how to do intermittent fasting

ఇంటర్మీటెంట్ (Intermittent) ఫాస్టింగ్ అంటే ఏంటి? అది ఎలా చేయాలి? దాని వల్ల వచ్చే ఉపయోగాలు.

ఇంటర్మీటెంట్ (Intermittent) ఫాస్టింగ్ అంటే ఏదో కొత్త ఫుడ్ తినడం కాదు.  మనం తినే ఫుడ్ నే  ఒక పద్ధతిలో తినడం. అంటే తినడానికి ఎంతసేపని  తినకుండా ఉండటానికి ఎంతసేపని రోజువారి టైం ని డివైడ్ చేసుకోవడం.  అయితే ఈ ఇంటర్మీటెంట్ ఫాస్టింగ్ చేయడానికి చాలా పద్దతులు ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి రెండు.

1. 16/8 ఫాస్టింగ్

ఒక రోజులో 24 గంటలు ని 16 గంటలపాటు ఏమీ తినకుండా ఉండేలా, మిగతా ఎనిమిది గంటల్లో మొత్తం తినేదంతా తినేసేలా డివైడ్ చేసుకోవడం.

ఉదాహరణకి మనం రాత్రికి 10 గంటలకు డిన్నర్ పూర్తి చేశామంటే  మరుసటి రోజు మధ్యాహ్నం 2 గంటల వరకు ఏమి తినకూడదు. ఆ తర్వాత ఆ మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 10 లోపు తినే ఫుడ్ అంతా తినేయాలి. ఇలా ప్రతి రోజు చేయాలి.  అయితే మీరు ప్రతి రోజు చేయలేకపోతే రెండవ పద్ధతిని పాటించండి.

2. వీక్లీ ఒన్స్ ఆర్ ట్వైస్ (Weely once or twice)

ఈ పద్దతిలో వారంలో ఒకరోజు సెలెక్ట్ చేసుకొని దానిలో 18 నుండి 24 గంటల పాటు ఏమి తినకుండా ఉండాలి.  ఇలా వారంలో ఒక రోజు లేదా రెండు రోజులు చేయొచ్చు.

మొదటిసారిగా 18 గంటలు చేయలేకపోతే మొదటి వారంలో  14 గంటలు తర్వాత 16 గంటలు ఆ తరువాత 18 గంటల చొప్పున పెంచుకుంటూ వెళ్ళవచ్చు.

ఈ ఇంటర్మీటెంట్ ఫాస్టింగ్ లో ఉన్నప్పుడు ఏం తీసుకోవాలి.

ఫాస్టింగ్ టైంలో ఎటువంటి ఫుడ్స్ కానీ కూల్ డ్రింక్స్  కానీ తీసుకోకూడదు. కేవలం వాటర్ మాత్రమే తాగాలి. అదికూడా ఎక్కువగా తాగాలి. ఎందుకంటే డీహైడ్రేషన్ అయ్యే ప్రాబ్లం ఉంటుంది కాబట్టి. అయితే ఆ నీటిలో ఇటువంటి సాల్ట్ గాని స్వీట్ గాని ఉండకూడదు. ఇంకా కావాలంటే గ్రీన్ టీ కానీ బ్లాక్ కాఫీ కానీ తీసుకోవచ్చు. కానీ అందులో స్వీట్, హనీ లేదా స్వీట్నర్స్ ఏవీ కలుపుకోకూడదు.

ఇంటర్మీటెంట్ ఫాస్టింగ్ వల్ల వచ్చే బెనిఫిట్స్

  • వెయిట్ లాస్ (Weight loss) బరువు తగ్గాలనుకొనే వారు ఎవరైనా ఈ పద్ధతిని పాటించవచ్చు
  • అరుగుదల పెరగడానికి (Improve digesion) మీ జీర్ణ వ్యవస్థ మెరుగు పడాలి అనుకుంటే ఈ డైట్ ఫాలో అవ్వొచ్చు.
  • షుగర్ కంట్రోల్ (blood sugar control) మీ షుగర్ లెవెల్స్ ను కంట్రోల్లో ఉంచుతుంది.
  • మీ బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ (bad cholesterol) ను తగ్గిస్తుంది.
  • మీ ఓవరాల్ ఎనర్జీ ని పెంచుతుంది ఎవరెవరు

ఎవరెవరు ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయకూడదు.

  • ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకుంటున్న డయాబెటిక్ పేషెంట్స్ ఈ డైట్ చేయకూడదు.
  • కడుపుతో ఉన్నవాళ్లు మరియు పిల్లలకు పాలిచ్చే తల్లులు ఈ డైటింగ్ కూడదు.
  • 18 ఏళ్లలోపు పిల్లలు ఈ డైట్ ఫాలో అవ్వకూడదు

Leave a Comment

Scroll back to top
error: Content is protected !!