How to Cure Diabetes Permanently Controls Blood Sugar Levels

డైవర్స్ టు షుగర్ మీ జీవితంలో నుండి షుగర్ ను తన్ని తరిమి వేయండి…………

 ప్రస్తుత కాలంలో ఇంట్లో నాలుగురు ఉంటే అందులో ఒకరు షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు. వీరు జీవితాంతం ఈ వ్యాధితో బాధపడుతూనే ఉండాలి. మనం లైఫ్ మొత్తం రక్తంలోకి చెక్కెర్లను పెంచుతూ దాన్ని తగ్గించుకోవడానికి పైనుంచి మందులు మింగుతూ వస్తున్నాం. పట్టణాలలో 25 శాతం మంది పల్లెటూర్లలో 20 శాతం మంది షుగర్ వ్యాధితో బాధపడుతూ ఉన్నారు. దీనిని నివారించుకోవడానికి మన చేతిలో ఉన్న వజ్రాయుధం లాంటిది లో కార్బోహైడ్రేట్స్ హై ప్రోటీన్ డైట్ ఈ విధంగా మన డైట్ ఉంటే ప్రాంకీయస్ గ్రంధి బాగా పనిచేస్తుంది. దీనివలన ఇన్సులిన్ రెసిడెన్సీ తగ్గుతుంది.

కనుక మనం తీసుకునే ఆహారంలో ప్రోటీన్ ఉండవచ్చు, ఫైబర్ ఉండవచ్చు కానీ కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువగా ఉండాలి. కష్టపడి పని చేయని వాళ్ళకి కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉండాలి. కనుక డీటాక్సీఫీకేషన్ కోసం పొద్దున్నే లేవగానే రెండు గ్లాసుల నీళ్లు తీసుకొని వ్యాయామాలు ముగించిన తర్వాత అల్పాహారం సమయంకు ముందు బూడిద గుమ్మడికాయ జ్యూస్ను తీసుకోవాలి. ఇవి లోక్యాలరీస్ కలిగి ఉంటాయి. మరియు ఎక్కువ మినరల్స్ ను కలిగి ఉంటుంది. కనుక ఫ్రాంకీయస్ గ్రంధిని బాగా పనిచేసేటట్లు చేస్తుంది.

ఈ జ్యూస్ తాగిన తర్వాత బ్రేక్ ఫాస్ట్ లో మొలకెత్తిన గింజలు 3 మూడు రకాలు, అందులో కొన్ని దానిమ్మ గింజలు, 2 ఖర్జూరాలను ముక్కలుగా చేసి వేసుకొని, మరియు కొన్ని ఆపిల్ ముక్కలు వేసుకొని బాగా కలుపుకొని వీలైతే ఒక స్పూన్ మెంతుల పొడిని కూడా వేసుకోవాలి. మెంతుల పొడి రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గిస్తుంది. దీనీతో పాటు ఒక బొప్పాయి గాని, ఖర్బుజ గాని లేదా జామకాయ గాని తీసుకోవాలి ఈ విధంగా అల్పాహారంను ముగించాలి. మధ్యాహ్నం 12గం సమయానికి జామ ఆకు కషాయము తీసుకోవాలి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది అని జపాన్ వారు నిరూపించారు.

లంచ్ లో ఒక లేదా రెండు పుల్కాలు వీటితో పాటు పప్పులు మరియు మునగాకు లేదా మెంతి కూర ఉపయోగించాలి.  5గం. సమయంలో కొబ్బరి నీళ్లు తాగాలి. డిన్నర్ లో వాల్ నట్స్, నాన్న పెట్టిన వెరుశెనగలు, పచ్చికొబ్బరి ముక్కలు ఇంకా ఏమైనా డ్రైనట్స్ ను తీసుకోవాలి. డిన్నర్ ను 7 గంటల లోపే ముగించాలి. ఇటువంటి డైట్ ను రోజు పాటించడం ద్వారా రక్తంలోని చక్కెరను తగ్గించుకోవచ్చు. దీని ద్వారా షుగర్ కంట్రోల్ లో ఉంటుంది……

Leave a Comment

error: Content is protected !!