How to detox liver naturally from alcohol

లివర్ లో ప్రతి కణ కణంను కడిగి యాక్టివేట్ చేస్తుంది……. లివర్ యొక్క పనితీరును మెరుగుపరుస్తుంది…… లివర్ను ఒక క్రమ పద్ధతిలో క్లీన్ చేస్తుంది

 మన శరీరంలో లివర్ అనేది అతి ముఖ్యంగా వ్యర్థాలను బయటకు పంపించడానికి, టాక్సిన్స్ ను బయటికి పంపించడానికి, కెమికల్స్ ని విడగొట్టి బయటికి పంపించడానికి అలాగే శరీరంలోని మరియు ఆహారం ద్వారా తయారైన ఫ్రీ రాడికల్స్ ను లివర్ క్లీన్ చేయవలసి ఉంటుంది. ఈ ఫ్రీ రాడికల్స్ అనేవి ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ రావడానికి లేదా దీర్ఘకాలిక రోగాలు రావడానికి ప్రధాన కారణం. ప్రస్తుత కాలంలో దీర్ఘకాలిక రోగాలు పెరిగిపోవడానికి, క్యాన్సర్లు రావడానికి ఫ్రీ రాడికల్స్ కారణం. వీటిని ముఖ్యంగా లివర్ మాత్రమే క్లీన్ చేయాలి.

                             మనం డ్రై ఆఫ్రికాట్స్ లేదా ఫ్రెష్ ఆఫ్రీకాట్ తీసుకున్నప్పుడు ఇందులో ఉండే క్లోరోజనీక్ అనే కెమికల్ కాంపౌండ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ క్లోరోజనీక్ ఆసిడ్ లివర్లో ఫ్రీ రాడికల్స్ తొలగించడానికి బాగా సహాయపడతాయి. అంటే 50- 70% ఫ్రీ రాడికల్స్ ను డ్రై ఆఫ్రికాట్స్ 7, 8 తింటే60-70% ఫ్రీ రాడికల్స్ ను లీవర్ క్లీన్ చేయగలుగుతుంది అని 237 మంది మీద 2017 సంవత్సరంలో యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ ఎంజీలీయా స్పెషల్గా ఈ పరిశోధనలు చేశారు. అందుకని లివర్కు అద్భుతంగా మేలు చేసేది డ్రై ఆఫ్రికాట్స్. ఇవి చూడడానికి రుచికి కూడా చాలా బాగుంటాయి.

                              ఇవి ఎవరికైనా అందుబాటులో లభించే విధంగా ఉన్నాయి. మరియు ఖర్చు కూడా ఎక్కువ ఏమీ కాదు. కనుక వీటిని రోజు తినగలిగితే మన లివర్కు చాలా మంచిది. అలాగే ఫ్యాటీ లివర్ ఉన్న, అలాగే లివర్ సిరోసిస్ అన్న అంతేకాకుండా లివర్ సంబంధించిన ఇబ్బందులు ఉన్న ఇది తింటే లివర్ను సంరక్షించడానికి, ఎవరికైనా రక్షించడానికి చాలా ముఖ్యంగా ఇవి ఉపయోగపడతాయి. వీటిలో ఉండే ఇంకొక ఉపయోగం ఏమిటి అంటే 67% ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గిస్తుంది. మన కణాలు ఆక్సిజన్ తో రియాక్షన్ చెంది చెడిపోతాయి. అందువలన ఈ ఆక్సిడేటీవ్ వలన ఇన్ఫ్లమేషన్ ఎక్కువగా వస్తాయి.

                   100 గ్రాముల ఆఫ్రికాట్స్ లో 240 కిలో క్యాలరీల శక్తి ఉంటుంది. కార్బోహైడ్రేట్స్ 63గ్రా,‌ ఫ్యాట్ 0.6గ్రా, ఫైబర్ 7.3 గ్రామ్స్, విటమిన్ కె,ఈ,ఎ కూడా ఎక్కువగా లభిస్తాయి. ఇవన్నీ మన రక్షణ వ్యవస్థను పెంచడానికి బాగా ఉపయోగపడతాయి. కనుక ఇటువంటి డ్రై ఆఫ్రికాట్స్ ను ఇంట్లో స్టోర్ చేసుకొని పిల్లలు కూడా అలవాటు చేస్తే చాలా మంచిది

Leave a Comment

error: Content is protected !!