how to get instant sleep at night

మంచ మెక్కగానే గాఢ నిద్ర రావాలంటే ఇలా చేయండి

ప్రతి ఒక్కరూ ఒత్తిడి, మానసిక ఆందోళన వలన నిద్రకు దూరమవుతున్నారు. చిన్నపిల్లల్లో చదువు ఒత్తిడి పెంచి పెద్ద వారిలో ఉద్యోగస్తులలో పనివేళలు, సమయానికి పని అవ్వాలని టెన్షన్లు, స్త్రీలలో కుటుంబ బాధ్యతలు, హార్మోన్ ఇన్ బ్యాలెన్స్ వంటి సమస్యలు నిద్రను దూరం చేస్తాయి. వీటన్నింటి వలన నిద్రమాత్రలకు అలవాటు పడే వారు అనేకమంది అయితే సహజంగా మంచి నిద్ర  సొంతం చేసుకోవాలి. అంటే ఇంట్లోనే కొన్ని రకాల చిట్కాలు పాటించడం వలన పక్క పై చేరగానే నిద్రపోయేలా పనిచేస్తుంది. దాని కోసం మనం నాలుగు రకాల పదార్థాలు తీసుకోవాలి. ఇవి  నిద్రతో పాటు శరీరానికి కావలసిన పోషకాలను కూడా అందిస్తాయి. మనల్ని ఆరోగ్యంగా తయారు చేస్తాయి.

 దీనికోసం మనం 200 గ్రాముల ఎండు ఖర్జూరాలను తీసుకోవాలి. చాలామంది శరీరంలో వేడి చేసినప్పుడు ఎండు ఖర్జూరాలను నానబెట్టి వాటిని నమిలి మింగేసి ఆ నీటిని తాగుతారు. ఇది శరీరంలో వేడిని తగ్గించి టాక్సిన్లను బయటకు పంపించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఎండు ఖర్జూరాలను గింజలు తీసేసి చిన్న ముక్కలుగా చేసి పెట్టుకోవాలి. తరువాత ఒక 100 గ్రాములు బాదంపప్పులను తీసుకోవాలి. బాదం పప్పులు విటమిన్ ఈ తో పుష్కలంగా ఉంటాయి. శరీరాన్ని తేమగా ఉంచడంలోనూ, ఆరోగ్యంగా చేయడంలోనూ అద్భుతంగా పని చేస్తాయి. బాదంపప్పులో మెలటోనిన్ అధిక మోతాదులో ఉంటుంది. ఇది నిద్ర మరియు మేల్కొనే చక్రాన్ని నియంత్రించడంలో సహాయపడే హార్మోన్.  

1-ఔన్స్ (oz) మొత్తం బాదంపప్పులో 77 మిల్లీగ్రాముల (mg) మెగ్నీషియం మరియు 76 mg కాల్షియం ఉన్నాయి, ఇవి కండరాల సడలింపు మరియు నిద్రను ప్రోత్సహించడంలో సహాయపడే రెండు ఖనిజాలను కలిగి ఉంటాయి. తర్వాత 50 గ్రాముల గుమ్మడి గింజలు తీసుకోవాలి. అవి ట్రిప్టోఫాన్ యొక్క సహజ మూలాన్ని అందిస్తాయి, ఇది నిద్రను ప్రోత్సహించే అమైనో ఆమ్లం.  ప్రతిరోజూ 1 గ్రాము ట్రిప్టోఫాన్ నిద్రను మెరుగుపరుస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి.  గుమ్మడికాయ గింజలు కూడా మెగ్నీషియం మరియు జింక్ రెండింటినీ కలిగి ఉంటాయి.  జింక్ శరీరంలో సెరోటోనిన్ స్థాయిలను పెంచుతుందని చూపబడింది. ఇది మీ నిద్ర చక్రాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది.

తర్వాత 25గ్రాము‌ల గసగసాలు తీసుకోవాలి. మనం గమనిస్తే ఒక్కొక్క పదార్ధం సగం సగం తగ్గుతూ వస్తుంది. ఆ మోతాదులో మాత్రమే తీసుకోవాలి. గసగసాలలో మెగ్నీషియం సమృద్ధిగా ఉండటం వలన ఒత్తిడి హార్మోన్ అయిన కార్టిసాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది మరియు తద్వారా ఒత్తిడిని తగ్గించి, నిద్ర నాణ్యత, వ్యవధిని మెరుగుపరుస్తుంది మరియు ప్రశాంతమైన నిద్రను అందిస్తుంది.

ఇప్పుడు వీటన్నింటిని విడివిడిగా మిక్సీ పట్టుకోవాలి. ఎందుకంటే ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క టైం లిమిట్ లో మెత్తగా అవుతాయి. తరువాత వీటన్నింటినీ కలిపి ఒక గాజు సీసాలో వేసుకోవాలి. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో ఒక స్పూన్ పౌడర్ కలిపి తీసుకోవడం వలన శరీరానికి కావలసిన అనేక పోషకాలు అందడంతో పాటు మంచి నిద్ర కూడా లభిస్తుంది. క్యాల్షియం కూడా పుష్కలంగా లభిస్తుంది. ఇది శరీరంలో ఎముకలు బలంగా ఉండేలా చేస్తుంది. అనేక రకాల నొప్పులను కూడా నివారిస్తుంది.

Leave a Comment

error: Content is protected !!