How To Cure Vitiligo naturally in Telugu

బొల్లి మచ్చలు వచ్చాయని భాధపడక్కర్లేదు ఇదిగో పరిష్కారాలు……

దురద నొప్పి మంట వంటి సమస్యలు ఏమి లేకుండా కేవలం చర్మం మీద తెల్లని మచ్చలు అసహ్యంగా కనిపించడం తప్ప మరో బాధ ఏమి ఉండదు ఈ బొల్లి సమస్య వల్ల.చాలా మంది దీని వల్ల ఆత్మన్యూనతా భావానికి లోనవుతుంటారు. ఇది సారీర్జంలో త్రిగుణాలు అయిన వాత, పిత్త, కఫ దోషాలు అసమతుల్యత వల్ల వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. విరుద్ధమైన ఆహారాలు తినడం, నెగిటివ్ తరహా ఆలోచనలు చేయడం వల్ల హార్మోన్ల అసమతుల్యత కూడా బొల్లి సమస్య రావడానికి కారణం అవుతుంది. అయితే దీన్ని తగ్గించుకోవడం ఆయుర్వేదంలో సాధ్యమే కొన్ని పరిష్కారాలు మీకోసం.

◆ వాతదోషం వల్ల ఏర్పడిన మచ్చలు గరుకుగానూ,  ఎర్రగానూ ఉంటాయి, అదే కఫ దోషం వల్ల ఏర్పడినవి తెల్లగా పెద్దగా ఉంటాయి. కొత్తగా మొదలైన బొల్లి మచ్చలను తగ్గించడం చాలా సులువు కానీ పాత మచ్చలు ఆలస్యంగా తగ్గుతాయి. అయితే ఇలాంటి మార్పు లేకుండా తటస్థంగా ఉన్నవాటిని తగ్గించడమే సమస్య.

◆ కాలినందువల్ల ఏర్పడే తెల్ల మచ్చ మందులతో నల్లబడటం జరగదు. అలాగే అరచేతిలో, అరికాళ్ళలో, పెదాల మీద వచ్చిన మచ్చలు ఆలస్యంగా తగ్గుతాయి. శరీరానికి ఎండ తగులుతూ ఉండే ప్రాంతాల్లో వచ్చిన మచ్చలు తొందరగా తగ్గుతాయి.

◆ బావంచి మొక్క గింజలనే బావంచాలు అని అంటారు. ఇవి బొల్లి మచ్చల మీద అమితమైన ప్రభావాన్ని చూపిస్తాయి.  స్రోరలిన్స్ పేరుతో పదస్తుత ఆధునిక వైద్యులు కూడా ఈ బావంచాలలో ఉన్న సారాన్ని గ్రహించి ఔషధంగా వాడుతుంటారు.బొల్లి కి సూచించే మెలనోసిల్, మానాడెర్మ్ వంటి ఔషధాలు ఇలాంటివే! బావంచాలు కడుపులోకి తీసుకున్నప్పుడు సూర్యరశ్మిని  శరీరం ఎక్కువ గ్రహించేలా చేస్తాయి.

◆ రక్తంలోనూ, మాంస కండరాలలోనూ, కొవ్వు పోరల్లోనూ  పేరుకున్న వాతాధి దోషాలను తగ్గించేందుకు, చర్మానికి ఆరోగ్యాన్ని చేకూర్చేందుకు ఇలాంటి ఔషధాలు  చాలా ఉన్నాయ్. వాటిలో మంజిష్ట, వావిలి, పసుపు, సుగంధిపాలు, తుంగముస్తలు, ఎర్రచందనం, మానుపసుపు, నేల వేము,  అతి వస వంటి ఎన్నో గొప్ప  ఔషధాలు ఉన్నాయి.

◆ సూర్యకాంతం, శారిబాదివటి, సోమరాజివటి, చంద్రప్రభావటి, మంజిష్టాది కషాయం వంటి  ఔషధాలు బొల్లి మచ్చల చికిత్సలో వాడతారు. అయితే ఈ మచ్చలలో కూడా వివిధ రకాలుగా ఉండటం వల్ల మందులను సలహా మీద తీసుకుంటే ఉత్తమం.

◆ రోగి శరీర తత్వాన్ని , ఇతర ఆరోగ్య పరిస్థితులను,  అలవాట్లను, జీవన విధానాన్ని దృష్టిలో ఉంచుకుని చర్మవ్యాధుల చికిత్సలో అనుభవం ఉన్న  వైద్యుల సమక్షంలో దీన్ని వందశాతం జయించవచ్చు.

◆ బొల్లి చికిత్స లో రోగి సహకారమే జబ్బు తగ్గడానికి ఎక్కువ అవకాశాన్ని కలిగిస్తుంది. విరుద్ధమైన ఆహార పదార్థాలు తినడాన్ని మానుకోవడం. పాలు, పెరుగు, చేపలు, ఉప్పు, చింతపండు, శనగపిండి, నువ్వులు, బెల్లం వంటివన్నీ అతిగా తినకుండా మితంగా తీసుకోవడం, జబ్బును తగ్గించుకోగలం అనే పట్టుదల ముఖ్యంగా ఉండాలి

చివరగా……

బొల్లి మచ్చల చికిత్స  పైన చెప్పుకున్న విధంగా సాధ్యమైనప్పటికి జననాంగాలు, అరచేతులు, అరికాళ్ళు, పెదవులు  వంటి భాగాలలో  వచ్చే మచ్చలను తగ్గించుకోవడానికి ఓపిక చాలా అవసరం

Leave a Comment

error: Content is protected !!