How to cure LIPOMA Naturally

ఇది రాస్తే మీ శరీరంలోని లింపోమా, కొవ్వు గడ్డలు పూర్తిగా మంచులా కరిగిపోతాయి.

శరీరంలో అక్కడక్కడా కొవ్వు గడ్డలు ఏర్పడుతూ ఉంటాయి. వీటిని లింపోమా,  కణుతులు లేదా కొవ్వు గడ్డలు  అంటారు. వీటివలన నొప్పి ఉండదు అయినా డాక్టర్ చేత పరీక్ష చేయించుకొని కేవలం కొవ్వు గడ్డలు అని నిర్ధారణ అయితే మంచిది లేదంటే కొన్నిసార్లు క్యాన్సర్ గడ్డలు కూడా ఏర్పడుతుంటాయి. ఇలా శరీరంలో ఏర్పడే కొవ్వు గడ్డలు శరీరానికి ఎటువంటి హాని చేయకపోయినా నరాలపై ఏర్పడటం వలన ఒక్కోసారి నొప్పి , ఒత్తిడి కలిగిస్తాయి. ఒక్క చోట ఉంటే వాటిని తొలగించుకోవడం చేయవచ్చు కానీ కొంతమందికి శరీరమంతా ఏర్పడుతుంటాయి. వీటిని తొలగించినా తిరిగి వచ్చే అవకాశం ఉందని డాక్టర్లు చెబుతున్నారు.

 వీటిని సహజంగా, శాశ్వతంగా తగ్గించుకోవడానికి కొన్ని చిట్కాలను పరిశీలిద్దాం. అలోవెరా గుజ్జును కొమ్మ నుండి సేకరించి మిక్సీలో మెత్తగా చేసుకోవాలి. దీనిలో ఒక వెల్లుల్లి రెబ్బను, అర స్పూన్ పసుపు వేసి మెత్తని పేస్ట్ లా చేసుకొని వేడి చేయాలి. ఇలా వేడి చేసిన మిశ్రమాన్ని గోరువెచ్చగా ఉన్నప్పుడు కొవ్వు గడ్డలుపై అప్లై చేయడం వలన కొవ్వు గడ్డలు తగ్గిపోతాయి. ఇలా ప్రతిరోజు కనీసం నాలుగు రోజులపాటు రాత్రి అప్లై చేసి మరుసటి రోజు శుభ్రంగా కడుక్కోవాలి.

 తర్వాత చిట్కా కోసం మునగ ఆకులను తీసుకుని టీలా చేసుకొని తాగడం వలన లేదా పేస్ట్ చేసి కొవ్వు గడ్డలుకు అప్లై చేయడం వల్ల కొవ్వు కరిగించుకోవచ్చు.  మునగ ఆకులతో పాటు బెరడు కూడా కొవ్వు గడ్డలు కరిగించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. చెట్టు నుండి  బెరడును సేకరించి గంధంలా నూరి ఎక్కడైతే కొవ్వు గడ్డలు ఉన్నాయో అక్కడ అప్లై చేయడం వలన కొవ్వు గడ్డలు కరిగించుకోవచ్చు. అలాగే మందార ఆకులు, జామాయిల్ ఆకులు సేకరించి రెండింటిని మెత్తగా నూరి కొవ్వు గడ్డలపై పెట్టి కట్టు కట్టాలి. 

ఇలా కనీసం వారం రోజుల పాటు చేయడం వలన కొవ్వు గడ్డలు కరిగి పోతాయి. మనకి పొలాల్లో ఎక్కువగా కనిపించే రెడ్డివారి నానుబాలు మొక్క పాలను కొవ్వు గడ్డలు పై అప్లై చేయడం వలన కూడా కొవ్వు గడ్డలు కరిగించుకోవచ్చు. ఈ టిప్స్ పాటిస్తూ ఆహారంలో పోషకాలు ఉండే ఆహారాన్ని తీసుకుంటూ నూనెలు, జంక్ ఫుడ్ తగ్గించడం వలన శరీరంలో వ్యర్ధాలు పేరుకోకుండా అడ్డుకోవచ్చు. కొవ్వు గడ్డలు నిరోధించవచ్చు.

Leave a Comment

error: Content is protected !!