How to Detox Your Intestine Colon Through Natural at Home

పంటికి బ్రష్ ఎలాగో పేగులకు ఇది అలాగా తిన్నది తిన్నట్లుగా రక్తంలో కలిసిపోతుంది విషం మొత్తం బయటకు వెళ్ళిపోతుంది

మన శరీరంలో పెద్ద ప్రేగు మన రెండు చేతులు చాచినంత పొడవు ఉంటుంది. ఇది మనం తినే ఆహారంలో వ్యర్థాలను మలం రూపంలో బయటకు పంపడంలో సహాయపడుతుంది. అయితే కొంత మందిలో మలబద్ధకం అనేది మలవిసర్జన కష్టతరం చేస్తుంది. ఇలాంటి సమయంలో ఎనిమా  శరీరంలోని మలాన్ని బయటకు పంపడంలో చాలా బాగా సహాయపడుతుంది. ఒక ఎనిమా మిషన్ తీసుకోని ఇంట్లోనే ఎనీమా చేసుకోవడం వలన శరీరంలో పేరుకుపోయిన మలాన్ని బయటకు పంపవచ్చు. ఇంట్లోనే చేసుకోవడం అతి తక్కువ ఖర్చులో అయిపోతుంది. అయితే చాలామంది మలబద్ధకం కోసం అనేక రకాల మందులు, హెర్బల్ ప్రొడక్ట్స్, టానిక్లు , ఆముదం వంటివి ఉపయోగిస్తూ ఉంటారు. 

కానీ కొన్ని రోజుల తర్వాత దుష్ప్రభావాలు కలిగించవచ్చు. అయితే ఎనీమా వలన ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. మనకి ఎప్పుడైనా విరోచనాలు జరిగినప్పుడు మలంతో పాటు పోషకాలు నిండిన నీరు కూడా బయటకు వెళ్ళిపోతుంది. దీని వలన శరీరం డీహైడ్రేట్ అవుతుంది. అయితే మనం మలద్వారం ద్వారా నీటిని పంపడం వలన ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా కేవలం మలాన్ని మాత్రమే బయటకు పంపిస్తుంది. కెమికల్స్ తో నిండిన సిరప్లు, టాబ్లెట్లు వాడటం వలన శరీరంలోని గుడ్ బ్యాక్టీరియా చనిపోతుంది. కానీ ఎనీమా కేవలం ప్రేగులని మాత్రమే శుభ్రపరుస్తుంది. ఎనీమా చేసుకోవడానికి ఇంట్లో వారు సహాయం తీసుకోవచ్చు. 

ఎప్పుడైనా హనీ, నిమ్మరసం ఉపవాసం చేసినప్పుడు ఆ రెండు రోజులపాటు ఇలా చేసుకోవడం వలన శరీరంలోని వ్యర్థాలను డిటాక్స్ చేసుకోవచ్చు. ఎనిమా చికిత్సకు ప్రధాన కారణాలలో ఒకటి మలబద్ధకం నుండి ఉపశమనం పొందడం. సాధారణంగా, వైద్యులు ముందుగా స్టూల్ మృదువుగా చేసి మలాన్ని శుభ్రపరచడానికి డెలివరీ ముందు సిఫార్సు చేస్తారు.  తర్వాత కోలన్ క్లెన్సింగ్, దిగువ GI X- రే, మరియు తాపజనక ప్రేగు వ్యాధి ఉన్నవారిలో ఎనీమా డాక్టర్లచే సిఫార్సు చేయబడుతుంది. మలబద్ధకం నుండి ఉపశమనం.  చిన్నపిల్లలు మరియు వృద్ధులతో సహా మలబద్ధకం ప్రమాదం ఎక్కువగా ఉన్న వారికి ఇది చాలా ముఖ్యం.  

అనారోగ్య సమస్యలు ఉన్న వృద్ధులలో అధిక శాతం మంది ఇతర కారణాలతో పాటు తక్కువ ద్రవ పదార్థాలు మరియు ఆహారం తీసుకోవడం వల్ల మలబద్ధకం కలిగి ఉంటారు. ప్రేగు సంబంధిత వ్యాధుల లక్షణాల ఉపశమనం.  ఎనిమా గ్యాస్, ఉబ్బరం మరియు మలబద్ధకం నుండి ఉపశమనం పొందవచ్చు. శక్తి స్థాయి పెరుగుతుంది. రోగనిరోధక శక్తి మరియు వ్యాధితో పోరాడే సామర్థ్యం పెరగడంలో తోడ్పడుతుంది. ప్రేగులలో సూక్ష్మజీవులను శుభ్రం చేస్తుంది. పెరిస్టాల్సిస్, ఇది ప్రేగుల కదలిక ద్వారా విష వ్యర్థాలను నెట్టివేస్తుంది. ప్రోస్టేట్ ఆరోగ్యం మెరుగుపడుతుంది. క్యాన్సర్‌కు సంబంధించిన వికారం మరియు నొప్పి తగ్గడంలో ఉపయోగపడుతుంది. చర్మ ఆరోగ్యం విషయంలో సహాయపడుతుంది.

Leave a Comment

error: Content is protected !!