నోరు మన శరీర ఆరోగ్యానికి అద్దంలాంటిది. అలాంటి నోరు అనేక రకాల సూక్ష్మ క్రిములకు నిలయంగా ఉండి శరీరంలోని అనేక అనారోగ్యాలకు కారణమవుతుంది. అంతే కాకుండా మనం తినే ఆహారం మైదా, నూనె సంబంధ పదార్థాలు, వేపుడు పదార్థాలు శరీరంలో చేరి సరిగా జీర్ణం కాక ప్రేగులలో ఉండి అవి ఇతర అవయవాలకు చేరినప్పుడు అనేక సమస్యలు వస్తాయి.
ఈ మలినాలు చర్మంలో చేరితే పిగ్మెంటేషన్, కిడ్నీలలో చేరితే కిడ్నీ సంబంధ వ్యాధులు లాంటివి ఏర్పడతాయి. ఇలాంటి శరీరంలోని మలినాలను తొలగించడానికి పురాతన విధానం అయిన ఆయిల్ పుల్లింగ్ గురించి తెలుసుకుందాం. ఆయిల్ పుల్లింగ్ అంటే కొబ్బరినూనెతో లేదా నువ్వులు ఏ ఇతర వంట నూనెలైనా చెంచాడు తీసుకుని నోటితో నాలుగు వైపులా పుక్కిలించాలి. మరింత సమాచారం కోసం ఈ వీడియో చూడండీ.
పరగడుపున ఈ విధంగా చేయడం వలన నోటిలోని నూనె ద్రవంగా తెల్లగా తయారవుతుంది. దాన్ని బయటకు ఉమ్మివేసి నోటిని శుభ్రంచేసుకోవాలి. ఇలా చేస్తే నూనె అయస్కాంతం లా పనిచేసి శరీరంలోని టాక్సిన్లను తొలగిస్తుంది. రోజులో మిగతా సమయం కంటే ఉదయాన్నే చేయడం వలన మంచి ఫలితం ఉంటుంది. దీనివలన నోటిలో పళ్ళ సందుల్లో ఉండే ఆహార వ్యర్ధాలు తొలగిపోవడమే కాకుండా తాజా శ్వాస సొంతమవుతుంది.
పదిహేను నుండి ఇరవై నిమిషాల పాటు ఇలా చేయడం వలన ముఖానికి మంచి వ్యాయామం లభించి గడ్డం కింద వేలాడే కొవ్వు కరిగి ముఖం అందమైన ఆకృతిలోకి వస్తుంది. ఈ ఆయిల్ని మింగకూడదు. ఎందుకంటే ఇది శరీరంలోని టాక్సిన్లను సంగ్రహిస్తుంది కనుక ఒకవేళ మింగినట్టయితే మళ్ళీ ఆయిల్ పుల్లింగ్ చేయాలి. దానివలన శరీరంలో చేరిన టాక్సిన్లను నూనె తీసేసుకుంటుంది. ప్రతిసారీ ఒకేరకం నూనె కాకుండా వేరే రకంనూనెలతో చేయాలి.
ఇలా చేయడం వలన చర్మం ఆరోగ్యంగా మారి ప్రకాశవంతంగా మారుతుంది. ఆయిల్ పుల్లింగ్ చేసేవాళ్ళలో రోగనిరోధక శక్తి పెరిగి బలంగా తయారవుతారు. రోజూ ఆయిల్ పుల్లింగ్ చేయడం వలన పళ్ళు కూడా తెల్లగా మారి, గమ్స్ కూడా గట్టిపడతాయి. రక్తప్రసరణ మెరుగుపడి ముఖం కాంతివంతంగా తయారవుతుంది. పళ్ళలో ఉండే బ్యాక్టీరియా తగ్గి ఆరోగ్యవంతమైన దంతాలవరుస సొంతమవుతుంది.
ఆయిల్ పుల్లింగ్ వలన ఇన్ని లాభాలు ఉండడం వలన చాలా మంది అలవాటుగా మార్చేసుకున్నారు. ఆయిల్ పుల్లింగ్ కోసం ప్రత్యేకమయిన నూనెలు కూడా సూపర్ మార్కెట్లో అందుబాటులో ఉంటున్నాయి.