హలో ఫ్రెండ్స్.. వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడు మన శరీరంలో కొన్ని చేంజెస్ రావడంతో పాటు అప్పుడప్పుడు మన పెదాలు కూడా మారిపోతాయి. పెదాలు డ్రైగా మారినప్పుడు సరైన కేర్ తీసుకోకపోతే పెదాలు కొద్దికొద్దిగా నల్లగా మారిపోయి పెదాలపై డార్క్ పిగ్మెంటేషన్ ఏర్పడుతుంది. ఈ పెదాలు నల్లగా మారడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు కూడా ఉన్నాయి.. స్మోకింగ్ చేయడం ఎలర్జీ రావడం నీరు తక్కువగా తాగడం మరియు చీప్ కాస్మెటిక్ ప్రొడక్ట్స్ ఎక్కువగా యూస్ చేయడం వల్ల కూడా మీ పెదాలు నల్లగా మారిపోతాయి.
చాలామంది తమ పెదాలను లైట్ గా సాఫ్ట్ గా మార్చుకోవడానికి రకరకాల కెమికల్ ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు. దీనివల్ల పెదాలపై ఎలాంటి రిజల్ట్ రాకపోగా పెదాలపై సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. కొంతమంది లిప్స్ కలర్ మార్చుకోవడానికి అనేక రకాల ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. వీటన్నిటిని పక్కన పెట్టి నేచురల్ పదార్థాలను ఉపయోగిస్తే మీ పెదాలపై ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పెదాలపై ఉండే నల్లధనం తొలిగిపోయి పెదాలు పింక్ గా మరియు మృదువుగా మారి పోతాయి. కొంతమందికి పుట్టుకతోనే పెదాలు డార్క్ గా ఉంటాయి. అలాంటి వారు కూడా నేచురల్ పదార్థాలను ప్రతిరోజు క్రమం తప్పకుండా ఉపయోగిస్తే కొంతకాలానికి వారి వారి పెదాలపై డార్క్ నెస్ పోయి సాఫ్ట్ మరియు పింక్ గా మారిపోతాయి. ఈ రోజు మన పెదాలను సాఫ్ట్ మరియు పింక్ గా మార్చుకోవడానికి కొన్ని అద్భుతమైన ఆయుర్వేద చిట్కాలు గురించి తెలుసుకుందాం
ఈ టిప్ కొరకు మనకు కావలసిన పదార్థాలు నిమ్మకాయ రోజ్ వాటర్ బీట్ రూట్ మరియు ఆలివ్ ఆయిల్. ముందుగా మీరు ఒక బీట్రూట్ని గ్రైండ్ చేసుకొని అందులోని రసాన్ని తీసుకోవాలి. ఒక బౌల్లో ఐదు చెంచాల బీట్రూట్ రసం వేసి తర్వాత అందులో రెండు చెంచాల ఆలివ్ ఆయిల్ మరియు రెండు చెంచాల రోజ్ వాటర్ వేసి చివరిగా ఒక నిమ్మకాయ రసం వేసి వీటన్నింటిని ఒక సారి బాగా కలుపుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని మీరు ఏదైనా గాజు సీసా లో వేసుకొని స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొద్దిగా తీసుకొని ప్రతి రోజు రాత్రి నిద్రపోయే ముందు పెదాలకు అప్లై చేసి రాత్రి మొత్తం వదిలేయండి. ఈ రెమిడి మీరు క్రమం తప్పకుండా వాడితే మీ పెదాలు పూర్తి శాతం లైట్ గా సాఫ్ట్ గా మారిపోతాయి.