మన ఆహారంతో మన శరీరంలో చేరే వ్యర్థాలను బయటకు పంపించేందుకు కిస్మిస్ నానబెట్టిన నీళ్ళు చాలా బాగా పనిచేస్తాయి. కానీ ఆ కిస్మిస్ ఎలా నానబెట్టాలి. శరీరంలోకి ఎలా తీసుకోవాలి అనేది తెలుసుకుందాం. ఈ కిస్మిస్ నానబెట్టిన నీళ్ళు లివర్లోని టాక్సిన్లను శుభ్రం చేయడంలో ప్రముఖపాత్ర వహిస్తాయి. కిస్మిస్ నీళ్ళు లివర్లో జరిగే రసాయనిక ప్రక్రియను వేగవంతం చేసి మలినాలను బయటకు పంపిస్తాయి. ఈ నీళ్ళను నాలుగు రోజుల పాటు క్రమం తప్పకుండా తీసుకుంటే మీ జీర్ణశక్తి సరిగా పనిచేయడం గమనిస్తారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో చూడండి.
అలాగే శరీరంలో పెరిగే అధిక కొవ్వును తగ్గించి బరువు తగ్గడంలో సహాయపడుతుంది. కిస్మిస్ శరీరంలో పెరిగిపోయే ట్రై గ్లిజరాయిడ్స్ని నిర్మూలించి మలబద్దకం సమస్య ను తగ్గేందుకు దోహదపడుతుంది. అనేక ఉదర సంబంధ సమస్యలు తగ్గిస్తాయి. కిస్మిస్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరంలో వచ్చే ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొంటాయి. కిస్మిస్ నీళ్ళు డీటాక్సిఫికేషన్ చేయడం వలన నేరుగా గుండె, లివర్, కిడ్నీలపై ప్రభావం చూపించి ఆ అవయవాల పనితీరును మెరుగుపరుస్తాయి. మనం తినే జంక్ ఫుడ్, మద్యం తాగడం వలన విషపదార్థాలు లివర్లో చేరి పనితీరు కుంటుపడుతుంది.
లివర్లో సమస్యలు వస్తే శరీరంలో అనేక అనారోగ్యాలకు కారణమవుతుంది. ఈ కిస్మిస్ నీళ్ళు తాగడం వలన ఆ వ్యర్థాలను బయటకు పంపించివేస్తుంది. ప్రతి నెలా నాలుగు రోజులు ఈ నీటిని తాగడంవలన శరీరం డీటాక్సిఫికేషన్ అయ్యి కిడ్నీలు, లివర్ ఆరోగ్యం గా ఉంటాయి. జీర్ణక్రియ మెరుగపడడం వలన ఆహారంలోని పోషకాలు శరీరానికి అందుతాయి. కిస్మిస్ నీళ్ళు జీర్ణక్రియ కు అవసరమయ్యే జీర్ణరసాలు ఉత్పత్తి పెరిగేలా చేస్తుంది. ఈ నీటి తయారీ కోసం రెండు కప్పుల నీళ్ళు తీసుకుని ఒక కప్పు కిస్మిస్ నల్ల ఎండుద్రాక్ష అయితే చాలా మంచిది. అవి అందుబాటులో లేకపోతే గోల్డ్ కలర్ కిస్మిస్ అయినా పర్లేదు.
ఒకసారి నీటిలో వేసి కడిగి తర్వాత రెండు కప్పుల నీళ్ళను స్టౌ పై పెట్టుకుని మరిగించి ఆ నీటిలో కిస్మిస్ వేసి తక్కువ మంట మీద ఇరవై నిమిషాలు ఉడికించాలి. ఇక రాత్రంతా కిస్మిస్ అలాగే ఉంచి ఉదయం ఆ నీటిని వడకట్టుకోవాలి. పరగడుపున ఈ నీటిని తాగడంవలన శరీరంనుండి టాక్సిన్లను బయటకు పంపొచ్చు. ఈ నీటిని తాగిన తర్వాత అరగంట వరకూ ఆహారం తీసుకోవద్దు. ఉడికించిన కిస్మిస్ పారేయకుండా బ్రేక్పాస్ట్లో కానీ సాయంత్రం పూట కానీ తినొచ్చు .ఇలా తీసుకోనే సమయంలో మాంసాహారం, మసాలాలు, జంక్ ఫుడ్ తినకూడదు. ఆ నాలుగు రోజులు ఆకుకూరలు, కూరగాయలు తినడం వలన మంచి ఫలితాలు చూడొచ్చు. స్వీట్లలో ఉపయోగించే కిస్మిస్ ని వాడి ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.
Good message