హిందు సంప్రదాయంలో ఎన్నోపండుగలు,శుభకార్యాలు,వస్తుంటాయి.ఇలాంటి సమయంలో మీరు రుతుక్రమంలో ఉంటే ఇంట్లోవారికి ,అలానే మీకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. కొంత మంది రుతుక్రమాన్ని ఆలస్యం చేయడానికి, మందులు వేసుకుంటారు. కాని వాటిని వాడటం వలన భవిష్యత్తులో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందువలన సహజ నివారణల ద్వారా రుతుక్రమాన్ని వాయిదా వేయడం ఉత్తమం. రుతుక్రమాన్ని వాయిదా వేయడం అంత మంచి పద్ధతి కాదని కొందరు అనుకుంటారు. కాని కొన్నిసార్లు ఇలా చేయడం కూడా ఆరోగ్యకరమే అని అంటున్నారు వైద్య నిపుణులు.
కారంగా ఉండే ఆహారాన్ని నిషేదించాలి
కారంగా ఉండే ఆహర పదార్ధాలు తినడం వలన శరీరంలో రక్త ప్రసరణ ఎక్కువగా జరుగుతుంది. మీరు మీ రుతుక్రమాన్ని వాయిదా వెయ్యాలనుకుంటే వెల్లుల్లి, మిరపకాయలు మరియు మిరియాలు వంటివి మానేస్తే రుతుక్రమాన్ని వాయిదా వేయవచ్చు.
చలవ చేసే పదార్ధాలు తీసుకోవడం
రుతుక్రమాన్ని వాయిదా వేయాలి అనుకునే మహిళలు వారి వారి ఆహార నియమాలపట్ల నియంత్రణ వహించాలి. వేడిగా ఉన్న ఆహారాలు తినడం మానేసి చల్లనివి, చలవ చేసే పదార్ధాలు తినడం మంచిది.
- దీని ముందు ఖరీదైన ఫేషియల్ కానీ ఫేస్ ప్యాక్ కానీ పనిచేయదు
- రాత్రి పూట ఇలా చేస్తే వద్దన్నా మీ జుట్టు పెరుగుతూనే ఉంటుంది
వ్యాయామం
రోజూ వ్యాయామం చేయడం వలన శరీరానికే కాక మానసిక ఒత్తుడులను నియత్రించడంలోను తోడ్పడుతుంది. కొంతమంది స్త్రీలలో నెలలో రెండు సార్లు రుతుక్రమం రావడం జరుగుతుంది. ఇలాంటి వారికి వాకింగ్, జాగింగ్, మరియు ఇతర వ్యాయామాలు ఎంతో మేలు చేస్తాయి.
ఒత్తిడిని నియంత్రించడం
రుతుక్రమం క్రమంగా రాకపోడానికి ముఖ్యమైన కారణం ఒత్తిడి. యోగా చేయడం ద్వారా, ఎక్కువగా పద్మాసనం మీద కూర్చొని శ్వాస మీద శ్రద్ధ ఉంచడం వలన మీ ఒత్తిళ్ళు అదుపులోకి వస్తాయి. ఆ తరువాత రుతుక్రమాన్ని వాయిదా వేయవచ్చు.
Disclaimer
This video is created for information purpose only. We Strongly recommend our viewers to consult doctor before applying any of the discussed methods as described in the post.