ప్రమాదం ఏదైనా జరిగినడు ఒకోసారి చిన్న చిన్న దెబ్బలతో బయటపడతాము. కొన్నిసార్లు ఎముకలు విరుగుతుంటాయ్. ఆ బాధ ఎలా ఉంటుందో చాలా మందికి అనుభవమే జీవితంలో ఒక్కసారి అయినా. అయితే కాస్త ప్రమాద పనులు చేసేవాళ్ళలో ఎముకలు విరగడం అనేది ఎక్కువ. ఈ ఎముకలు విరగడం అనేది జరగగానే కట్టు కట్టడం అవసరం అయితే ఆపరేషన్ చేయడం వంటివి చేయాల్సి వస్తుంది. అయితే ఇవన్నీ కూడా హాస్పిటల్ కు వెళ్లి వైద్యుని ద్వారా చేయించుకునేవే. కానీ ఇలా ఎముకలు విరిగినపుడు ఎవరికి వారు కొన్ని ఉపాయాలను పాటించడం ద్వారా ఎముకలు అతుక్కునేలా చేసుకోవచ్చు. అలాంటి అద్భుతమైన ఉపాయాలు ఇపుడు మీకోసం.
◆ ప్రస్తుతం సిరిధాన్యాల గూర్చి విస్తృతంగా తెలిసాక కొర్రలు అనే పేరు మనకు కొత్తేమి కాదు. కొర్రలతో అన్నం వండుకుని తినడం, కొర్ర పిండితో దోసెలు, రొట్టెలు, లడ్డులు ఇలా ఏ పదార్థాలను అయినా చేసుకుని తినాలి. కొర్రలు తీసుకుంటూ ఉంటే విరిగిన ఎముకలు తొందరగా అతుక్కుంటాయి. వండిన కొర్రలకు నెయ్యి జోఫించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అయితే తినమన్నారని కొర్రలు ఎక్కువ తీసుకుంటే వేడి చేసి పైత్యాన్ని పెంచుతాయి. అంతేకాదు జీర్ణమవడం కష్టమవుతుంది.
◆ అడవి పంది కొవ్వును కరిగించి నూనె తయారు చేసి ఎముక విరిగిన చోట పట్టిస్తూ ఉంటే విరిగిన ఎముక తొందరగా అతుక్కుంటుంది.
◆ స్వచ్ఛమైన తేనెను సంపాదించి ప్రతిరోజు దాన్ని వాడుతూ ఉంటే ఎముకలు తొందరగా అతుక్కోవడంలో దోహాధం చేస్తుంది.
◆ గోమూత్ర శిలాజిత్ కు ఎముకల్ని అతుక్కునేలా చేసే శక్తి ఉంది. శిలాజిత్యాధియోగం అనే ఔషధం ప్రతి ఇంటిలో నిల్వ ఉంచుకోవాలి. ఇది ఎముకలు విరిగినపుడు వాడుతుంటే అద్భుతంగా పనిచేస్తుంది.
◆ నల్లేరు మనందరికీ తెలిసినదే నల్లేరు ను ఆహారపదార్థంలో భాగంగా తీసుకుంటే గొప్పగా దోహాధం చేస్తుంది. దీన్ని రెండు రకాలుగా ఉపయోగించవచ్చు. ఒకటి ఆహారంగా తీసుకోవడం రెండు పైపూతగా వేయడం.
నల్లేరు దంచి రసం తీసి దాంతో చారులాగా చేసుకుని తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే నల్లేరు గుజ్జుకు మినప్పప్పు పిండి కలిపి రొట్టె చేసుకుని తినవచ్చు. ఇందులో రుచి కోసం జీలకర్ర ఇంగువ కొత్తిమీర కూడా జోడించవచ్చు. నల్లేరు రసానికి సమానంగా నువ్వుల నూనె కలిపి స్టవ్ మీద రసం ఇగిరిపోయేదాక వేడి చేసి వడగట్టి ఈ నూనెను విరిగిన ఎముకల మీద రాస్తూ ఉంటే తొందరగా అతుక్కుంటాయి.
◆ వెల్లుల్లి కూడా ఎముకలు విరిగినపుడు తిరిగి అతికించడంలో తోడ్పడుతుంది.
◆ ఎంఉకలు విరిగి బాధపడుతున్నవారు గగనాదివటి, శిలాదిత్యాది యోగం అనే రెండు ఆయుర్వేద ఔషధాలు వాడితే చాలా గొప్ప ఉపశమనం లభిస్తుంది.
చివరగా……..
ప్రస్తుత హాస్పిటల్స్ ప్రతి చిన్న సమస్యకు ఆపరేషన్ లు చేయడం మొదలు పెట్టిన తరుణంలో ఆయుర్వేదం గొప్ప ప్రయోజనకారిగా కనబడుతోంది. శరీరంలో రోగనిరోధకశక్తిని తగ్గించకుండా జబ్బును సమస్యను నయం చేయడంలో గొప్పగా దోహాధం చేస్తుంది కాబట్టి పైన చెప్పుకున్న ఉపాయాలు పాటిస్తే సమస్యను సులువుగా అధిగమించవచ్చు.