవాలి. హెయిర్ గ్రోత్ డైరెక్షన్ లోనే ఈ పేస్ట్ ను అప్లై చేయాలి.
- ఈ పేస్ట్ పూర్తిగా డ్రై అయ్యాక, ఉతికిన ఒక పాత పొడిబట్టను తీసుకుని హెయిర్ ను స్క్రబ్ చేసుకుంటూ హెయిర్ గ్రోత్ కు అపోజిట్ డైరెక్షన్ లోంచి హెయిర్ ను తొలగించాలి. రఫ్ గా కాకుండా నెమ్మదిగా హెయిర్ ను తొలిగిస్తే, నొప్పి కలగదు.
- ఈ ఆర్గానిక్ టర్మరిక్ పేస్ట్ ను తరచూ వాడటం వలన హెయిర్ గ్రోత్ తగ్గడంతో పాటు మళ్ళీ రాకుండా అరికట్టబడుతుంది.