ఉల్లిపాయ పేస్ట్ చేసి నిమ్మరసం కలిపి ఇన్ఫెక్షన్లు రాకుండా దీన్ని వాడుకోవచ్చు. ఈ పేస్ట్ ను చేతులకు ముఖ భాగానికి రాసుకుంటే గాలి ద్వారా మనకు వచ్చే కొన్ని ఫంగల్ ఇన్ఫెక్షన్లు గానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు గాని దురదలు రావడం గానీ దద్దుర్లు రావడం గానీ కొంచెం కలరు మారడం కానీ (ఇన్ఫెక్షన్ల వల్ల జరుగుతూ ఉంటాయి) లాంటివి తగ్గిస్తుంది.
ఉల్లిలో ఉండే పవర్ఫుల్ కెమికల్స్ మరియు యాంటీఆక్సిడెంట్స్ మూలాన మరియు నిమ్మరసంలో ఉండే యాంటీ సెప్టిక్ గుణాలు ఇలాంటి ఇన్ఫెక్షన్లు రాకుండా నివారించడానికి, స్కిన్ టోన్ హెల్తీగా ఉండటానికి ఉపయోగపడుతుంది.
ఈ ఉల్లి నిమ్మరసం కాంబినేషన్ స్కిన్ పైన ఉండే డెడ్ స్కిన్ సెల్స్ ను నివారణకు బాగా పనిచేస్తుంది ఈ డెడ్ స్కిల్స్ పోవడం వలన మన స్కిన్ చాలా ఫ్రెష్ గా ఉంటుంది. ఉల్లిపాయ బాహ్యంగానూ మరియు తల జుట్టుకు ఉల్లిపాయ మంచిది. కావున ఉల్లిపాయని ఈ విధంగా వాడుకొని ఆరోగ్యంగా ఉండండి.