How to DELAY Periods NATURALLY

ఇలా చేస్తే సహజంగా నెలసరిని వాయిదా వేయవచ్చు.

అమ్మాయిలు ఒక వయసుకు వచ్చాక ఋతుక్రమం అనేది జీవితంలో ఒక భాగం అయిపోతుంది. అయితే కొన్నిసార్లు ఈ నెలసరి అనేది చెప్పలేనంత ఇబ్బంది పెడుతుంది. కారణం ఏంటంటే మనకు బాగా కావలసిన వారి పెళ్లి, శుభకార్యాలు, లేక ఎక్కడికైనా వెళ్ళాలని అనుకుని నెలసరి సమస్య వల్ల ఆగిపోవడం వంటి సమస్యల వల్ల ఇబ్బంది పడుతుంటాం.మెడికల్ స్టోర్ లలో నెలసరి వాయిదా వేయడానికి టాబ్లెట్స్ ఉన్నా కూడా వాటిని వాడాలంటే భయపడుతుంటారు. కారణం ఆ తరువాత నెలసరి అస్తవ్యస్తం అవ్వడం లేదా టాబ్లెట్స్ వల్ల వేరే సమస్యలు తలెత్తడం జరుగుతూ ఉంటుంది. అయితే అందరికోసం నెలసరి ని సహజంగా వాయిదా వేయడం వల్ల మనం ఎలాంటి సమస్యలు లేకుండా మన పనులు పూర్తి చేసుకోవచ్చు వీటివల్ల ఎలాంటి దుష్ప్రభావాలు కలగకపోవడం అందరికి సంతోషాన్ని కలిగించే విషయం.మరి నెలసరి వాయిదా వేయడం ఎలా???  చూడండి మరి.

వాయిదా వేద్దాం ఇలా….

◆ కందిపప్పు ను ఉపయోగించడం ద్వారా నెలసరి వాయిదావేయవచ్చు అంటే ఆశ్చర్యం వేస్తోంది కదూ…… కానీ ఇది నిజం. కందిపప్పును వేయించి మిక్సీ లో వేసి పొడిగా చేసి ఆ పొడిని నీళ్లలో వేసి సూప్ గా తయారుచేసుకోవాలి. ఈ సూప్ ను తాగడం వల్ల నెలసరి వాయిదా వేయచ్చు.

◆వెనిగర్. సాధారణంగా మనం వంటల్లో ఇంకా చెప్పాలంటే స్ట్రీట్ ఫుడ్స్ లో వెనిగర్ ను విరివిగా ఉపయోగిస్తూ ఉంటారు. అలాంటి వెనిగర్ నెలసరిని ఆలస్యం చేస్తుందంటే నమ్మలేం కానీ నమ్మి తీరాలి. ఒక గ్లాస్ నీటిలో మూడు నుండి నాలుగు స్పూన్ల వెనిగర్ వేసి తీసుకోవడం వల్ల నెలసరి ఆలస్యం చేయవచ్చు.

◆వంటల్లో విరివిగా వాడే కొత్తిమీర కూడా నెలసరి ఆలస్యం చేసేందుకు ఔషదంలా పనిచేస్తుంది. నీటిలో కొత్తిమీర వేసి బాగా మరిగించి ఆ నీటికి కొద్దిగా తేనె చేర్చి రోజుకు రెండుసార్లు తాగాలి.

◆నిమ్మరసాన్ని నీటిలో కలిపి తీసుకోవాలి. అలాగే వీలైనంత ఎక్కువగా నిమ్మసరం కలిపిన నీళ్లు తీసుకోవడం వల్ల నెలసరి  వాయిదా వేయచ్చు.

◆ కోరెందకాయ అందరికి తెలియదు కానీ రాస్బెర్రీ అంటే అందరికి సులువుగా అర్థం అవుతుంది. ఈ రాస్బెర్రీ ఆకులను ఎండించి పొడి చేసి నిల్వచేసుకోవాలి. ఈ పొడి తో టీ ని చేసుకుని తాగడం వల్ల నెలసరి వాయిదా వేయచ్చు.

◆ ఎంగెలిక వేరు అనేది ఒక మూలిక. ఈ ఎంగెలిక వేరు ను, రాస్బెర్రీ ఆకులను నీటిలో వేసి బాగా మరిగించి ఆ నీరు చల్లారిన తరువాత రోజుకు రెండు స్పూన్ల మోతాడుగా తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

◆ నెలసరి వాయిదా వేయడానికి మరొక సులభమైన చిట్కా. కడుపు మీద గర్భాశయం ఉన్న ప్రాంతంలో మసాజ్ చేయడం వల్ల కూడా పలితం పొందవచ్చు.

చివరగా…….

ఇవి మాత్రమే కాకుండా  రోజువారీ తీసుకునే ఆహారంలో కారం, ఉప్పు తగ్గిస్తూ, ఘాటైన పదార్థాలను దూరంగా ఉంచడం కూడా నెలసరి వాయిదా వేసుకోవడానికి ఆచరించాల్సిన ఒక ముఖ్యమైన పద్దతి. వీటిని దూరంగా ఉంచడం వల్ల రక్తప్రసరణ వ్యవస్థ కాసింత నెమ్మదిగా ఉంటూ శరీర హార్మోన్లను మందగించి నెలసరి వాయిదా అయ్యేలా చేస్తాయి. అయితే మహిళ శరీర ఆరోగ్యం అనేది  నెలసరి సక్రమంగా  ఉండటం మీద ఆధార పడి ఉంటుంది. కాబట్టి అత్యవసరం అయితేనే  నెలసరి వాయిదా కోసం పై పద్ధతులు పాటించండి. చిన్న చిన్న కారణాలకు వాయిదా వద్దు. ఎందుకంటే మన ఆరోగ్యానికి మించిన అమూల్యమైనది వేరే ఏదీ లేదు మరి.

Leave a Comment

error: Content is protected !!