ప్రస్తుత కాలంలో మారుతున్న వాతావరణ పరిస్థితులు బట్టి మరియు తీసుకుంటున్నా ఆహారపు అలవాట్లు బట్టి వయసుకు మించి చర్మంపై ముడతలు రావడం, చిన్న వయసులోనే ముసలివారీగా కనిపించడం వంటి సమస్యలు ప్రస్తుత కాలం ఎక్కువగా ఉంటున్నాయి. దీని కోసమే ఎన్నో పార్లర్ చుట్టూ లేదా హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ ఎంతో ధనాన్ని వెచ్చిస్తూ ఉంటారు. కానీ ఆశించిన ఫలితాలు లభిస్తూ ఉండవు. అంతేకాకుండా అవి తాత్కాలికంగా మాత్రమే పని చేస్తాయి. మరియు వాళ్ళు ఉపయోగించే వాటిలో ఉండే కెమికల్స్ వలన సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది.
అంతేకాకుండా వీటి వలన మన భవిష్యత్తులో కూడా చాలా నష్టాలు కలిగే అవకాశం ఉంది. ఇప్పుడు మనం చెప్పుకునే చిట్కా ఉపయోగించే పదార్థాలు నేచురల్ కనుక సైడ్ ఎఫెక్ట్స్ వంటివి ఉండవు. అంతేకాకుండా తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం కలుగుతుంది. ఈ చిట్కాను స్త్రీ, పురుషులు ప్రతి ఒక్కరు ఉపయోగించవచ్చు. ఈ చిట్కా కోసం మనకు ముందుగా కావాల్సింది కాఫీ పౌడర్. దీనికోసం మనం ఉపయోగించే ఏదైనా కాఫీ పౌడర్ ను ఉపయోగించవచ్చు. కాఫీ పౌడర్ మనకు లోపలికి మంచిది కాదు గాని, బాహ్యంగా ఉపయోగించుకోవచ్చు.
తర్వాత మనకు కావాల్సింది నాటు టమాటాలు. వీటిని నాలుగు, ఐదు తీసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ పేస్ట్ లో ఒక స్పూన్ కాఫీ పౌడర్ కలిపి మన చర్మం ఎక్కడైతే వదులుగా ఉందో ఆ స్థానంలో ఒక ప్యాక్ లాగా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్నాక అరగంట సేపు ఆరనివ్వాలి. ఇలా చేయడం ద్వారా ప్యాక్ డ్రై అయ్యి చర్మం మొత్తం బిగుతుగా అవుతుంది. ఆ తర్వాత నీటిగా స్నానం చేయాలి. కాఫీ పౌడర్ ని ఉపయోగించడం వలన మన చర్మం టైట్ అవడంతో పాటు చర్మం యొక్క తేజస్సు పెరుగుతుంది.
టమాటలో ఉండే విటమిన్ సి వలన చర్మంపై ఉన్న మృత కణాలు తొలగించబడతాయి. అంతేకాకుండా చర్మం యొక్క మెరుపును పెంచుతుంది. మరియు చర్మం బిగుతుగా అవడంలో సహాయపడుతుంది. కనుక ఇటువంటి నేచురల్ ప్యాక్ ను ఉపయోగించడం ద్వారా యవ్వనంగా కనిపించవచ్చు. అంతేకాకుండా వయసుకు మించి వచ్చిన ముడతలు నుంచి కూడా విడుదల పొందవచ్చు. ఇది మన ఒక సౌందర్యాన్ని పెంచుతుంది…