కోడిగుడ్డు అధిక ప్రొటీన్లు కలిగి ఉండే ఆహారపదార్ధం . గుడ్డును చాలామంది పచ్చివి, ఉడకబెట్టినవి లేదా వేయించి తీసుకుంటారు. కానీ ఇలా తీసుకునేటప్పుడు ఏవి ఆహారానికి మంచిది అనేది తెలుసుకుందాం. గుడ్డులో 6గ్రాముల ప్రొటిన్ ఉంటుంది. నాలుగు గ్రాముల ప్రొటీన్ తెల్లసొనలోనూ రెండు గ్రాముల ప్రొటిన్ పచ్చసొనలోనూ ఉంటాయి. మామూలుగా అందరూ ఉడికించిన గుడ్డు కంటే పచ్చికోడిగుడ్డుసొనలోఎక్కువ ప్రొటీన్లు ఉంటాయని నమ్ముతారు. కానీ గుడ్డు ఎలా తిన్నా 6 గ్రాముల ప్రొటిన్ దొరుకుతుంది. పచ్చసొనలో 27గ్రాముల ఫ్యాట్ ఉండడంవలన అందరూ పచ్చసొన తినడానికి దూరంగా ఉంటారు. ఇది ఉడికించిన లేదా వేయించిన తర్వాత మారుతుందీ కారణం మనం ఉపయోగిఃచిన నూనె కారణం. మరింత సమాచారం కోసం క్రింద లింక్ చూడండి
గుడ్డులో ఉండే తెల్లసొన పూర్తి ప్రొటీన్లతో నిండి ఉండడంవలన బాడీబిల్డింగ్ చేసేవారు కూడా ఎక్కువగా డైట్లో తీసుకుంటారు. ఎంత పౌష్టికాహారం అయినా సరిగ్గా జీర్ణమవకపోతే అందులోని పోషకాలను శరీరం గ్రహించకపోతే వ్యర్థం. కనుక గుడ్డు ఎలా తినాలి. దానిలోని పోషకాలను గురించి తెలుసుకుందాం. పచ్చసొన తీసివేసి తెల్లభాగం మాత్రం ఫ్యాట్ ఫ్రీ, కొలెస్ట్రాల్ ఫ్రీ ఇందులో ప్రొటిన్ పుష్కలంగా ఉంటుంది. ప్రపంచంలో ఇంతమొత్తంలో ప్యూర్ ప్రొటిన్ ఎందులోనూ దొరకదు. ఉడికించిన కోడిగుడ్డు మరియు పచ్చి కోడిగుడ్డులో సమానమైన ప్రొటిన్ ఉన్నందున పచ్చిగా తినాలనుకోవచ్చు.కానీ ఇది ఆరోగ్యకరం కాదు. పచ్చికోడిగుడ్డులో ఒక రకమైన బాక్టీరియా ఉంటుంది. ఈ బాక్టీరియాను సాల్మొనియా అంటారు. ఈ బాక్టీరియా పచ్చికోడిగుడ్డు తినడంవలన కడుపులో ఫుడ్ పాయిజన్ కలిగేందుకు సహకరిస్తుంది.
దీనివలన లూజ్ మోషన్, కడుపు నొప్పి, తలనొప్పి, జ్వరం రావడానికి కారణమవుతుంది. ఇది పిల్లలు, పెద్దవారు , గర్బిణిలలో మరింత ప్రమాదం. కొంతమంది లో ఎటువంటి ఇబ్బంది లేదంటే ఇమ్యూన్ సిస్టం బలంగా ఉందని అర్థం. అందుకే పచ్చిగుడ్డు మంచిది కాదు. పచ్చిగా తిన్నప్పుడు 50%మాత్రమే పోషకాలు లభిస్తాయి. అదే ఉడికించిన, వేయించిన గుడ్డు తినడంవలన 90నుండి 95 శాతం ప్రొటీన్లు గ్రహిస్తుంది. వేడిమీద ఉడికించడం వలన బాక్టీరియా చనిపోతుంది. పచ్చి గుడ్డులోని బాక్టీరియా శరీరం బికాంప్లెక్స్ను గ్రహించకుండా చేస్తుంది. దీనివలన చర్మంపై రాషెస్, జుట్టు ఊడిపోవడంలాంటి సమస్యలకు కారణమవుతుంది. అందుకే ఉడికించిన లేదా వేయించిన గుడ్డుకంటే పచ్చి గుడ్లు ఆరోగ్యానికి ప్రమాదం.