How to Ease Cramps on your Period

నెలసరి ఇబ్బంది పెడుతుందా?? ఇలా చేస్తే సక్రమంగా వస్తుంది.

అమ్మయిలలో నెలసరి సహజమైనది. ప్రతి నెలా ఆ మూడు రోజులు దొర్లిపోతేనే అమ్మాయిల ఆరోగ్యం దృడంగా ఉంటుంది. లేకపోతే హార్మోన్ల సమస్యలు వచ్చి ఆరోగ్యం అస్తవ్యస్తం అవుతుంది. అయితే ఇప్పట్లో చాలామందిలో ఆ నెలసరి అనేది ఒక పెద్ద సమస్యగా మారింది. సక్రమంగా నెలసరి రాకపోవడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటూ మానసికంగా డిప్రెషన్ కు గురి అవుతూ ఊబకాయం, అధిక బరువు వంటి సమస్యలతో బాధపడుతున్నారు. అయితే అమ్మాయిలను గందరగోళ పరిచే ఈ నెలసరిని చక్కదిద్దే అద్భుతమైన చిట్కా ఒకటుందని చాలామందికి తెలియదు. ఆ చిట్కాకు కావలసిన పదార్థాలు ఎలా పాటించాలి చూస్తే ఇక నెలసరి గూర్చి బెంగ పడక్కర్లేదు.

కావలసిన పదార్థాలు

ఈ చిట్కా కోసం పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. వంటింట్లో దొరికే దినుసులు చాలు.

జీలకర్ర

పసుపు

నిమ్మకాయ

ఎర్రగా పండిన టమాటా.

పై నాలుగు అందుబాటులో ఉంచుకోవాలి.

ఎలా ఉపయోగించాలంటే…..

జీలకర్రను మెత్తగా పొడిగా చేసుకోవాలి. ఒక గ్లాసుడు నీటిలో ఒక స్పూన్ జీలకర్ర పొడి, పావు స్పూన్ పసుపు,  సగం చెక్క నిమ్మరసం పిండుకోవాలి. దీన్ని బాగా కలిపిన తరువాత బాగా పండిన ఎర్రని టమోటా రసాన్ని తీసి  పైన తయారు చేసుకున్న డ్రింక్ లో కలపాలి. 

ఇలా తయారు చేసుకున్న డ్రింక్ ను తీసుకోవడం వల్ల సరిగా రాని నెలసరి సక్రమం అవుతుంది.

జీలకర్ర, పసుపు, నిమ్మదసం మరియు టమాటా ఈ నాలుగింటి కలయిక వల్ల తయారు చేసుకున్న డ్రింక్ గర్భాశయ సమస్యలను తొలగిస్తుంది. ముఖ్యంగా గర్భాశయ నీటి తిత్తులుగా పిలవబడే సిస్ట్ లను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. అంతే కాదు హార్మోనల్ ఇంబాలెన్సు ను తగ్గించి శరీరంలో అసమతుల్యతలను తగ్గిస్తుంది.  దీనివల్ల రక్తప్రసరణ మెరుగు పడి నాడీ వ్యవస్థ చైతన్యవంతం అవుతుంది.

జీలకర్రలోని ఫైబర్ శరీరంలో అదనపు కొవ్వులను తగ్గిస్తుంది. కొందరిలో అధిక బరువు వల్ల కూడా నెలసరి సమస్య ఎదురవుతుంది. అలాంటి సమస్యలను జీలకర్ర తగ్గిస్తుంది. అలాగే పసుపు గొప్ప యాంటీబయటిక్ గా పనిచేయడం మాత్రమే కాకుండా గర్భాశయాన్ని అక్కడి ఇన్ఫెక్షన్ లను తగ్గించడంలో ఉత్తమంగా పనిచేస్తుంది.  నిమ్మరసంలో సిట్రస్ రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా శరీరంలోని అదనపు కొవ్వులను కరిగించడంలో గొప్పగా సహాయం చేస్తుంది.  టమాటా ఎర్ర రక్తకణాలను అభివృద్ధి చేయడంలో దోహాధం చేస్తుంది. దీనివల్ల రక్తప్రసరణ వ్యవస్థ పనితీరు మెరుగుపడి అమ్మయిలలో ఋతుచక్రం తిరిగి సరైన స్థానానికి వస్తుంది.

చివరగా……

పైన చెప్పుకున్న డ్రింక్ ను తయారుచేయడానికి అన్ని సహజమైన ఆరోగ్యాన్ని చేకూర్చే వంటింటి దినుసులు ఉపయోగించడం వల్ల ఈ డ్రింక్ ను తీసుకోవడం వల్ల ఎలాంటి దుష్పరిణామాలు ఉండవు. కాబట్టి నెలసరి సరిగా రాక ఇబ్బంది పడేవాళ్ళు తప్పక ఆచరించండి.

Leave a Comment

error: Content is protected !!