జామకాయలు ఆరోగ్యానికి మంచిది అలానే జామ ఆకులు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. అది ఎలా అంటే జామ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. ఈ జామ ఆకులని కషాయంగా చేసుకొని తాగితే చాలా అద్భుత ఫలితాలు ఉంటాయి. ఈ కషాయాన్ని తాగడం వల్ల అనేక జబ్బులు తగ్గుతున్నాయని సైంటిఫిక్ గా నిరూపించడం జరిగింది. షుగర్ వ్యాధి వచ్చిన వారికి తగ్గించాలన్న, లేని వారికి రాకుండా చేయాలండి ఈ జామ ఆకులలో ఉండే బయో ఆక్టివ్ కాంపౌండ్స్ బాగా ఉపయోగపడుతుంది. కొంతమందికి షుగర్ వచ్చిన తర్వాత HbA1c టెస్ట్ చేస్తారు. ఇది 7-7.30 ఉంటే అలాంటి వారికి జామాకు కషాయం ఇచ్చారు.
ఒక 40 మందికి ఇచ్చి టోక్యోవారు పరిశోధన చేశారు. మూడు నెలల్లోనే వీరికి 5 వచ్చేసింది. ఇక రెండవది తీసుకుంటే స్త్రీలకి పీరియడ్స్ టైం లో నొప్పి వస్తూ ఉంటుంది. ఈ నొప్పి తగ్గించడానికి జామ ఆకుల్లో ఉండే బయో ఆక్టివ్ కాంపౌండ్స్ మజిల్స్ ని బాగా రిలాక్స్ చేస్తాయి.197 మంది ఆడవారికి పీరియడ్ టైం లో నొప్పి వచ్చేవారికి రోజుకి ఒక ఏడు ఎనిమిది గ్రాములు జామకులు తీసుకుని దాని కషాయాన్ని వీళ్ళు తీసుకున్నప్పుడు వాళ్లకి పెయిన్ బాగా తగ్గిందంట. దీనిని మెక్సికో వారు పరిశోధన చేశారు. మిగతా రావాలని తీసుకుంటే బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి ఫ్రీ రాడికల్స్ ను నిరోధించడానికి, ప్రేగులలో చెడ్డ బ్యాక్టీరియాని నిర్మూలించడానికి, ఉపయోగిస్తారు. ఒబెసిటీ ఉన్నవారికి ఫ్యాట్ ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఇక అతి ముఖ్యమైన లాభం తీసుకుంటే జుట్టు. జామకాయలో, జామ ఆకులలో విటమిన్ సి ఉంటుంది. ఈ జామ ఆకు పేస్ట్ ని జుట్టుకి రాసుకుంటే కుదుళ్లకు ఉండే కొల్లాజిన్ బ్యాండ్స్ ని హెల్దీగా చేసి జుట్టు కుదుళ్లకు బలంగా ఉండేలా చేస్తుంది. దీనితోపాటు జుట్టు నల్లగా ఒత్తుగా అవుతుంది. ఈ జామాకులనేవి ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించి టైప్ టు డయాబెటిస్ రాకుండా అడ్డుకుంటుంది. ఇలా కషాయం నాదే కాకుండా జామకు చిగురులను కూడా తినొచ్చు. కొద్దిగా జామాకులను తీసుకొని నీటిలో వేసి మరిగించి ఆ నీళ్లను వడకట్టి ఒక గ్లాస్ తీసుకొని దానికి ఒక తేనె కలిపి తాగితే చాలా మంచిది.
మార్కెట్లో జామకు పొడి కూడా లభిస్తుంది. దానిని కూడా డికాషన్ చేసుకుని తాగొచ్చు. ఈ ఆకులో ఔషధ గుణాలు ఎక్కువ ఉండడం వల్ల మనకు ఎంతో మేలు చేస్తుంది.