ప్రస్తుతం తో సంబంధం లేకుండా అన్ని వయసుల వారికి తెల్ల వెంట్రుకలు రావడం, జుట్టు రాలడం వంటి సమస్యలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. మానసిక ఒత్తిడి, ఆందోళన దీనికి ముఖ్య కారణం. దీనికోసం మార్కెట్ లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ ఉపయోగించినప్పటికి పెద్దగా ప్రయోజనం ఉండదు. ఇంట్లో వాడే చిట్కాలు వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. మనకు తెలియకుండానే వంట గదిలో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన పదార్థాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మొదటిగా ఉల్లిపాయలు. ఉల్లిపాయ రసం తీసి గుడ్డు కలిపి తలకు అప్లై చేసి ఒక అరగంట అలాగే ఉంచి తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. గుడ్డు మరియు ఉల్లిపాయ రెండు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. రెండవదిగా కొబ్బరి నూనె జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది రెండు రెండు చెంచాల అల్లం రసంలో రెండు చెంచాల కొబ్బరి నూనె కలిపి తలకు అప్లై చేసి అరగంట తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి.
ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల జుట్టు రాలడం సమస్య తగ్గుతుంది. మూడవ చిట్కా తమలపాకులు. తమలపాకులు జుట్టు ఎదుగుదలను బాగా ప్రోత్సహిస్తుంది. జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగడానికి తమలపాకు చాలా బాగా ఉపయోగపడుతుంది. తమలపాకు సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆరు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి తీసుకోవాలి. వెల్లుల్లిలో జుట్టుకు కావలసిన చాలా ప్రొటీన్లు, విటమిన్స్ ఉన్నాయి. బయటకి వెళ్ళినపుడు సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవడం వల్ల చర్మం ఎలా రక్షిస్తుందో అలాగే వెల్లుల్లి కూడా జుట్టుకు రక్షణ ఇస్తుంది.
మెంతులు మన జుట్టుకు కావలసిన పోషకాలను అందిస్తాయి. తగ్గించుకోవడానికి తయారు చేసే ఏ నూనెలో అయినా సరే మెంతులను ఉపయోగిస్తారు. అలాగే మెంతులు తలకు అప్లై చేసుకోవడం వలన మంచి ఫలితం ఉంటుంది. ఒక కడాయి తీసుకుని చిన్న బాటిల్ కొబ్బరి నూనె వేసుకోవాలి. నూనెలో మనం కట్చేసి పెట్టుకున్న తమలపాకు ముక్కలు వెల్లుల్లి రెమ్మలు రెండు చెంచాల మెంతులు వేసి బాగా మరిగించుకోవాలి. తమలపాకు, మెంతులు వెల్లుల్లి లో ఉండే పోషకాలు నూనెలోకి దిగుతాయి.
తర్వాత స్టౌ ఆఫ్ చేసి నూనె చల్లారనివ్వాలి. వడ కట్టుకొని గాజు సీసా లో స్టోర్ చేసుకోవాలి. ఈ నూనె వారానికి మూడుసార్లు డబల్ బాయిలర్ పద్ధతిలో వేడి చేసి తలకు అప్లై చేసి ఐదు నుంచి పది నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గి, జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. అప్లై చేయడం వల్ల జుట్టు కుదుళ్లు బలబడతాయి. జుట్టు కుదుళ్ల బలపడితే జుట్టు ఎదగడం కూడా స్పీడుగా జరుగుతుంది. ఈ నూనె అప్లై చేసిన తర్వాత ఒక గంట పాటు అలా ఉండనివ్వాలి.
తర్వాత ఏదైనా మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి. షాంపు లేని వాళ్ళు కుంకుడుకాయ లేదా శీకాకాయతో కూడా తలస్నానం చేయొచ్చు. కుంకుడు కాయలు నీటిలో వేసి మందార పూలు, మందార ఆకులను వేసి పది నిమిషాల పాటు ఉడికించి తర్వాత ఆ నీటితో తలస్నానం చేసినట్లయితే మంచిది.